అన్వేషించండి
Guppedantha Manasu Raksha Gowda: రిషి బాటలోనే వసుధార - 'గుప్పెడంత మనసు' నుంచి తప్పుకుంటోందా!
Raksha Gowda : 'కార్తీకదీపం' తర్వాత ఆ రేంజ్ లో వెలిగిన 'గుప్పెడంత మనసు' ఇప్పుడు మసకబారుతోంది. రిషి క్యారెక్టర్ లేకపోవడంతో ఏదో చప్పగా సాగుతోందనుకుంటే..త్వరలో వసుధార కూడా తప్పుకుంటోందంటున్నారు..

Image Credit: Raksha Gowda/Instagram
1/7

కృష్ణవేణి సీరియల్ తో టీవీ ప్రేక్షకులకు దగ్గరైన రక్షా గౌడ 'గుప్పెడంత మనసు' సీరియల్ లో వసుధార పాత్రలో నటిస్తోంది. రిషిధార జోడీకి ఈ సీరియల్ లో ఫుల్ మార్కులు పడ్డాయి
2/7

రిషిగా నటించిన ముఖేష్ గౌడ కొన్ని నెలలుగా సీరియల్ లో కనిపించడం లేదు. కిడ్నాప్ అని, అనారోగ్యం అని మధ్యలో రెండు మూడుసార్లు పేషెంట్ గా చూపించి నెట్టుకొచ్చారు...
3/7

ృముఖేష్ గౌడ జిమ్ లో గాయపడడంతో మూడు నెలలు రెస్ట్ అవసరం అని వైద్యులు చెప్పారని ఆ తర్వాత వస్తాడని అన్నారు. వసుధార కూడా మూడు నెలల్లో రిషి సర్ ని తీసుకొస్తానని శపథం చేసింది...కానీ మళ్లీ ఆ ఊసేలేదు
4/7

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అప్ డేట్ ఏంటంటే...రిషి లానే వసుధార కూడా ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుందట..
5/7

ఇప్పటికే వసుధార క్యారెక్టర్ కి ఎలాంటి వెయిట్ లేదు..కేవలం కాలేజీ ఎండీ అనే పదవి తప్ప ఇంకే లేదు. స్టోరీ మొత్తం అనుపమ-మను-మహేంద్ర చుట్టూ తిరుగుతోంది...దేవయాని, శైలేంద్ర విలనిజం...ఫణీంద్ర మంచితనం..ధరణి సైలెన్స్...ఇవన్నీ బోర్ కొట్టేశాయి. ఇలాంటి టైమ్ లో రిషి రీ ఎంట్రీ ఇస్తేనే మళ్లీ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే వసుధార ఉన్నా లేకపోయినా ఏం వ్యత్యాసం ఉండదంటున్నారు సీరియల్ అభిమానులు..
6/7

మొత్తానికి గుప్పెడంత మనసుని ఓ రేంజ్ లో వెలిగించి..ఇలా అనామకంగా మార్చేశారంటున్నారంతా.. వసుధార వెళ్లిపోయే లోగా అయినా రిషిని తీసుకొస్తారో ...లేదంటే...రిషి సర్ లేరంటే నా గుండె ఆగిపోతుందనే డైలాగ్ ని ఆసరాగా చేసుకుని వసుధారని కూడా చంపేస్తారో... చూద్దాం...
7/7

గుప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)
Published at : 23 Apr 2024 03:26 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
క్రికెట్
పాలిటిక్స్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion