అన్వేషించండి
In Pics: అశ్వవాహనంపై శ్రీవారు.. సేవలో పాల్గొన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ ఎన్వీ రమణ
1/5

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీమలయప్ప స్వామి వారు కల్కి అలంకారంలో అశ్వ వాహనంపై దర్శనమిచ్చారు.
2/5

దసరా సందర్భంగా తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని సీజేఐ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. అనంతరం తిరుమల చేరుకొని శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహన సేవలో పాల్గొన్నారు.
3/5

వాహనసేవ అనంతరం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శ్రీవారిని దర్శించుకున్నారు.
4/5

ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లలిత కుమారి, జస్టిస్ సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
5/5

ఛత్తీస్‌ఘడ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్త్ ప్రతీం సాహు, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.సోమరజన్, శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Published at : 14 Oct 2021 10:37 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















