అన్వేషించండి
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టలో బాలీవుడ్ సెలబ్రిటీలు
అయోధ్యలో జరిగిన రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుకలకు అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు చేరుకున్నారు.

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. (Image: X/Twitter)
1/7

అయోధ్యలో సోమవారం రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు అనేక మంది బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. వీరిలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ తదితరులు ఉన్నారు.
2/7

వీరితో పాటు ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ హిరానీ, మాధురీ దీక్షిత్ వంటి సెలబ్రిటీలు కూడా ఉన్నారు.
3/7

వీరందరూ ముంబై నుంచి ఒకేసారి బయలుదేరారు. అక్కడి నుంచి విమానం ద్వారా అయోధ్యకు చేరుకున్నారు.
4/7

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ జంట సంప్రదాయ దుస్తుల్లో చూడముచ్చటగా ఉన్నారు.
5/7

సూపర్ స్టార్ రజినీకాంత్, మాాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ముకేష్ అంబానీ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
6/7

సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇద్దరూ కలిసి ఫొటోలు దిగారు. వాటిని అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.
7/7

ఇటీవలే రామాయణం ఆధారంగా ‘ఆదిపురుష్’ తీసి విమర్శల పాలైన బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
Published at : 22 Jan 2024 01:32 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
గాసిప్స్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion