By: ABP Desam | Updated at : 09 Apr 2023 08:00 AM (IST)
మోదీపై బీఆర్ఎస్ నేతలంతా ఎటాక్ - కానీ కేసీఆర్ ఎందుకు సైలెంట్ ?
CM KCR Silent : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. పరేడ్ గ్రౌండ్ లో బహిరంగసభలో మాట్లాడారు. కేసీఆర్‌కు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై చాలా ఆరోపణలు చేశారు. నిజానికి ఈ సభలో కేసీఆర్ కూడా పాల్గొనాల్సి ఉంది. ఆయన పాల్గొంటే ఇలాంటి ఆరోపణలు చేసేవారో లేదో తెలియదు కానీ.. ఆయన రాలేదు కాబట్టి మోదీ స్వేచ్చగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నరేంద్రమోదీ విమర్శలపై బీఆర్ఎస్ పార్టీ నేతలు వెంటనే స్పందించారు. హరీష్ రావు దగ్గర్నుంచి కింది స్థాయి ఎమ్మెల్యే వరకూ స్పందించారు. అయితే ఎవీరు ఎవరు స్పందించినా... పెద్దగా లెక్కలోకి రాదు. కేవలం.. కేసీఆర్ స్పందిస్తేనే హాట్ టాపిక్ అవుతుంది.
గతంలో మోదీ, అమిత్ షాల విమర్శలకు నేరుగా కౌంటర్ ఇచ్చిన కేసీార్!
గతంలో అమిత్ షా లేదా ప్రధానమంత్రి వచ్చిన పోయిన తర్వాత వెంటనే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి వారు చేసిన ఆరోపణల్ని ఖండించడం కామన్ గా జరిగేది. గత ఏడాది ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చే ముందు ప్రెస్ మీట్ పెట్టి తనపై మోదీ విమర్శలు చేస్తారని.. అందుకే తానే ముందుగా సవాళ్లు చేస్తున్ననని ప్రకటించారు. అయితే ప్రధాని మోదీ కేసీఆర్ సంధించిన ప్రశ్నలపై స్పందించలేదు. ఆ మాటకొస్తే కేసీఆర్ ప్రభుత్వాన్ని పెద్దగా విమర్శించకుండా వెళ్లిపోయారు. ఆ సమయంలోనే తాను ప్రతీ రోజూ ప్రెస్ మీట్ పెడతానని హెచ్చరించారు కూడా. కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే కనీసం గంటన్నర మాట్లాడతారు. అన్ని అంశాలపై సమగ్రంగా స్పందిస్తారు. కానీ ఈ సారి మోదీ పర్యటనపై కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారు. ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.
కేటీఆర్ కూడా స్పందించలేదు!
ప్రధాని మోదీ స్పీచ్ అయిపోయిన తర్వాత హరష్ రావు సహా అనేక మంది నేతలు స్పందించారు. కొంత మంది ప్రెస్ మీట్లు పెడితే..మరికొంత మంది సోషల్ మీడియాలో స్పందించారు. మోదీనే తప్పు చేశారని వాదించారు. మోదీ పర్యటన రోజున సింగరేణి విషయంలో మహాధర్నాలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. అయితే కేటీఆర్ కూడా ప్రధాని మోదీ విమర్శలపై స్పందించలేదు. నిజానికి కేసీఆర్ బీజేపీతో పూర్తిగా శత్రుత్వం వచ్చిన తర్వాత అసలు వెనక్కి తగ్గడం లేదు. అయితే ఇప్పుడు మాత్రం కేసీఆర్ ప్రెస్ మీట్లకు దూరంగా ఉన్నారు. ఇటీవల మహారాష్ట్ర నాయకులు బీఆర్ఎస్‌లో చేరే సమయంలో మోదీని విమర్శించే సమయానికి వీడియో కెమెరాలను ఆపు చేయించారన్న వార్తలు వచ్ాయి. మోదీ చేసినవి చిన్న విమర్శలేం కాదు.. అవినీతి ఆరోపణలు చేశారు. అభివృద్ధి చేయడం లేదన్నారు. వీటికి కేసీఆర్ స్థాయి నేత కౌంటర్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ వాయిస్ గట్టిగా ప్రజల్లోకి వెళ్లదన్న వాదన వినిపిస్తుంది. మరి కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారో బఆర్ఎస్ నేతలకు స్పష్టత లేదు.
వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా ?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అపర చాణక్యుడన్న బిరుదు ఉంది. రాజకీయాలంటే ఆవేశంతో కాదు ఆలోచనతో చేయాలనేది ఆయన వ్యూహం. అందుకే అవసరం అనుకున్నప్పుడు ఆవేశంగా స్పందిస్తారు. లేదు.. అంతకుమించిన వ్యూహం ఉందనుకుప్పుడు ఎన్ని విమర్శలు వస్తున్నాసైలెంట్ గానే ఉంటారు. చివరికి ఎవరూ ఊహించని విధంగా మలుపు తిప్పుతారు. ఇప్పుడు కూడా అలాంటిదేమైనా ఉందో లేదో కానీ.. కేసీఆర్ మౌనం మాత్రం బీఆర్ఎస్ నేతలకు పజిల్‌గా మారుతోంది.
Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!
AP BJP Kiran : బీజేపీలో చేరినా సైలెంట్ గానే కిరణ్ కుమార్ రెడ్డి - హైకమాండ్ ఏ పనీ చెప్పడం లేదా ?
BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?
Rajahmundry MP Bharat: చంద్రబాబు ఒక ఆల్ ఫ్రీ బాబా, దసరా మేనిఫెస్టో అక్కడినుంచే కాపీ కొడతారు- ఎంపీ భరత్ జోష్యం
Pankaja Munde: నేను బీజేపీలో ఉన్నాను, కానీ ఇది నా పార్టీ కాదు: మహారాష్ట్ర మాజీ మంత్రి పంకజా ముండే
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?
Coromandel Express Accident: రాంగ్ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్