అన్వేషించండి

Yuvagalam Navashakam Photos: టీడీపీ, జనసేన పొత్తుతో ఏపీ ప్రజలకు విముక్తి: చంద్రబాబు

Yuvagalam Navashakam Photos: యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ 226 రోజులు, 97 నియోజకవర్గాలు, 2100 గ్రామాలు, 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ముగింపు సభకు విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేశారు.

టీడీపీ, జనసేన పొత్తుతో ఏపీ ప్రజలకు విముక్తి: చంద్రబాబు

1/24
యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లిలో టీడీపీ నిర్వహించిన యువగళం - నవశకం బహిరంగ సభ విజయవంతమైంది.

2/24
జ‌గ‌న్ ఐపీఎల్ టీము పెడ‌తామంటున్నాడని.. దీనికి కోడిక‌త్తి వారియ‌ర్స్ అని పేరు పెడితే బాగుంటుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. వారిలో సీనియ‌ర్ బ్యాట్స్ మెన్ అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్, అర‌గంట స్టార్ అంబ‌టి, గంట‌ స్టార్ అవంతి, ఆల్ రౌండ‌ర్ గోరంట్ల మాధ‌వ్, రీల్ స్టార్ భ‌ర‌త్, బూతుల స్టార్ కొడాలి నాని, పించ్ హిట్టర్ బియ్యం మ‌ధు ఉంటారని.. అబ్బో మామూలు టీం కాదని ఎగతాళి చేశారు.

3/24
పాదయాత్ర అన్ని వర్గాల ప్రజలమధ్య విజయవంతంగా కొనసాగిందని.. ఇది యువగళం పాదయాత్ర ముగింపు సభ కాదని, వైసీపీ అంతిమ యాత్రకు ఆరంభ సభ అని బాలకృష్ణ అన్నారు. నవశకం బహిరంగసభలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రసంగించారు.

4/24
యువగళం నవశకం బహిరంగ సభకు నందమూరి, నారా కుటుంబసభ్యులు హాజరయ్యారు. అదేవిధంగా నేడు యువగళం పాదయాత్రకు అంతటి విశేష స్పందన వచ్చింది

5/24
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి టీడీపీ శ్రేణులు, జనసైనికులు పెద్ద ఎత్తున ఈ సభకు హాజరయ్యారు. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో సభకు హాజరై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు.

6/24
యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లాలో టీడీపీ నిర్వహించిన యువగళం - నవశకం బహిరంగ సభలో నారా లోకేష్ ప్రసంగించారు.

7/24
‘‘ఏ బొమ్మ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో, ఏ బొమ్మ చూస్తే జగన్ కి జ్వరం వస్తుందో, ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి ప్యాలస్ లో టీవీలు పగులుతాయో ఆ బొమ్మ నేను మీకు చూపిస్తున్నా. విజనరీ చంద్రబాబు, పవర్ ఫుల్ పవనన్న, మన సింహం బాలయ్య బొమ్మ అదుర్స్ కదూ. ఒక సారి జూమ్ వెయ్యండమ్మా జగన్ కి ఐమ్యాక్స్ సినిమా చూపిద్దాం అన్నారు లోకేష్

8/24
యువగళం నవశకం బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

9/24
ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి తెలుగుదేశం, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu) ధీమా వ్యక్తం చేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలని.. టీడీపీ, జనసైనికులు కలిసి పనిచేస్తే ఇది సాధ్యమన్నారు.

10/24
విజయనగరంలో ఏర్పాటు చేసిన యువగళం నవశకం భారీ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ పాలనపై, సీఎం జగన్ (AP CM YS Jagan) పై నిప్పులు చెరిగారు.  జాబ్ క్యాలెండర్ అని మభ్యపెట్టిన జగన్.. ఐదేళ్లే గడిచినా జాబ్ క్యాలెండర్ లేదు, జాబులు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.

