అన్వేషించండి

Ambati Rayudu : పొలిటికల్ ఇన్నింగ్స్‌లోకి అంబటి రాయుడు - ఏ పార్టీలోకి అంటే ?

అంబటి రాయుడు ఏ పార్టీలో చేరబోతున్నారు ? క్రికెట్ లాగే రాజకీయాల్లో రాణించగలరా ?

 

Ambati Rayudu :   అంబటి రాయుడు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన దేశంలో సినిమా, క్రికెట్ స్టార్లకు ఉన్నంత క్రెజ్ ఎవరికీ ఉండదు. ఇక లోకల్ టాలెంటెడ్ ప్లేయర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అంబటి రాయుడు.. అనుకున్న విధంగా అంతర్జాతీయ స్థాయిలో రాణించలేకపోయాడు. కెరీర్‌లో వేసిన అనేక తప్పటడుగులు..రిటైర్మెంట్ల ప్రకటనలు.. వివాదాలు ఇలా అనేక మజిలీల తర్వాత ఇప్పుడు ఆయన చూపు పొలిటికల్ కెరీర్ వైపు పడింది. ప్రస్తుతం ఐపీఎల్ అయిన తర్వాత ఆయన గేమ్ నుంచి పూర్తిగా రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల వైపు చూడాలని అనుకుంటున్నరు. ఈ విషయాన్ని ఆయనే చెబుతున్నారు. 

క్రికెట్ నుంచి రాజకీయంలోకి మరో క్రికెటర్ ! 

గుంటూరులో పుట్టిన అంబటి  రాయుడు రాజకీయాల్లోకి రావాలని చాన్నాళ్ల నుంచి ఆలోచిస్తున్నారు.  ప్రజలకు సేవ చేసేందుకు ఇదే ఉత్తమ మార్గం అనుకుంటున్నానని  కొందరిని కలిసిన తర్వాత తుది నిర్ణయం చెబుతానంటున్నారు.   ఏ పార్టీలో చేరాలన్నది కూడా అప్పుడే తెలుస్తుంది’ అని రాయుడు చెప్పాడు. హైదరాబాద్‌‌‌‌లో క్రికెటర్‌‌‌‌ కెరీర్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేసినప్పటికీ  తెలంగాణలో కాకుండా ఏపీలోనే పొలిటికల్‌‌‌‌ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.  ఏపీలో బలమైన కాపు వర్గానికి చెందిన రాయుడు తన సొంత జిల్లా అయిన గుంటూరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఏ పార్టీ అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 

ప్రధాన రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తాయి. .. కానీ టిక్కెట్ ఇస్తాయా ?

ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ,  టీడీపీలు అంబటి రాయుడు పార్టీలో చేరుతానంటే ఖచ్చితంగా ఆహ్వానిస్తాయి. కానీ పోటీ చేయడానికి టిక్కెట్ కేటాయించడం మాత్రం కష్టమని చెబుతున్నారు. ఎందుకంటే రెండు పార్టీల్లో కష్టపడిన నేతలు ఉన్నారు. రాత్రికి రాత్రి వచ్చిన వారికి టిక్కెట్ ఇవ్వడం సాధ్యం కాదు. క్రికెటర్ ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకోవాలని అనుకుంటారు కానీ.. అలా ఓట్లు పడతాయని మాత్రం అనుకోరు. అందుకే అంబటి రాయుడు ఆయా పార్టీలో చేరినంత మాత్రాన వెంటనే టిక్కెట్ లభించడం కష్టం. అయితే బీఆర్ఎస్ నుంచి అంబటిరాయుడు ఆఫర్ వెళ్లినట్లుగా చెబుతున్నారు.  బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఏపీ ప్రెసిడెంట్​ తోట చంద్రశేఖర్‌‌‌‌.. బీఆర్ఎస్‌లో చేరి గుంటూరు పశ్చిమ నుంచి  పోటీ చేయాలని ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు. అయితే అంబటి ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. 

అంబటి మనస్థత్వం రాజకీయాలకు వర్కవుట్ అవుతుందా ?

