అన్వేషించండి
Hidden Camera : హోటల్ గదిలో రహస్య కెమెరా ఉందా? ఇలా సులభంగా తెలుసుకోండి
Secret Camera : హోటల్ గదిలో హిడెన్ కెమెరా ఉందనే అనుమానం వస్తే జాగ్రత్తగా ఉండాలి. మీ గోప్యతను కాపాడుకోవడానికి కొన్ని సులభమైన మార్గాలు తెలుసుకోండి.
సీక్రెట్ కెమెరాను ఇలా గుర్తించండి
1/6

సాంకేతికత అభివృద్ధి పెరిగే కొద్ది.. చిన్న కెమెరాలు కూడా మార్కెట్లో సులభంగా లభిస్తున్నాయి. వీటిని ఎక్కడైనా అమర్చవచ్చు. ఎదుటివ్యక్తికి తెలియకుండానే వీటిని హైడ్ చేసి పెట్టొచ్చు. హోటల్ వంటి ప్రదేశాలలో కూడా ఈ సీక్రెట్ కెమెరాలను ఉయోగిస్తున్నారు.
2/6

అనేక సందర్భాల్లో హోటల్ గదుల్లో హిడెన్ కెమెరాను గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. మీరు హోటల్‌కు వెళ్తే.. మీ గదిలో ఏదైనా హిడెన్ కెమెరా ఉందో లేదో ఇలా చెక్ చేసేయండి.
3/6

హిడెన్ కెమెరాలు సాధారణంగా టీవీ దగ్గర, స్మోక్ డిటెక్టర్లు, ఛార్జింగ్ పాయింట్లు, అలారం గడియారాలు లేదా గోడపై అలంకరణ వస్తువుల్లో పెడతారు. కాబట్టి ముందుగా హోటల్‌కు వెళ్లిన తర్వాత ముందుగా విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి.
4/6

మొబైల్ ఫోన్‌తో కూడా వీటిని గుర్తించుకోవచ్చు. దీనికోసం గదిలోని లైట్ ఆఫ్ చేసి ఫోన్ కెమెరాను ఆ ప్రదేశాలలో తిప్పండి. ఎక్కడైనా ఎరుపు రంగు కాంతి కనిపిస్తే అక్కడ లెన్స్ దాగి ఉండవచ్చు. దీనితో పాటు కొన్ని ప్రత్యేక యాప్‌లు కూడా ఉన్నాయి. ఇవి హిడెన్ డివైజ్ లను గుర్తించడంలో సహాయపడతాయి.
5/6

మిర్రర్స్ కూడా చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు టూ-వే అద్దాల వెనుక కెమెరాలను అమరుస్తారు. ఇది తెలుసుకోవడానికి.. అద్దంపై వేలు పెట్టండి. మీ వేలి ప్రతిబింబం నేరుగా తాకినట్లయితే, అనుమానించాలి. సాధారణ అద్దంలో వేలికి, ప్రతిబింబానికి మధ్య కొంచెం ఖాళీ కనిపిస్తుంది.
6/6

గదిలో ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే హోటల్ మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేయండి. అవసరమైతే పోలీసులను సంప్రదించండి. గోప్యత అనేది ప్రతి ఒక్కరి హక్కు. కాబట్టి హోటల్‌కు వెళ్లినప్పుడల్లా అప్రమత్తంగా ఉండాలి.
Published at : 21 Aug 2025 03:45 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















