అన్వేషించండి
Credit Card Rule: గడువు ముగిసినా క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేదా! ఆర్బీఐ కొత్త రూల్‌తో హ్యాపీ!
Credit Card Rule: గడువు ముగిసినా క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేదా! ఆర్బీఐ కొత్త రూల్‌తో హ్యాపీ!
![Credit Card Rule: గడువు ముగిసినా క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేదా! ఆర్బీఐ కొత్త రూల్‌తో హ్యాపీ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/14/25893ef91df0fb8c8313a953978a328c1671021667849251_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
క్రెడిట్ కార్డు
1/5
![దేశంలో క్రెడిట్ కార్డుల (Credit Cards) వినియోగం విపరీతంగా పెరిగింది. ఏటా వినియోగంలో భారత్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది దసరా, దీపావళి పండుగల సీజన్లో కస్టమర్లు స్థాయికి మించి కార్డులను గీకేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/14/1d884242716030a876eb94688eb9a0e8939cd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దేశంలో క్రెడిట్ కార్డుల (Credit Cards) వినియోగం విపరీతంగా పెరిగింది. ఏటా వినియోగంలో భారత్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది దసరా, దీపావళి పండుగల సీజన్లో కస్టమర్లు స్థాయికి మించి కార్డులను గీకేశారు.
2/5
![క్రెడిట్ కార్డు కస్టమర్లు ఓ విషయంలో పొరపాటు చేస్తుంటారు. బిల్లింగ్ గడువు తేదీని మర్చిపోతుంటారు. దీంతో భారీ స్థాయిలో జరిమానా చెల్లిస్తుంటారు. క్రెడిట్ స్కోరు తగ్గిపోతుండటంతో ఆందోళన చెందుతారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/14/5bd41c566abd7ead074eb574bab4b3fb3f632.jpg?impolicy=abp_cdn&imwidth=720)
క్రెడిట్ కార్డు కస్టమర్లు ఓ విషయంలో పొరపాటు చేస్తుంటారు. బిల్లింగ్ గడువు తేదీని మర్చిపోతుంటారు. దీంతో భారీ స్థాయిలో జరిమానా చెల్లిస్తుంటారు. క్రెడిట్ స్కోరు తగ్గిపోతుండటంతో ఆందోళన చెందుతారు.
3/5
![ఈ సమస్య నుంచి బయట పడేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ నిబంధన తీసుకొచ్చింది. పేమెంట్ గడువు ముగిసిన మూడు రోజుల వరకు గ్రేస్ పీరియెడ్‌ను పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉదాహరణకు ప్రతి నెలా 10న మీరు బిల్లు చెల్లించేందుకు చివరి తేదీ అనుకోండి! 13న బిల్లు కట్టినా ఇబ్బందేమీ ఉండదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/14/0b7135c58ddcaea785a5ce3033c5046c053ed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సమస్య నుంచి బయట పడేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ నిబంధన తీసుకొచ్చింది. పేమెంట్ గడువు ముగిసిన మూడు రోజుల వరకు గ్రేస్ పీరియెడ్‌ను పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉదాహరణకు ప్రతి నెలా 10న మీరు బిల్లు చెల్లించేందుకు చివరి తేదీ అనుకోండి! 13న బిల్లు కట్టినా ఇబ్బందేమీ ఉండదు.
4/5
![చాలా మంది గడువు ముగిసిన మరుసటి రోజు బిల్లు చెల్లిస్తుంటారు. ఇలాంటి వారికి ఈ నిబంధన వల్ల మేలు కలుగుతుంది. రూ.1000 నుంచి భారీ స్థాయిలో జరిమానా పడకుండా జాగ్రత్త పడొచ్చు. మూడు రోజుల గ్రేస్ పీరియెడ్ ఉన్నప్పటికీ గడువులోపు డబ్బులు చెల్లిస్తే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం ఉండదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/14/7eff4b296baa6bd5f55fffbd15b9741047e9d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చాలా మంది గడువు ముగిసిన మరుసటి రోజు బిల్లు చెల్లిస్తుంటారు. ఇలాంటి వారికి ఈ నిబంధన వల్ల మేలు కలుగుతుంది. రూ.1000 నుంచి భారీ స్థాయిలో జరిమానా పడకుండా జాగ్రత్త పడొచ్చు. మూడు రోజుల గ్రేస్ పీరియెడ్ ఉన్నప్పటికీ గడువులోపు డబ్బులు చెల్లిస్తే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం ఉండదు.
5/5
![కొందరు రెండుకు మించి క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తుంటారు. వీటికి వేర్వేరు బిల్లింగ్ సైకిల్స్ ఉండటం వల్ల ఇబ్బంది పడుతుంటారు. తమకు అనుకూలంగా ఒక బిల్లింగ్ తేదీని నిర్ణయించుకొనేందుకు ఆర్బీఐ వీలు కల్పించింది. అన్ని కార్డులు బిల్లింగ్ సైకిల్‌ను ఒకే తేదీకి మార్చుకోవచ్చు. ఇలా ఒక కార్డుకు ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/14/18dd6639123af300ebb993cff49e085d8de05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కొందరు రెండుకు మించి క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తుంటారు. వీటికి వేర్వేరు బిల్లింగ్ సైకిల్స్ ఉండటం వల్ల ఇబ్బంది పడుతుంటారు. తమకు అనుకూలంగా ఒక బిల్లింగ్ తేదీని నిర్ణయించుకొనేందుకు ఆర్బీఐ వీలు కల్పించింది. అన్ని కార్డులు బిల్లింగ్ సైకిల్‌ను ఒకే తేదీకి మార్చుకోవచ్చు. ఇలా ఒక కార్డుకు ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుంది.
Published at : 14 Dec 2022 06:11 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion