అన్వేషించండి
Satyabhama Serial Today January 27th Highlights: మామా కోడలి వార్ రూట్ మారి సత్య Vs సంధ్య గా మారనుందా - సత్యభామ జనవరి 27ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. ఇప్పుడు MLA గా బరిలో దిగారు మహదేవయ్య సత్య . ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....
Satyabhama Serial Today January 27th Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/7

సత్యభామ సీరియల్ అంటే.. మహదేవయ్య vs సత్యభామగా నడిచింది. ఇప్పుడు సీన్లోకి మెయిన్ విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది సంధ్య. ఎస్.. మహదేవయ్య - సంజయ్ ఇద్దరూ కలసి అదే చేస్తున్నారు...ఈ వారం ఎపిసోడ్ లో ఇవే సీన్స్ హైలెట్ కాబోతున్నాయ్
2/7

సత్యభామ అంటే పుట్టింట్లో అందరకీ అమితమైన ప్రేమ..చెల్లెలు సంధ్యకు కూడా. కానీ ఇప్పుడు రూట్ మారిపోయింది. సంజయ్ మాయలో పడిన సంధ్య తను చెప్పినట్టు ఆడడం ప్రారంభించింది. ఇదే ఇప్పుడు సత్యకు పెద్ద సమస్యగా మారింది
3/7

మామ మహదేవయ్య బారి నుంచి తన భర్తను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే MLA గా పోటీకి దిగింది. మహదేవయ్యతో ఢీ అంటే ఢీ అంటోంది. ఇన్ డైరెక్ట్ గా క్రిష్ సపోర్ట్ చేస్తున్నాడు...
4/7

సత్యను ట్రాప్ చేసేందుకు సంజయ్ ప్రయత్నించి చెంపదెబ్బలు తినడంతో అహం దెబ్బతింది. అందుకే సత్యను టార్గెట్ చేయాలని ఫిక్సైన సంజయ్ కావాలనే సంధ్యను లైన్లో పెట్టాడు.. అదే పనిగా సంధ్యను ట్రాప్ చేసి సత్యపై ప్రయోగిస్తున్నాడు..ఇప్పుడు ఇదే జరుగుతోంది
5/7

ఆఖరి నిముషంలో నామినేషన్ పై సంతకం చేయకుండా సంధ్యను ఆగిపోయేలా చేసి సక్సెస్ అయ్యాడు సంజయ్.. కానీ రుద్రను లైన్లోకి తీసుకొచ్చి ఆ ప్లాన్ కి చెక్ పెట్టాడు క్రిష్. ఇప్పుడు సంధ్య ద్వారా సత్యను పోటీలో లేకుండా చేసే ప్లాన్ లో ఉన్నారు సంజయ్, మహదేవయ్య..
6/7

మన ప్రేమ గురించి ఇంట్లో పెద్దవాళ్లకి చెప్పాల్సిందే అని పట్టుబడుతుంది సంధ్య. ఈ మొత్తం వ్యవహారం సత్యకు తెలిసి కంగారుపడుతుంది. ఇప్పుడేం చేయాలనే ఆలోచనలో పడుతుంది
7/7

మరోవైపు మహదేవయ్య ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్లాన్ లో ఉన్నాడు. అందుకే మీ అక్క పోటీలోంచి తప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుందనే కండిషన్ పెట్టమంటాడు. అంటే ఇప్పుడు సంధ్య..సత్యకు శత్రువుగా మారబోతోంది..ఇదీ మహదేవయ్య గేమ్ అంటే..
Published at : 26 Jan 2025 12:47 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















