అన్వేషించండి
Kanyaka Movie OTT Release Date: వినాయక చవితికి ఓటీటీలో 'కన్యక' - కేవలం 49 రూపాయలకే, ఎందులో చూడొచ్చంటే?
Kanyaka Movie OTT Platform: మహిళల పట్ల తప్పుగా ప్రవర్తిస్తే అమ్మవారు తప్పకుండా శిక్ష విధిస్తుందనే కథాంశంతో తెరకెక్కిన సినిమా 'కన్యక'. గణేష్ చతుర్థికి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
వినాయక చవితికి ఓటీటీలో విడుదల కానున్న అమ్మవారి సినిమా 'కన్యక'
1/4

శ్రీ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్ సంస్థలో, రాఘవేంద్ర తిరువాయి పాటి దర్శకత్వంలో కేవీ అమర్, పూర్ణ చంద్ర రావు, సాంబశివ రావు నిర్మించిన సినిమా 'కన్యక'. మహిళల పట్ల తప్పుగా ప్రవరిస్తే ఎవరు క్షమించి వదిలేసినా అమ్మవారు తప్పకుండా శిక్షిస్తుందనే కథాంశంతో తెరకెక్కింది. ఆగస్టు 15న పాటలు, రాఖీ సందర్భంగా ఆగస్టు 20న ట్రైలర్ విడుదల చేశారు. సినిమాను వినాయక చవితికి ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
2/4

గణేష్ చతుర్థి సందర్భంగా 'కన్యక' చిత్రాన్ని Bcineet ఓటీటీలో విడుదల చేస్తున్నారు. కేవలం 49 రూపాయలు చెల్లించి, రెంటల్ విధానంలో సినిమాను చూడవచ్చని ఓటీటీ నిర్వాహకులు తెలిపారు. శివరామరాజు, 'జబర్దస్త్' వాసు, ఈశ్వర్, శ్రీహరి, పీవీఎల్ వర ప్రసాదరావు, సర్కార్,ఫణిసూరి, ఆర్ మ్ పి. వెంకట శేషయ్య, 'సాలిగ్రామం' మమత, శిరీష, విజయ, రేవతి తదితరులు నటించారు.
Published at : 28 Aug 2024 12:44 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















