జమ్ము ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్‌కు (Umran Malik) పాకిస్థాన్ పేసర్ షాహిన్ అఫ్రిది కొన్ని సలహాలు ఇచ్చాడు. అత్యున్నత క్రికెట్లో సక్సెవ్ అవ్వాలంటే నిలకడ ముఖ్యమని చెప్పాడు.
అత్యంత వేగంగా బంతులు విసిరితే సరిపోదని అఫ్రిది అంటున్నాడు. సరైన లైన్ అండ్ లెంగ్త్, స్వింగ్ ముఖ్యమని వెల్లడించాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌కు ముందు ఓ ఇంటర్వ్యూలో ఉమ్రాన్ మాలిక్ గురించి పరోక్షంగా మాట్లాడాడు. అతడు పొగిడాడో, ఉచిత సలహా ఇచ్చాడో అర్థమవ్వకపోవడంతో నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు.
గత సీజన్లో మెరుపు వేగంతో బంతులేసిన ఉమ్రాన్ మాలిక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.4 కోట్లతో ఈ ఏడాది రీటెయిన్ చేసుకుంది. వారి నమ్మకానికి తగ్గట్టే ఉమ్రాన్ రాణించాడు. 157 కిలోమీటర్ల వేగంతో బంతులేశాడు.
ఐపీఎల్ 2022లో 14 మ్యాచులాడిన ఉమ్రాన్ 22 వికెట్లు పడగొట్టాడు. 9.3 ఎకానమీ, 20.18 సగటుతో అదరగొట్టాడు. లైన్ అండ్ లెంగ్త్‌ను సరిచేసుకుంటే పరుగుల్ని ఇంకా నియంత్రించగలడు.
ఐపీఎల్ 2022లో అద్భుతంగా ఆడిన ఉమ్రాన్ మాలిక్‌కు టీమ్‌ఇండియా నుంచి పిలుపు వచ్చింది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీసుకు అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు. ఐదు మ్యాచుల సిరీస్ కాబట్టి తప్పకుండా అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
Harry Brook, SRH: కోట్ల కుర్రాడు.. కొట్టే కుర్రాడు! SRH డెన్లోకి హ్యారీబ్రూక్ ఆగయా!
Ellyse Perry: ఆట, అందంలో స్మృతి మంధానకు పోటీ ఎలిస్ పెర్రీ!
Smriti mandhana: స్మృతి మంధాన డామినేషన్! బిగ్‌బాష్, సీపీఎల్, ఎస్ఏ20, పీఎస్ఎల్లో మగాళ్ల కన్నా ఎక్కువ సాలరీ!
IPL 2022, GT vs RR Final: జోష్ ఈజ్ హై సర్! ఫైనల్ ముందు టైటాన్స్, రాయల్స్ ఫ్రెండ్లీమీట్!
IPL 2022 RR vs RCB Qualifier 2: హల్లాబోల్! రాజస్థాన్ డెన్‌లో ఆనందాల వెల్లువ!
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!
ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం