అన్వేషించండి
Betel Leaves Benefits : తమలపాకులు తింటే కలిగే లాభాలివే.. ఆ సమస్యలు తగ్గించుకునేందుకు తినేయండి
Betel Leaves for Health : తమలపాకులతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. అయితే వీటిని రెగ్యులర్గా తింటే ఆరోగ్యపరంగా ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చో చూసేద్దాం.
తమలపాకులు తింటే కలిగే లాభాలివే (Image Source : Pexels)
1/8

తమలపాకు ఆరోగ్యానికి చాలామంచివి. అందుకే వీటిని ఎన్నో ఏళ్లుగా తింటున్నారు. ఆయుర్వేదంలో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది.
2/8

తమలపాకుల్లో కాల్షియం, విటమిన్ సి, కెరోటిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, యాంటీఆక్సిడెంట్లు, క్లోరోఫిల్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ప్రయోజనాలు అందిస్తాయి.
3/8

తమలపాకులు రెగ్యులర్గా తీసుకుంటే నాడీ సంబంధిత సమస్యలు దూరమవుతాయట. నరాల దృఢత్వాన్ని తగ్గించి.. నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
4/8

తమలపాకులు తినడం వల్ల ఆలోచించే శక్తి మెరుగవుతుందట. తీసుకున్న ఆహారం జీర్ణమవ్వడంలో హెల్ప్ చేస్తుంది. గ్యాస్, ఎసిడిటీ సమస్యలు దూరమవుతాయి.
5/8

తమలపాకుల రసం కడుపులోని బ్యాక్టీరియాను బయటకు పంపి గట్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది. టాక్సిన్లు బయటకు పంపి హెల్తీగా ఉంచుతుంది.
6/8

నోటి బాక్టీరియాను తగ్గించి.. నోటి పూతలు వంటి సమస్యలను దూరం చేస్తుంది. నోటి దుర్వాసన కూడా పోయి.. ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది.
7/8

తమలపాకులు తింటే ఆర్థరైటిస్ నొప్పి తగ్గుతుంది. ఉబ్బసం చికిత్సలో కూడా దీనిని ప్రధానంగా ఉపయోగిస్తారు. గొంతు నొప్పి, జలుబు కూడా తగ్గుతుంది. కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది.
8/8

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Published at : 27 May 2025 10:47 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















