అన్వేషించండి
అయోధ్య బాల రాముడికి దివ్యాభిషేకం, 500 ఏళ్ల తరవాత అక్కడ రామనవమి వేడుకలు
Ram Navami 2024: రామ నవమి సందర్భంగా అయోధ్య బాల రాముడిని పూజారులు అందంగా ముస్తాబు చేశారు. ఆ తరవాత పంచామృతాలతో అభిషేకించారు.
రామ నవమి సందర్భంగా అయోధ్య బాల రాముడిని పూజారులు అందంగా ముస్తాబు చేశారు. ఆ తరవాత పంచామృతాలతో అభిషేకించారు.
1/8

500 వందల ఏళ్ల కల సాకారమై అయోధ్యలో బాల రాముడి ఆలయ నిర్మాణం పూర్తైంది. ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోదీ ఆలయాన్ని ప్రారంభించారు. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు రామ్ లల్లాని దర్శించుకున్నారు. ఆలయం తెరుచుకున్న తరవాత తొలిసారి అక్కడ రామనవమి వేడుకలు జరుగుతుండడం విశేషం.
2/8

ఈ వేడుకలు కళ్లారా చూసేందుకు దేశ నలుమూలల నుంచి రామ భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల తాకిడిని ముందుగానే ఊహించిన ట్రస్ట్ అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించింది. రామనవమిని దృష్టిలో ఉంచుకుని దర్శన వేళల్నీ పొడిగించినట్టు ట్రస్ట్ వెల్లడించింది.
Published at : 17 Apr 2024 11:25 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















