Kodikatti Seenu parents Letter To CJI : మా కుమారుడ్ని విడిపించండి - సీజేఐకి కోడికత్తి శ్రీను తల్లిదండ్రుల లేఖ !
తమ కుమారుడు నాలుగేళ్లుగా జైల్లోనే ఉన్నాడని సీజేఐకి కోడికత్తి శ్రీను తల్లిదండ్రులు లేఖ రాశారు. న్యాయం చేయాలని కోరారు.
Kodikatti Seenu parents Letter To CJI : వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తిదో డాడి చేసిన జన్పల్లి శ్రీనివాసరావు తల్లిదండ్రులు సుప్రీంకోర్టు సీజేఐకి లేఖ రాశారు. జనపల్లి శ్రీనివాస్ ఇంకా రిమాండ్ ఖైదీగానే ఉన్నాడు. అరెస్టయినప్పటి నుండి ఆయన జైల్లో ఉన్నారు. మధ్యలో ఒకటి రెండు సార్లు ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా ప్రయోజనం లేకపోయింది. కేసును ఎన్‌ఐఏ విచారణ జరుపుతూండటంతో బెయిల్ దొరకడం కష్టంగా మారింది. జనిపల్లి శ్రీనివాస్ తల్లి సావిత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు.
నాలుగేళ్లుగా తన కుమారుడిని రిమాండ్ ఖైదీగానే కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు శ్రీనివాస్‌ను తక్షణమే విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కోడికత్తి దాడి కేసులో నిందితునిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్ ఆ నాటి నుంచి రిమాండ్ ఖైదీ గానే ఉన్నాడని సుప్రీంకోర్టు సీజేఐకి రాసిన లేఖలో శ్రీనివాస్ తల్లి జనిపల్లి సావిత్రి పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం ఎన్‌ఐఏ విచారణ జరిపినప్పటికి ఇంతవరకు తన కుమారుడి పట్ల తమకు న్యాయం జరగలేదని లేఖలో సావిత్రి పేర్కొన్నారు.
పులివెందుల నుంచి వైఎస్ సునీత పోటీ చేస్తారా ? ప్రచారంలో నిజం ఎంతంటే ?
ఇప్పటికైనా న్యాయస్థానం స్పందించి నాకుమారుడు జనిపల్లి శ్రీనివాస్ ని విడుదల చేయాలని మొరపెట్టుకున్నారు శ్రీనివాస్ తల్లితండ్రులు. 2018లో విజయనగరం జిల్లాలో పాదయాత్ర అనంతరం జగన్ హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఓ యవకుడు ఒక్కసారిగా కోడి పందేల్లో వాడే కత్తితో జగన్‌పై దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కేశవపురం పోస్టుమాస్టర్ ఘరానా మోసం, డిపాజిట్ దారుల సొమ్ముతో పరారీ
ఎయిర్‌పోర్టులో జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన తర్వాత జనపల్లి శ్రీనివాసరావు .., తాను దాడి చేస్తే జగన్‌పై ప్రజల్లో సానుభూతి వస్తుందని దాని వల్ల భారీ విజయంతో గెలుస్తారని ఆ దాడి చేసినట్లుగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అయితే రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్తీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి ఎన్‌ఐఏతో విచారణకు ఆదేశాలు తెచ్చారు. ఈ కేసును ఎన్ఐఏ టేకప్ చేసినా ఇప్పటి వరకూ ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ కారణంగా జనపల్లి శ్రీనివాసరావు ఇంకా జైల్లో ఉన్నారు. ఆయన పేరు కోడికత్తి శ్రీనుగా ప్రచారంలోకి వచ్చింది.,