తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం రాత్రి సింహ వాహనంపై యోగనరసింహస్వామి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు.
సింహ వాహనంపై యోగనరసింహస్వామి అలంకారంలో లోకమాత
కోవిడ్-19 కారణంగా ఆలయం వద్ద వాహన మండపంలో రాత్రి 7 నుండి 8 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది.
సింహం పరాక్రమానికి, శీఘ్రగమనానికి, వహనశక్తికి ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తుంది. భగవతి పద్మావతి ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ (ప్రభ), జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు గుణాలను భక్తులకు ప్రసాదిస్తుంది. శ్రీ వేంకటేశ్వర హృదయేశ్వరిని స్వామితో మమేకమైన శక్తిగా ధ్యానించడం సంప్రదాయం.
వాహనసేవలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
కుటుంబ సభ్యులతో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన అనురాధ
AP MLC Elections: ఇంటి నుంచి ఎమ్మెల్యేలతో బయల్దేరి వెళ్లి ఓటు వేసిన చంద్రబాబు
AP MLC Elections: మొదటి ఓటు వేసిన సీఎం జగన్ - ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియ
Chandrababu Ugadi: ఉగాది వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు
AP CM Jagan Ugadi: ఉగాది వేడుకల్లో సతీ సమేతంగా సీఎం జగన్
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల