అన్వేషించండి
Team India: 2022 బెస్ట్ పెర్ఫార్మర్లు వీరే! కిర్రాక్ పెట్టించిన సూర్య, పంత్, స్మృతి!
Team India: 2022లో వివిధ ఫార్మాట్లలో రాణించిన క్రికెటర్ల పేర్లను బీసీసీఐ విడుదల చేసింది. ఈ మధ్యే ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ టెస్టుల్లో బెస్ట్ పెర్ఫార్మర్‌గా నిలవడం గమనార్హం.
టీమ్‌ఇండియా
1/5

పొట్టి క్రికెట్లో సూర్యకుమార్, భువీ అత్యుత్తమ ప్రదర్శన చేశారు. సూర్య 31 మ్యాచుల్లో 1164 పరుగులు, 2 సెంచరీలు కొట్టాడు. భువీ 32 మ్యాచుల్లో 6.98 ఎకానమీ, 19.56 సగటుతో 37 వికెట్లు పడగొట్టాడు.
2/5

అమ్మాయిల టీ20ల్లో స్మృతి మంధాన, దీప్తి శర్మ అగ్రస్థానంలో నిలిచారు. స్మృతి 23 మ్యాచుల్లో 594 రన్స్ చేయగా, దీప్తి 25 మ్యాచుల్లో 29 వికెట్లు పడగొట్టింది.
3/5

వన్డేల్లో శ్రేయస్ 17 మ్యాచుల్లో 724 రన్స్ కొట్టాడు. మహ్మద్ సిరాజ్ 15 మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టాడు.
4/5

అమ్మాయిల వన్డేల్లో హర్మన్‌ప్రీత్ 17 మ్యాచుల్లో 754 రన్స్ చేయగా, రాజేశ్వరీ గైక్వాడ్ 17 మ్యాచుల్లో 24 వికెట్లు సాధించింది.
5/5

టెస్టుల్లో రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా బెస్ట్ పెర్ఫార్మర్లు. పంత్ 7 మ్యాచుల్లో 680 కొట్టగా బుమ్రా 5 మ్యాచుల్లో 22 వికెట్లు తీశాడు. (All Images @bcci)
Published at : 01 Jan 2023 11:23 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఎలక్షన్
ఇండియా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















