అన్వేషించండి
Anand Deverakonda: మరోసారి హిట్ కాంబో రిపీట్ - ఆనంద్ దేవరకొండతో వైష్ణవి చైతన్య కొత్త మూవీ ప్రారంభం
Anand Deverakonda Vaishnavi Chaitanya: మరోసారి హిట్ కాంబో రిపీట్ కానుంది. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా లవ్ ఎంటర్‌టైనర్ రాబోతోంది. ఈ మూవీ పూజా కార్యక్రమంలో గురువారం జరిగింది.
ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ ప్రారంభం
1/4

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబోలో వచ్చిన 'బేబీ' మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మరోసారి ఆ హిట్ కాంబో రిపీట్ కానుంది. వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా మరో సినిమా తెరకెక్కనుంది.
2/4

ఈ మూవీ పూజా కార్యక్రమం గురువారం జరగ్గా.. నేషనల్ క్రష్ రష్మిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టారు.
3/4

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, పార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ఆదిత్య హాసన్ ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఆయన డైరెక్ట్ చేసిన 90s వెబ్ సిరీస్‌కు కొనసాగింపుగా ఈ మూవీ రానుండగా.. ఇది వరకే ఓ వీడియో రిలీజ్ చేశారు.
4/4

90s సిరీస్‌లో చిన్న వాడైన ఆదిత్య పదేళ్ల తర్వాత పెద్దవాడై లవ్‌లో పడితే ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపించబోతున్నారు. వీరితో పాటే శివాజీ, వాసుకి కూడా మూవీలో నటించబోతున్నారు.
Published at : 15 May 2025 01:25 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















