అన్వేషించండి
Rishabh Pant: టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 భారత బ్యాటర్లు- పంత్ నంబర్ 1 అయ్యే ఛాన్స్
Test Records | ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత ఆటగాళ్లు రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. సెహ్వాగ్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును రిషబ్ పంత్ బద్దలు కొట్టే అవకాశం ఉంది.
భారతదేశం తరపున టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన సెహ్వాగ్
1/6

ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో రిషబ్ పంత్ రాణిస్తున్నాడు. నాల్గవ టెస్ట్ మ్యాచ్లో అతడు ఓ భారీ టెస్ట్ రికార్డుపై కన్నేశాడు. మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టి భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా అవతరించే అవకాశం ఉంది. టాప్ 5 జాబితాలో ఎవరున్నారో చూడండి.
2/6

ముల్తాన్ కా సుల్తాన్ పేరుతో ప్రసిద్ధి చెందిన వీరేంద్ర సెహ్వాగ్ 91 సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ తను. వీరూ 104 మ్యాచ్ల 180 ఇన్నింగ్స్‌లలో 91 సిక్సర్లు కొట్టాడు. టెస్ట్ క్రికెట్లో 23 సెంచరీలు మరియు 32 అర్ధ సెంచరీలు అతను 8,586 పరుగులు చేశాడు.
3/6

2. రిషబ్ పంత్ (88 సిక్సర్లు)- వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ టెస్టుల్లో సిక్సర్ల జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. కేవలం 4 సిక్సర్లు కొడితే సెహ్వాగ్ రికార్డును బద్దలు కొడతాడు. పంత్ 46 టెస్టుల 81 ఇన్నింగ్స్‌లలో 3373 పరుగులు చేశారు. అతను మొత్తం 88 సిక్సర్లు బాదాడు.
4/6

3. రోహిత్ శర్మ 88 సిక్సర్లు. టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న రోహిత్ శర్మ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 67 టెస్టుల్లో 116 ఇన్నింగ్స్‌లలో 4301 పరుగులు చేశాడు
5/6

4. ఎంఎస్ ధోని (78 సిక్సర్లు). అత్యధిక సిక్సర్ల జాబితాలో నాల్గవ స్థానంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఉన్నాడు. ధోనీ 90 టెస్టుల్లో 144 ఇన్నింగ్స్‌లలో 6 సెంచరీలు, 33 అర్ధ సెంచరీల సాయంతో 4,876 పరుగులు చేశాడు. ధోని టెస్టుల్లో 78 సిక్సర్లు బాదాడు.
6/6

5. రవీంద్ర జడేజా (74 సిక్సర్లు). వరల్డ్ నెంబర్ వన్ ఆల్ రౌండర్ జడేజా ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు. అతడు సిరీస్ లో మరింత రాణిస్తే ధోని రికార్డుని అధిగమించే అవకాశం ఉంది. జడేజా 83 టెస్టుల్లో 124 ఇన్నింగ్స్‌లలో 3,697 పరుగులు చేశాడు. మరో 5 సిక్సర్లు కొడితే ధోనీ రికార్డును జడేజా అధిగమిస్తాడు.
Published at : 20 Jul 2025 10:42 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
బిగ్‌బాస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















