అన్వేషించండి

Chadalavada Srinivas Rao: 'రికార్డ్ బ్రేక్' రిలీజుకు బిచ్చగాడు తరహాలో ప్లాన్ రెడీ - చదలవాడ శ్రీనివాసరావు

చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన పాన్ ఇండియా మూవీ 'రికార్డ్ బ్రేక్' ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు

చదలవాడ శ్రీనివాసరావు

1/6
తాను జీవించి ఉండగా పెద్ద హీరోలతో సినిమాలు చేయనని ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు చెప్పారు. ఇప్పుడు తాను ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం పెద్ద బడ్జెట్, పెద్ద హీరోలతో సినిమాలు చేయకపోవడమేనని పేర్కొన్నారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమా 'రికార్డ్ బ్రేక్'. సహజ నటి జయసుధ కుమారుడు నిహిర్ కపూర్ ఓ హీరోగా నటించిన చిత్రమిది. ఈ శుక్రవారం (మార్చి 8న) సినిమా విడుదల కానున్న సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మీడియాతో ముచ్చటించారు.

2/6
'రికార్డ్ బ్రేక్'లో కంటెంట్ మీద నమ్మకంతో కొత్త హీరోలతో భారీగా ఖర్చు చేసి ఈ సినిమా తీశామని చదలవాడ శ్రీనివాసరావు చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''ఇంతకు ముందు హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ తక్కువ ఉండేది. అప్పట్లో దర్శక నిర్మాతలు ఇంతమంది లేదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. 'బిచ్చగాడు' తర్వాత కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఏ చిత్రానికైనా విజయాన్ని కట్టబెడతారని అనిపించింది. అందుకే, ప్రేక్షకుల మనసుకు హత్తుకునే విధంగా భారీ ఖర్చుతో ఈ సినిమా చేశా'' అని చెప్పారు.

3/6
'రికార్డ్ బ్రేక్'కు, ముఖ్యంగా ఆ పతాక సన్నివేశాలకు అంత ఖర్చు అవుతుందని మేం ముందే అనుకున్నామని చదలవాడ శ్రీనివాసరావు చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''మా సినిమా ట్రైలర్ విడుదల చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. శనివారం వేసిన ప్రీమియర్ షోలకు కూడా మంచి స్పందన వచ్చింది. దాంతో హ్యాపీగా ఉన్నాను. ప్రజెంట్ హీరోల్లో అంత బాడీ ఉన్నవాళ్లు, వెయిట్  లిఫ్ట్ చేయగలిగిన వాళ్లు ఎవరూ లేరు. అందుకని నిహిర్ కపూర్ తో పాటు మరొకరిని తీసుకున్నా. ఆ కాలానికి రామారావు, కృష్ణంరాజు గారు తరహాలో, ఈ కాలానికి వీళ్లు సెట్ అయ్యారు'' అని చెప్పారు.

4/6
తక్కువ థియేటర్లలో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నట్లు చదలవాడ శ్రీనివాసరావు చెప్పారు. ''థియేటర్లు ఎక్కువ లభించినప్పటికీ... నేనే 'బిచ్చగాడు' లాగా ముందు కొన్ని థియేటర్లలో విడుదల చేసి, సక్సెస్ తర్వాత పెంచుకుందామని అనుకుంటున్నా'' అని చెప్పారు.

5/6
పాన్ ఇండియా రిలీజ్ చేయడానికి గల కారణాన్ని చదలవాడ శ్రీనివాసరావు చెబుతూ ''నేను తెనాలిలో చిన్న కర్రల వ్యాపారం చేసే వాడిని. సినీ కళామతల్లి వల్ల ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నా. మంచి మిత్రులు దొరికారు. వాళ్ల మద్దతుతో ఈ స్థాయికి వచ్చా. ఇప్పుడు యూనివర్సల్ కాన్సెప్ట్ తీసుకుని సినిమా చేశాం. అందుకే, ఎనిమిది భాషల్లో సినిమా విడుదల చేస్తున్నాం'' అని చెప్పారు. 

6/6
''బిచ్చగాడు'లో తల్లి కోసం బిడ్డ కష్టపడతాడు. ఈ సినిమాలో బిడ్డల కోసం తల్లి ఏం చేస్తుంది? అనేది కాన్సెప్ట్. క్లైమాక్స్ అందర్నీ ఆకట్టుకుంటుంది. రెజ్లింగ్ కోసం చైనా వెళ్లడానికి హీరోలు కష్టపడుతుంటే... తల్లి ఏం చేసింది? లడ్డూల కోసం లవర్ ఏం చేసింది? అనేది స్క్రీన్ మీద చూడాలి'' అని చదలవాడ శ్రీనివాసరావు చెప్పారు. ఈ సినిమా తర్వాత కూడా డైరెక్షన్ కంటిన్యూ చేస్తానని ఆయన వివరించారు.

సినిమా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget