అన్వేషించండి
New Rules for Aadhaar : ఆధార్ కార్డ్ అప్డేట్ చేయడానికి ఈ డాక్యుమెంట్స్ చాలా అవసరం.. UIDAI న్యూ రూల్స్
New UIDAI Guidelines for Aadhaar : ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవడానికి ఈసారి కొన్నిడాక్యుమెంట్స్ కచ్చితంగా ఉపయోగించాలని న్యూ రూల్స్ తీసుకొచ్చారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధార్ కార్డ్ అప్డేట్స్ (Image Source : Envato)
1/7

ఆధార్ కార్డుకు సంబంధించిన ఏదైనా మార్పులు చేయించుకోవాలా? అయితే మీరు మునుపటి కంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే UIDAI కొన్ని కొత్త నిబంధనలను అమలు చేసింది. ఇది ఆధార్ కార్డు హోల్డర్లపై ప్రభావం చూపుతుంది.
2/7

ఆధార్ కార్డ్ తయారు చేయించుకోవడం, అప్డేట్ చేయించుకోవడానికి కొన్ని నిబంధనలు వచ్చాయి. ఇకపై ఎవరైనా ఆధార్ కార్డ్ తయారు చేయించుకున్నా లేదా అప్డేట్ చేయించుకున్నా.. దాని కోసం ఏయే డాక్యుమెంట్లు ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
3/7

ఈ నిబంధనలు ఇండియాలో ఉండేవారికే కాదు.. ప్రవాస భారతీయిలకు కూడా వర్తిస్తాయి. అంటే OCI కార్డ్ హోల్డర్లు, 5 సంవత్సరాలు పైబడిన పిల్లలు, ఇండియాలో దీర్ఘకాలిక వీసాపై ఉంటున్న వారికి కూడా ఇవి వర్తిస్తాయి.
4/7

ఈ నిబంధనల్లో నాలుగు రకాల డాక్యుమెంట్లు ముఖ్యంగా ఉన్నాయి. ఒకటి గుర్తింపు కార్డు(Proof of Identity), అడ్రెస్ ప్రూఫ్ (Proof of Adress), పుట్టిన తేదీ (DOB), సంబంధం రుజువు (POR) ఉన్నాయి. ఈ కేటగిరీల కోసం ఏయే డాక్యుమెంట్లు చెల్లుబాటు అవుతాయో UIDAI వెబ్సైట్, పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి.
5/7

ఐడెంటీ కార్డు కోసం మీరు పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ ఫోటో ఐడి, జాబ్ కార్డ్, పెన్షనర్ ఐడి, ట్రాన్స్జెండర్ గుర్తింపు కార్డు వంటి డాక్యుమెంట్లు స్వీకరిస్తారు. ఈ-పాన్ కూడా ఉపయోగించవచ్చు.
6/7

అడ్రెస్ కోసం కరెంట్ బిల్, నీరు, గ్యాస్ లేదా టెలిఫోన్ రీసెంట్ బిల్స్ సబ్మీట్ చేయొచ్చు. బ్యాంక్ పాస్బుక్, రేషన్ కార్డు, అద్దె ఒప్పందం పత్రం లేదా ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించవచ్చు. డాక్యుమెంట్ 3 నెలల కంటే పాతది అవ్వకూడదు.
7/7

పుట్టిన తేదీని మార్చుకోవడానికి ఇకపై పాస్‌పోర్ట్, స్కూల్ మార్క్‌షీట్, పెన్షన్ డాక్యుమెంట్లు లేదా ప్రభుత్వం జారీ చేసిన పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం వంటి డాక్యుమెంట్లు అవసరం. UIDAI ఈ డాక్యుమెంట్ల ద్వారా ప్రతి వివరాలను ధృవీకరిస్తుంది. తద్వారా ఆధార్‌లో తప్పులు జరిగే అవకాశం దాదాపు ఉండదు.
Published at : 10 Jul 2025 12:21 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















