అన్వేషించండి
Brahmamudi Serial Today October 17th Highlights : కొంప ముంచేసిన రుద్రాణి - రాజ్ కి కళావతి చెప్పే సమాధానం ఏంటి!
Brahmamudi Today Episode: కనకం బాధ చూడలేక రాజ్ వెళ్లి కావ్య దాంపత్య వ్రతానికి ఒప్పిస్తే.. రుద్రాణి కథను మలుపు తిప్పేసింది...ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇక్కడ చూడండి..
Brahmamudi Serial Today Episode
1/8

దాంపత్య వ్రతం చేసేందుకు కావ్యను ఎలాగైనా నువ్వే ఒప్పించాలని రాజ్ ని కోరుతుంది కనకం. నావల్ల కాదు అని రాజ్ అంటే. ముగ్గురు కూతుర్లు అల్లుళ్లు కలసి వ్రతం చేస్తే చూసి కన్నుమూయాలనుకుంటున్నా అని దగ్గుతుంది.. కంగారుపడిన రాజ్ సరే అంటాడు.
2/8

కావ్య ఏం మాట్లాడినా కోపంరాకుండా మనం రాజ్ ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటారు అపర్ణ, ఇందిరాదేవి. కన్నతల్లి చివరి కోరిక అని తెలియక అలా చేస్తోంది..లేదంటే తనే ముందుండి ఇవన్నీ జరిపించేది కావ్యను ఒప్పించేందుకు అడుగు తగ్గినా పర్వాలేదని క్లాస్ వేస్తారు అపర్ణ, ఇందిరాదేవి.
3/8

కావ్య రాజ్ మధ్య టామ్ అండ్ జెర్రీ వార్ నడుస్తుంది. మళ్లీ బూత్ బంగ్లా టాపిక్ తీస్తుంది కళావతి..తలపట్టుకుంటాడు రాజ్. దాంపత్య వ్రతానికి వచ్చి కూర్చుంటావా లేదా అంటే..మీతో నాకేంటి సంబధం అని రివర్సవుతుంది. మనం ఆర్గుమెంట్స్ చేసుకునే సమయం కాదు.. నా మాట విను వెయిట్ చేస్తుంటా అని వెళ్లిపోతాడు
4/8

పెద్దమ్మ అనుకున్నంత పనీ చేసింది..బావను దార్లోకి తీసుకొచ్చేసింది అనుకుంటూ బంటి రూమ్ లోకి వెళతాడు.. ఆ మాటలు విన్న అప్పు బంటిని నిలిదీస్తుంది. జరిగినదంతా చెప్పేస్తాడు బంటి.. సరే వ్రతం జరిగేవరకూ ఈ విషయం బయటకు చెప్పకు అంటుంది అప్పు..
5/8

ఈ మొత్తం వినేస్తుంది రుద్రాణి
6/8

పీటలపై కూర్చుని కావ్యకోసం ఎదురుచూస్తుంటాడు రాజ్. ఇంకా రాలేదేంటని సెటైర్స్ వేస్తుంటుంది ధాన్యలక్ష్మి. రుద్రాణి అవకాశం కోసం ఎదురుచూస్తుంటుంది. ఇంతలో కావ్య వచ్చి కూర్చుంటుంది. రాజ్ కంకణం కట్టేందుకు సిద్ధం అవుతాడు
7/8

ఇదే సమయం అనుకుని... రుద్రాణి అసలు విషయం చెప్పేస్తుంది. కనకం క్యాన్సర్ అని అబద్ధం చెప్పిందని చెప్పేస్తుంది. అక్కడున్నావారంతా షాక్ అవుతారు. అపర్ణ వారించినా రుద్రాణి తగ్గదు
8/8

మీరు మాట్లాడరేంటని రాజ్...కనకంని రెట్టిస్తాడు. రుద్రాణి చెప్పింది నిజం అంటుంది కనకం. తల్లితో కలసి కూతురు కూడా బాగా నటించింది.. ఇక ఈ కుటుంబాన్ని చచ్చినా నమ్మను అంటాడు రాజ్.. రుద్రాణి, ధాన్యలక్ష్మికి తప్ప మిగిలిన అందరకీ పెద్ద షాకే ఇది...
Published at : 17 Oct 2024 09:42 AM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















