అన్వేషించండి
Rhea Chakraborty: సినిమాల కన్నా వ్యక్తిగత జీవితంలో వివాదాలతోనే పాపులర్ అయిన రియా చక్రవర్తి బ్యూటిఫుల్ ఫొటోస్ !
Rhea Chakraborty Photos: సినిమాల కన్నా వ్యక్తిగత జీవితంలో వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయింది రియా చక్రవర్తి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రియా రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవే...

image credit :Rhea Chakraborty/Instagram
1/5

రియా చక్రవర్తి తన బర్త్ డే సందర్భంగా కొత్త పాడ్‌క్యాస్ట్ - చాప్టర్ 2 పేరుతో ప్రకటించింది. ఈ షోకి మొదటి అతిథిగా వచ్చిన సుస్మితా సేన్‌ని ఆమె స్వాగతించింది. చిన్నప్పటి నుంచీ ఆమెను చూసి ఆశ్చర్యపోయాను..ఆమె జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని వాటినుంచి గెలిచి నిలిచిందంటూ సుస్మితను ఆకాశానికెత్తేసింది రియా..
2/5

బెంగళూరులో జన్మించిన రియా స్కూలింగ్ అంతా అంబాలా ఆర్మీ స్కూల్లోనే సాగింది. 2009 లో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఎంటీవీ రియాలిటీ షో ‘టీన్ డీవా’ షోలో ఆమె రన్నరప్ గా నిలిచింది.... ఆ తర్వాత అదే టీవీలో ‘ఎంటీవీ వాట్సప్’, ‘టిక్ టాక్ కాలేజ్ బీట్’, ‘ఎంటీవీ గాన్ ఇన్ 60’ సహా పలు షోలకు హోస్టుగా వ్యవహరించింది.
3/5

2012లో సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన ‘తూనీగా తూనీగా’ తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ మూవీ తర్వాత రియాకు టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్స్ రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసింది. ‘మేరే డాడ్ కీ మారుతి’ , ‘సోనాలీ కేబుల్’ అనే మూవీస్ లో ఛాన్స్ అందుకుంది.
4/5

2017లో యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన ‘బ్యాంక్ చోర్’ సినిమా తర్వాత ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’, ‘దుబారా: సీ యువర్ ఈవిల్’ లో నటించింది. ఆమె నటించిన ఏ సినిమాలు కూడా సూపర్ డూపస్ సక్సెస్ కాలేదు.
5/5

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ తో డేటింగ్ చేసింది. తన మరణం తర్వాత తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. ఆ తర్వాత మాదకద్రవ్యాల కేసులో జైలుకి వెళ్లి వచ్చింది . ప్రస్తుతం పలు టీవీ షోలతో పాటు అడపాదడపా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది..
Published at : 05 Jul 2024 03:27 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
న్యూస్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion