Case On Raghurama : ఏపీ ఇంటలిజెన్స్ పోలీసుపై దాడి - రఘురామపై హైదరాబాద్‌లో కేసు !
వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై హైదరాబాద్‌లో కేసు నమోదయింది. తనపై దాడి చేశారని ఏపీ ఇంటలిజెన్స్ పోలీసు కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు.
Case On Raghurama : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తనపై దాడి చేశారని ఏపీ ఇంటలిజెన్స్ పోలీసు ఫరూక్ భాషా ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. ధి నిర్వహణలో భాగంగా తాను బౌల్డర్ హిల్స్ వద్ద ఉండగా కారులో నలుగురు వ్యక్తులు వచ్చి, తనను బలవంతంగా ఎక్కించుకొని ఎంపీ రఘురామ ఇంటికి తీసుకువెళ్లి చిత్రహింసలకు గురిచేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రఘురామ కుమారుడు భరత్, పీఏ శాస్త్రి, ఇద్దరు సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఏ1గా రఘురామ, ఏ2 భరత్, ఏ3 సీఆర్‌పీఎఫ్ ఏఎస్సై, ఏ4 కానిస్టేబుల్ సందీప్, ఏ5 పీఏ శాస్త్రిని చేర్చారు. రఘురామ ఇంట్లోకి చొరబడుతూండగా ఫరూక్ భాషాను రఘురామ భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఆయన దగ్గర ఎలాంటి ఐడీ కార్జులు లేకపోవడంతో పోలీసులకు అప్పగించారు.
ఆ 20 మందిపై కేసులు పెట్టండి - టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై విజయసాయి ఫిర్యాదు!
అయితే రఘురామ ఇంటి వద్ద ఇంటలిజెన్స్ పోలీసులను నిఘా పెట్టలేదని ఏపీ పోలీసులు ప్రకటించారు. ప్రధాని పర్యటన సందర్బంగా కానిస్టేబుల్ ఐఎస్‌బీ గేట్ వద్ద స్పాటర్‌గా ఉన్నాడని తెలిపారు. ఏపీ ఇంటలిజెన్స్ పోలీసులకు హైదరాబాద్‌లో డ్యూటీ వేసినట్లుగా ఏపీ పోలీసులు ెబుతున్నారు. కానిస్టేబుల్ ఫరూక్ విధులకు, రఘురామ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. రఘురామ ఇంటికి కిలోమీటర్ దూరంలో ఫరూక్ విధుల్లో ఉన్నాడని తెలిపారు. అక్కడ్నుంచే రఘురామ భద్రతా సిబ్బంది ఫరూక్ ను తీసుకెళ్లారని చెప్పారు.
పరిటాల రవి తరహాలో హత్యకు కుట్ర - సైబరాబాద్ సీపీ సహకరిస్తున్నారని రఘురామ సంచలన ఆరోపణలు !
ఈ విషయం పై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంపీ రఘురామరాజు లేఖ రాశారు. మా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన ఆగంతకుడిని పోలీసులకు పట్టించాం. అయిన ఇప్పటి వరకు పోలీసుల నుండి ఎలాంటి సమాచారం లేదు. ఏపీ పోలీసులకు సీపీ స్టీఫెన్ రవీంద్ర మద్దతిస్తున్నారు. నా భద్రత సిబ్బందిపై కేసులు పెట్టాలని… గచ్చిబౌలి పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లేఖ రాసిన కాసేపటికే రఘురామతో పాటు ఆయన కుమారుడిపైనా కేసులు పెట్టినట్లుగా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది.
ఏపీలో విద్యార్థులకు ఫ్రీగా ట్యాబ్‌లు, ఎప్పుడిస్తారో చెప్పిన సీఎం జగన్ - విద్యాకానుక కిట్ల పంపిణీ