అంబటి రాయుడు దూకుడైన మనస్థత్వం ఉన్న వ్యక్తి. వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత మారుస్తారు. క్రికెటర్ గా ఆయన తీసుకున్న నిర్ణయాలే కెరీర్ ను డ్యామేజ్ చేశాయి. బీసీసీఐకి పోటీగా పెట్టిన లీగ్ లో చేరి..  చాలా కాలం సమయం వృధా చేసుకున్నారు. తర్వాత మళ్లీ బీసీసీఐ పరిధిలోకి వచ్చినా అనవసర ఆగ్రహాలతో చాలా సార్లు అవకాశాలు కోల్పోయారు. ఓ సారి రిటైర్మెంట్ కూడా ప్రకటించేశారు. కానీ మళ్లీ ఆటలోకి వచ్చారు. అలా అనేక పరిణామాలతో ఆయన తీరు కాస్త వివాదాస్పదంగా ఉంటుంది. ఆయన రాజకీయాల్లో ఇలా ఉంటే... ఏ పార్టీలోనూ నిలకడగా ఉండలేరని.. క్రికెటర్ గా కంటే వేగంగా పొలిటికల్ కెరీర్ ముగిసిపోతుందని అంచనా వేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Legislative Council: ఏపీ శాసనమండలిలో లోకేష్ ఉగ్రరూపం - సైలెంట్ అయిపోయిన వైసీపీ ఎమ్మెల్సీలు - ఇదీ జరిగింది !
ఏపీ శాసనమండలిలో లోకేష్ ఉగ్రరూపం - సైలెంట్ అయిపోయిన వైసీపీ ఎమ్మెల్సీలు - ఇదీ జరిగింది !
Crime News: సంగారెడ్డి జిల్లాలో దారుణం - నడిరోడ్డుపైనే తల్లీకొడుకులను పొడిచి చంపేశాడు
సంగారెడ్డి జిల్లాలో దారుణం - నడిరోడ్డుపైనే తల్లీకొడుకులను పొడిచి చంపేశాడు
Refurbished Laptop Buying Tips: రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? - అయితే వీటిని కచ్చితంగా పాటించాల్సిందే!
రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? - అయితే వీటిని కచ్చితంగా పాటించాల్సిందే!
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేటీఆర్ ఇంటి ముందు రాత్రంతా బీఆర్ఎస్ నేతలుపట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council: ఏపీ శాసనమండలిలో లోకేష్ ఉగ్రరూపం - సైలెంట్ అయిపోయిన వైసీపీ ఎమ్మెల్సీలు - ఇదీ జరిగింది !
ఏపీ శాసనమండలిలో లోకేష్ ఉగ్రరూపం - సైలెంట్ అయిపోయిన వైసీపీ ఎమ్మెల్సీలు - ఇదీ జరిగింది !
Crime News: సంగారెడ్డి జిల్లాలో దారుణం - నడిరోడ్డుపైనే తల్లీకొడుకులను పొడిచి చంపేశాడు
సంగారెడ్డి జిల్లాలో దారుణం - నడిరోడ్డుపైనే తల్లీకొడుకులను పొడిచి చంపేశాడు
Refurbished Laptop Buying Tips: రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? - అయితే వీటిని కచ్చితంగా పాటించాల్సిందే!
రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? - అయితే వీటిని కచ్చితంగా పాటించాల్సిందే!
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Unstoppable With NBK S4: 'అన్ స్టాపబుల్ 4'లో పవన్ గురించి బాలయ్య పవర్ ఫుల్ క్వశ్చన్ - అల్లు అర్జున్ ఐకానిక్ ఆన్సర్
'అన్ స్టాపబుల్ 4'లో పవన్ గురించి బాలయ్య పవర్ ఫుల్ క్వశ్చన్ - అల్లు అర్జున్ ఐకానిక్ ఆన్సర్
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Sravanthi Chokarapu : ఆసుపత్రి బెడ్‌పై స్రవంతి- మీ ఆశీస్సులు కావాలని విజప్తి- ఇలాంటి పోస్ట్ పెడతానని అనుకోలేదంటూ ఎమోషనల్‌
ఆసుపత్రి బెడ్‌పై స్రవంతి- మీ ఆశీస్సులు కావాలని విజప్తి- ఇలాంటి పోస్ట్ పెడతానని అనుకోలేదంటూ ఎమోషనల్‌
Embed widget