అన్వేషించండి

BJP Mission Telangana: బెంగాల్ అయిపోయింది..ఇక తెలంగాణే - పరేడ్ గ్రౌండ్స్ వేదికగా మోదీ సమరశంఖం - రాజకీయం మారిపోతుందా?

Telangana BJP: బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించి, మమతా బెనర్జీ పాలనకు చరమగీతం పాడిన ఉత్సాహంలో ఉన్న బీజేపీ.. ఇప్పుడు తదుపరి లక్ష్యంగా తెలంగాణ ను ఎంచుకుంది. ప్రధాని మోదీ రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు.

Telangana Modi action plan ready: పశ్చిమ బెంగాల్ కోటను బద్దలు కొట్టిన బీజేపీ అధిష్టానం, ఇప్పుడు తన విజయ యాత్రను దక్షిణ భారతం వైపు మళ్లించింది. 15 ఏళ్ల కిందట బెంగాల్‌లో నామమాత్రంగా ఉన్న శక్తి, నేడు 207 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకోవడం వెనుక ఉన్న సైలెంట్ ఆపరేషన్  వ్యూహాలను ఇప్పుడు తెలంగాణలో అమలు చేసేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న సభ  ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం పూరించబోతున్నారు.

 జీరో నుంచి హీరోగా.. బెంగాల్ మోడల్ తెలంగాణలో! 

బెంగాల్‌లో మమతా బెనర్జీ వంటి ఉద్ధండురాలిని ఓడించడం ద్వారా బీజేపీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది. అదే తరహాలో తెలంగాణలో ఇప్పటికే ఉన్న ఎనిమిది మంది ఎంపీల బలంతో, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని మోదీ-షా ద్వయం భావిస్తోంది. బెంగాల్ గెలవగలిగితే.. తెలంగాణ ఎందుకు సాధ్యం కాదు  అనే నినాదంతో బీజేపీ ముందుకు వెళుతోంది. ఈ సభ ద్వారా సుమారు  8,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూనే, రాజకీయ మార్పుకు మోదీ పిలుపునివ్వనున్నారు.

 పరేడ్ గ్రౌండ్స్ సాక్షిగా..  విజయ్  సంకేతం! 

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలవబోయేది తామేనని మోదీ ఈ సభ ద్వారా అధికారికంగా ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయం కేవలం బీజేపీయేనని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ఈ సభ ప్రధాన ఉద్దేశ్యం. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ వంటి నేతలు  టీమ్ మోదీ  పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.  వికసిత్ తెలంగాణ నినాదంతో తో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన పార్టీ, ఇప్పుడు మోదీ సభతో పీక్ స్టేజ్‌కు చేరుకోవాలని చూస్తోంది.

అండర్ కరెంట్ వ్యూహాలు.. సైలెంట్ ఆపరేషన్ 

బెంగాల్‌లో ఎలాగైతే కిందిస్థాయి ఓటర్లను మచ్చిక చేసుకున్నారో, తెలంగాణలోనూ అదే తరహా  సైలెంట్ ఆపరేషన్ ప్రారంభమైంది. ఇతర పార్టీల అసంతృప్త నేతలను చేర్చుకోవడం, కుల సమీకరణలను సరిదిద్దడం, కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్ వంటి వాటిని ఇంటింటికీ తీసుకెళ్లడం ద్వారా ఓటు బ్యాంకును పటిష్టం చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా యువత,  మహిళా ఓటర్లను టార్గెట్ చేస్తూ బీజేపీ సోషల్ మీడియా సైన్యం రంగంలోకి దిగింది. బీజేపీ అంచనా ప్రకారం, దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత పార్టీకి అత్యంత అనుకూలమైన రాష్ట్రం తెలంగాణ. ఇక్కడ ఇప్పటికే బలమైన ఓటు శాతం ఉండటం, నాయకత్వం చురుగ్గా ఉండటం వల్ల కొంచెం కష్టపడితే అధికారం సాధ్యమని అమిత్ షా బృందం లెక్కలు వేస్తోంది. బెంగాల్ విజయం అందించిన ఊపుతో, తెలంగాణలో డబుల్ ఇంజిన్  సర్కారు ఆవశ్యకతను మోదీ తన ప్రసంగంలో నొక్కి చెప్పనున్నారు.

 తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు! 

మోదీ మే 10 పర్యటన కేవలం అభివృద్ధి పనుల ప్రారంభానికే పరిమితం కాదు. ఇది తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఒక భారీ బహిరంగ సభ. బెంగాల్ ఓటమితో ప్రతిపక్ష  ఇండియా  కూటమి నైతిక దెబ్బ తిన్న తరుణంలో, ఆ గ్యాప్‌ను క్యాష్ చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. పరేడ్ గ్రౌండ్స్ గర్జన తర్వాత తెలంగాణ రాజకీయాలు మరోసారి  త్రిముఖ పోరు  నుంచి బిజెపి వర్సెస్ అదర్స్ గా మారే అవకాశం కనిపిస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని బీజేపీ దగ్గరకు రానీయడం లేదు: ఏపీ మంత్రి సంచలనం
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని బీజేపీ దగ్గరకు రానీయడం లేదు: ఏపీ మంత్రి సంచలనం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Revanth Reddy Sircilla Visit: కేసీఆర్, కేటీఆర్ కోటలపై రేవంత్ కన్ను - సిరిసిల్ల, గజ్వేల్‌లలో వేల కోట్ల అభివృద్ధి పనుల వ్యూహం.. గులాబీ పట్టును తగ్గించడం సాధ్యమేనా?
కేసీఆర్, కేటీఆర్ కోటలపై రేవంత్ కన్ను - సిరిసిల్ల, గజ్వేల్‌లలో వేల కోట్ల అభివృద్ధి పనుల వ్యూహం.. గులాబీ పట్టును తగ్గించడం సాధ్యమేనా?
AP Sachivalayam Sports Quota Scam: డీఎస్సీ ఆరోపణలపై కౌంటర్ ఎటాక్ - ఏపీ సచివాలయ ఉద్యోగాల్లో క్రీడా కోటా అక్రమాలపై త్వరలోనే శ్వేతపత్రం ?
డీఎస్సీ ఆరోపణలపై కౌంటర్ ఎటాక్ - ఏపీ సచివాలయ ఉద్యోగాల్లో క్రీడా కోటా అక్రమాలపై త్వరలోనే శ్వేతపత్రం ?

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Neeru Dhanda Clinches Shooting Gold: వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
Embed widget