అన్వేషించండి
Vice President Venkaiah Tour: విద్యార్థులకు హితబోధ చేస్తూ, నాయకులపై సెటైర్లు వేస్తూ సాగిన వెంకయ్య టూర్

విద్యార్థులతో మాట్లాడుతున్న వెంకయ్య
1/22

గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ డైమండ్ జూబ్లీ వేడుకలు ప్రారంభిస్తున్న ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు.
2/22

గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ డైమండ్ జూబ్లీ వేడుకలు ప్రారంభిస్తున్న ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు.
3/22

వేడుకల సందర్భంగా మొక్క నాటిన ఉపరాష్ట్రపతి వెంకయ్య
4/22

మానవసేవే మాధవసేవగా భావించి జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన మహోన్నత దేశభక్తుడు పాటిబండ్ల సీతారామయ్య అని గుర్తు చేసిన వెంకయ్య
5/22

పిల్లల్ని కలవడం, వారితో మాట్లాడ్డం ఓ గొప్ప అనుభూతిగా భావిస్తూ ఉంటానన్నారు వెంకయ్య.
6/22

ఎంతో మంది గొప్ప వ్యక్తులను దేశానికి అందించిన పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్న వెంకయ్య
7/22

విద్యార్థులు మాత్రమే కాదు. రేపటి దేశ భవిష్యత్తు. పురోగతికి, అభివృద్ధికి విద్య బలమైన పునాదని అభిప్రాయపడ్డారు.
8/22

విద్య వల్ల మనిషి విజ్ఞానవంతునిగానే గాక, సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరునిగా ఎదగగలడని అభిప్రాయపడ్డారు వెంకయ్య
9/22

గుంటూరులోని అన్నమయ్య గ్రంథాలయాన్ని సందర్శించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య.
10/22

చదివిన ప్రతి పుస్తకాన్ని దాచి ముందు తరాలకు అందించాలనే సంకల్పంతో ఈ గ్రంథాలయ ఏర్పాటు చేసిన లంకా సూర్యనారాయణ చిత్తశుద్ధి అభినందించారు.
11/22

లక్షా 25 వేలకుపైగా పుస్తకాలను ఏర్పాటు చేయడమే గాక, ఫోన్ ద్వారా, ఆన్ లైన్ ద్వారా తమ సేవలను అందిస్తున్న గ్రంథాలయం చొరవ గురించి తెలిసి ఆనందించారు వెంకయ్య.
12/22

గ్రంథాలయ ఏర్పాటులో సహకారం అందించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇతర నిర్వాహకులను ఉపరాష్ట్రపతి అభినందించారు.
13/22

గ్రంథాలయ ఏర్పాటులో సహకారం అందించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇతర నిర్వాహకులను ఉపరాష్ట్రపతి అభినందించారు.
14/22

గుంటూరులోని సీనియర్ నాయకులు జూపూడి యజ్ఞ నారాయణ ఇంటికి వెళ్లారు వెంకయ్య. జూపూడి యజ్ఞ నారాయణ కుటుంబ సభ్యుల అభిమానం, ఆయన భార్య హైమావతమ్మ ఆప్యాయత మరువలేనివిగా అభివర్ణించారు ఉపరాష్ట్రపతి.
15/22

తన రాజకీయ జీవితం తొలినాళ్లలో ఎప్పుడు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చినా జూపూడి యజ్ఞ నారాయణ ఇంట్లోనే ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు వెంకయ్య. నాటి స్మృతులను గుర్తు చేసుకుంటే ఒక్కసారిగా మనసు ఉద్విగ్నభరితంగా ఉంటుందన్నారు వెంకయ్య
16/22

చదువులు డిగ్రీల కోసమో, ఉద్యోగాల కోసమో కాదు. విజ్ఞానవంతులైన యువత సమాజానికి ఉపయోగపడే సంస్కారవంతులుగా ఎదగాలి. పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, వివక్షల వంటి దురాచారాలను తావులేని నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను.
17/22

పురస్కారం అంటే ఓ గుర్తింపు. ఓ ఉన్నతమైన కార్యాన్ని గుర్తించి, సమాజం మెచ్చే గౌరవాన్ని అందించడమన్నారు వెంకయ్య. ఇది భారతీయుల సంస్కారం. సనాతన సంస్కృతికి ప్రతిరూపమని వ్యాఖ్యానించారు.
18/22

అనేక సంవత్సరాలుగా వివిధ రంగాలకు చెందిన ఎంతో మందిని సత్కరిస్తున్న ఫౌండేషన్ ఛైర్మన్ రామినేని ధర్మప్రచారక్, సంస్థ కన్వీనర్ పాతూరి నాగభూషణం, ఇతర నిర్వాహకులను వెంకయ్య అభినందించారు.
19/22

డా. రామినేని ఫౌండేషన్ నుంచి అవార్డులు పొందిన 32 మంది గురువులకు, 286 మంది విద్యార్థులను అభినందించారు వెంకయ్య.
20/22

కరోనా కాలంలో ముందు వరుస పోరాట యోధులుగా పని చేసిన గురువులకు ఈ గౌరవాన్ని ఇవ్వడం చాలా సంతోషమన్నారు ఉపరాష్ట్రపతి
21/22

చదువులు డిగ్రీల కోసమో, ఉద్యోగాల కోసమో కాదన్న వెంకయ్య విజ్ఞానవంతులైన యువత సమాజానికి ఉపయోగపడే సంస్కారవంతులుగా ఎదగాలని కోరారు.
22/22

పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, వివక్షల వంటి దురాచారాలను తావులేని నవభారత నిర్మాణంలో యువత, విద్యార్థులు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
Published at : 02 Mar 2022 12:12 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion