అన్వేషించండి
Janhvi Kapoor : వయ్యారం ఓణి కట్టింది, కానీ ఈవెంట్ క్యాన్సిల్ అయింది.. తెలుగులో క్యూట్ మెసేజ్ ఇచ్చిన జాన్వీ కపూర్
Janhvi Kapoor Latest Photos : శ్రీదేవి కూతురుగా తెలుగులో మొదటి సినిమా చేస్తోంది జాన్వీకపూర్. దానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉండగా అది క్యాన్సిల్ కాగా జాన్వీ ఓ క్యూట్ వీడియో చేసింది.
జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Janhvi Kapoor)
1/6

దేవర బ్యూటీ, అతిలోక సుందరి కుమార్తె జాన్వీకపూర్ తెలుగు ప్రేక్షకులతో మాట్లాడాల్సిన సమయం వచ్చింది కానీ పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది.(Images Source : Instagram/Janhvi Kapoor)
2/6

అయితే ఫ్యాన్స్ కోసం ఇప్పటికే జూనీయర్ ఎన్టీఆర్ ఓ వీడియో చేయగా.. జాన్వీ కూడా తెలుగులో క్యూట్‌గా మాట్లాడుతూ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.(Images Source : Instagram/Janhvi Kapoor)
3/6

మీ అందరినీ కలవాలి అనుకున్నాను. కానీ ఈసారి కుదరడం లేదు. కచ్చితంగా మళ్లీ మిమ్మల్ని కలుస్తాను. జాన్వీ పాప అంటూ నన్ను ముందుగా పిలుస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు థ్యాంక్యూ అంటూ క్యూట్ క్యూట్‌గా తెలుగులో మాట్లాడేసి వీడియో షేర్ చేసింది.(Images Source : Instagram/Janhvi Kapoor)
4/6

అయితే ఈవెంట్ కోసం అందంగా లంగా ఓణిలో ముస్తాబైంది జాన్వీ కపూర్. కానీ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో దానికి సంబంధించిన ఫోటోలను మాత్రం ఇన్‌స్టాలో బ్యూటీఫుల్ క్యాప్షన్‌తో షేర్ చేసింది. (Images Source : Instagram/Janhvi Kapoor)
5/6

నేను ఈ మాటలు స్వయంగా మీతో చెబ్ధామనుకున్నాను. కానీ ఈ సారికి అలా కుదరలేదు. మిమ్మల్నందరినీ త్వరలోనే కలుస్తాననుకుంటున్న. ప్రస్తుతానికి ఇది నా నుండి మీకు ఈ చిన్న మెసేజ్…. See you in theatres on 27th of September #Devara 🌊 అంటూ తెలుగులో క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Janhvi Kapoor)
6/6

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. జాన్వీపాప ఎంత క్యూట్ మాట్లాడిందోనంటూ నెటిజన్లు షేర్ చేస్తున్నారు. దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.(Images Source : Instagram/Janhvi Kapoor)
Published at : 23 Sep 2024 06:15 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















