అన్వేషించండి
Bramayugam: 'భ్రమయుగం'లో మమ్ముట్టి బ్లాక్ అండ్ వైట్ స్టిల్స్ - రివ్యూ చదివే ముందు ఓ లుక్ వేయండి
Mammootty's Bramayugam Reviews: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'భ్రమయుగం'. ఈ సినిమా నేడు మలయాళంలో విడుదలైంది. ఆ స్టిల్స్ చూడండి.

'భ్రమయుగం' సినిమాలో మమ్ముట్టి
1/7

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. 'యాత్ర 2' సినిమాతో గత వారం తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు. ఈ వారం ఆయన హీరోగా నటించిన మలయాళ సినిమా 'భ్రమయుగం' విడుదలైంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో అనువదించినా... ఈ వారం మలయాళ వెర్షన్ విడుదలైంది. సినిమా రివ్యూ చదివే ముందు ఒక్కసారి 'భ్రమయుగం' సినిమాలో మమ్ముట్టి బ్లాక్ అండ్ వైట్ స్టిల్స్ చూడండి.
2/7

'భ్రమయుగం' కథ కేరళలో మాయ / తంత్రంతో నిండిన యుగంలో నడుస్తుంది. ఒక గాయకుడి జీవితంలో జరిగిన అనూహ్య ఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మొదట భావించినా... మాతృక భాషలో చూస్తే ఆ అనుభూతి బాగుంటుండటంతో పాటు, మరింత థ్రిల్ చేస్తుందన్న ఉద్దేశంతో ముందుగా మలయాళం భాషలో మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించారు.
3/7

మమ్ముట్టి హీరోగా నటించిన 'భ్రమయుగం' సినిమాకు 'భూతకాలం' ఫేమ్ రాహుల్ సదాశివన్ రచయిత, దర్శకుడు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ పతాకంపై చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. హారర్ థ్రిల్లర్ చిత్రమిది.
4/7

'భ్రమయుగం' సినిమాను బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్ లో విడుదల చేస్తుండటం విశేషం. ఆల్రెడీ విడుదలైన సినిమా ట్రైలర్ అంచనాలు పెంచింది. పాచికల ఆట నేపథ్యంలో, తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ రేకెత్తిస్తూ సాగింది. టెక్నికల్ పరంగా సినిమా ఉన్నత స్థాయిలో ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమైంది.
5/7

'భ్రమయుగం' చిత్రానికి షెహనాద్ జలాల్ సినిమాటోగ్రాఫర్, జోతిష్ శంకర్ ప్రొడక్షన్ డిజైనర్, షఫీక్ మహమ్మద్ అలీ ఎడిటర్, క్రిస్టో జేవియర్ సంగీత దర్శకుడు.
6/7

'భ్రమయుగం' సినిమాలో మమ్ముట్టి
7/7

'భ్రమయుగం' సినిమాలో మమ్ముట్టి
Published at : 15 Feb 2024 11:48 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion