ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహా జిల్లా ఉన్నతాధికారులు ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. నగర వీధుల్లో సైకిల్‌పై లైవ్ రివ్యూ చేశారు.
ఉదయాన్నే మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సైకిల్‌పై పర్యటించారు.
నగరంలోని వీధులు తిరిగి స్థానిక ప్రజలతో మాట్లాడారు. మిషన్ భగీరథ, రోడ్లు, వీధి దీపాలు, పైప్ లైన్ పనులు, రోడ్డు విస్తరణ పనులు, కాల్వలు తదితర పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఖమ్మం నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ రోడ్, సుందరయ్య నగర్, ప్రకాష్ నగర్, మార్కెట్ రోడ్, పంపింగ్ వెల్ రోడ్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రోడ్, మయూరి సెంటర్, పాత బస్టాండ్, ఆర్డీవో కార్యాలయం, జడ్పీ సెంటర్, కలెక్టరేట్, వైరా రోడ్‌లో పర్యటించారు.
ట్యాంక్ బండ్ వద్ద మొక్కలు నాటారు. కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అన్ని పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
పేద ప్రజలకు క్షేత్రస్థాయిలో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వైద్య సౌకర్యాల్లో భాగంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అధునాతన సిటీ స్కాన్ యంత్రాన్ని పువ్వాడ ప్రారంభించారు.
In Pics : వరంగల్ లో కాంగ్రెస్ రైతు సంఘర్షణ సభ, హాజరైన రాహుల్ గాంధీ
In Pics: అగ్ని ప్రమాద బాధితుల వద్దకు సీతక్క - పెద్దమనసుతో తక్షణం ఆదుకున్న ఎమ్మెల్యే
Mahila Bandhu Photos: రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మహిళా బంధు కేసీఆర్ వేడుకలు
In Pics: మహిళా మంత్రి, ఎంపీ కబడ్డీ ఆట చూస్తారా? జనాలతో కలిసి జాలీగా
Bandi Sanjay At Medaram Jatara: మేడారంలో మొక్కులు చెల్లించిన బీజేపీ చీఫ్ బండి సంజయ్
IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?
Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్
Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్
Bandi Sanjay : తెలంగాణకు మోదీ నిధులిస్తుంటే, కేసీఆర్ దారి మళ్లిస్తున్నారు- బండి సంజయ్