KA Palul AP : పాల్ రావాలి - పాలన మారాలి ! ఏపీలో 54 శాతం ప్రజలు ఇదే అంటున్నారట
ఏపీలో 54 శాతం మంది ప్రజలు పాల్ పాలన రావాలని కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని కేఏ పాల్ చెబుతున్నారు.
KA Palul AP : ఆంధ్రప్రదేశ్‌లో 54 శాతం ఆంధ్రులు కే ఏ పాల్ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్టు తాజా సర్వే లో తేలిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. తన సర్వే గురించి తానే ప్రకటించుకోవడం ఆయన స్టైల్. అందుకే ఏకంగా 54 శాతం మంది తన నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లుగా ప్రకటించారు. చంద్రబాబు, కేసీఅర్ ల అవినీతి పై కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేశానని.. మోడీ, అమిత్ షా లతో రహస్యంగా అనేక సార్లు కలిశానని చెప్పుకొచ్చారు. రాజ్యసభకు వెళ్లి కేంద్ర మంత్రి పదవి తీసుకోవాలని బీజేపీ నేతలు కోరారని కానీ తానే వద్దన్నాన్నారు.
మా కుమారుడ్ని విడిపించండి - సీజేఐకి కోడికత్తి శ్రీను తల్లిదండ్రుల లేఖ !
కేఏ పాల్ ఏపీలో రాజకీయ పర్యటన చేస్తున్నారు. పాల్ రావాలి - పాలన మారాలి నినాదంతో ఆయన విశాఖ నుంచి యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలు వరకూ యాత్ర చేస్తారు. గతంలో ఆయన తెలంగాణలో పర్యటించారు. పెద్ద ఎత్తున రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమరవీరుల కుటుంబాలను పార్టీలో చేర్చుకుని రాజకీయం చేయడంతో ఆయనకు కొంత ప్రతిఘటన తెలంగాణలో ఎదురయింది. అమరవీరుడు శ్రీకాంతాచారి తండ్రికి తొలి టిక్కెట్ ప్రకటించారు. అయితే ఆయన కుటుంబం నుంచి వ్యతిరేకత వచ్చింది.
పులివెందుల నుంచి వైఎస్ సునీత పోటీ చేస్తారా ? ప్రచారంలో నిజం ఎంతంటే ?
తెలంగాణ ప్రభుత్వంపై సీబీఐ చీఫ్‌కు కూడా ఫిర్యాదు చేసి కలకలం రేపారు. బీజేపీ మద్దతుతోనే టీఆర్ఎస్‌కు ఆయన చికాకులు తెప్పిస్తున్నారన్న ప్రచారం జరిగింది. అమిత్ షాతో సమావేశం కావడం కూడా చర్చనీయాంశమయింది. అయితే తాను రెండు రాష్ట్రాల్లోనూ ప్రచారం చేస్తున్నామని.. తమ పార్టీ రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుందని ఆయన చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన నర్సాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ మూడు వేల ఓట్లు కూడా రాలేదు. అప్పట్లో ఆయన చేసిన హడావుడి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వైఎస్ఆర్‌సీపీ జీవితకాల అధ్యక్షుడు జగన్ - ప్లీనరీలో తీర్మానం ! రాజ్యాంగపరంగా సాధ్యమేనా ?
కేఏ పాల్ ను సోషల్ మీడియాలో ఎంత మంది ట్రోల్ చేసినా ఆయన స్పోర్టివ్‌గానే తీసుకుంటున్నారు. తాను కామెడీ చేస్తున్నా... జనం తన వెంటే ఉన్నారని నమ్ముతూ ఉంటారు. ఒకప్పుడు ఆయన మత ప్రచార సభ పెడితే.. ఇసుక వేస్తే రాలనంత మంది జనం వచ్చేవారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలా కామెడీగా మారడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే ఉంటారు అయితే పాల్ మాత్రం అలాంటివి పట్టించుకోరు.