11/24
టీడీపీ, జనసేన మైత్రిని చాలా కాలం పాటు కాపాడుకోవాల్సి ఉందని  జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీ ఒక మోడల్ స్టేట్ అని, అందరూ అక్కడ పని చేయాలని బావించే వారు... నేడు ఎపీకి ఎందుకు వెళ్లకూడదో చెప్పే పరిస్థితికి జగన్ తీసుకు వచ్చారన్నారు.

12/24
ఇది యువగళం ముగింపు సభ కాదు.. ఇది ఆరంభం. ఇది నవశకం. తాడేపల్లి ప్యాలస్ గోడలు బద్దలు కొడదాం. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం.  రాక్షసరాజ్యంలో పాదయాత్ర చెయ్యడం ఒక విప్లవం. యువగళం.. మనగళం.. ప్రజాబలం అన్నారు నారా లోకేష్

13/24
‘చంద్రబాబును చూస్తే జగన్ కి భయం, పవనన్నని చూస్తే జగన్ కి భయం, మీ లోకేష్ ని చూస్తే జగన్ కి భయం. అందుకే చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు బంధించారు. విజనరీ అంటే చంద్రబాబు. ప్రిజనరీ అంటే జగన్ ఇది ఫిక్స్’ అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు.

14/24
చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు  తనకు చాలా బాధ కలిగిందన్నారు.  కష్టాలు చూసిన వాడిని, దగ్గర నుంచి చిన్నప్పుటి నుంచి బాధలు పడిన వాడినని గుర్తు చేశారు.  ఓటమి ఎదురైతే ఎలా ఉంటుందో భరించిన వాడినన్నారు.  చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆవేదన, భువనేశ్వరి బాధ చూశాను  నేను ఏదీ ఆశించి టీడీపీకి, చంద్రబాబుకు మద్దతు ఇవ్వలేదు..  జైల్లో ఆయన చూసిన తర్వాత బయటకు వచ్చి మద్దతు ప్రకటించానని పవన్ అన్నారు.

15/24
తెలుగుదేశం, జనసేన రాష్ట్ర ప్రజలకు, యువతకు అండగా ఉంటుందని, ఉద్యోగాలు కల్పిస్తుందని భరోసా కల్పించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన తెలుగుతమ్ముళ్లకు, జనసైనికులకు టీడీపీ అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

16/24
కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర.. మాటలతో చెప్పే పాదయాత్ర కాదు.. చేతలతో చూపించిన పాదయాత్ర అని ప్రశంసించారు.  అటువంటి పాదయాత్ర చేసిన లోకేష్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని..  నేను నడుద్దాం అంటే... నన్ను నడవనిచ్చే పరిస్థితి ఉండదన్నారు.

17/24
226 రోజులు రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల సమస్యల్ని నారా లోకేష్ అధ్యయనం చేశారన్నారు. దేశంలో పాదయాత్రలు, బస్సు యాత్రలు కొత్త కాదు, ప్రజల్ని చైతన్యం చేయడానికి నందమూరి తారకరామారావు చైతన్యయాత్ర చేశారు. కానీ పాదయాత్రలపై దండయాత్ర చేయడం తొలిసారి జగన్ పాలనలో చూశానంటూ మండిపడ్డారు.

18/24
ప్రజా సమస్యలపై గళం విప్పేందుకు పాదయాత్ర చేసిన నారా లోకేష్ ను పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు అభినందించారు. ప్రజాగళమే యువగళం అయిందని కొనియాడారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లు ప్రజల కోసం చేస్తున్న పనుల్ని అభినందించారు. రాజకీయ వ్యతిరేకత ఉండాలి కానీ, వ్యక్తిగత కక్షలు ఉండకూడదని సూచించారు.

19/24
ప్రజల సమస్యల్ని తెలుసుకునేందుకు నేత పాదయాత్ర చేస్తే, చేతనైతే సహకరించాలి.. లేకపోతే ఇంట్లో పడుకోవాలన్నారు. యువగళం పాదయాత్ర సమయంలో టీడీపీ నేతల్ని ఇబ్బందులకు గురిచేసింది వైసీపీ ప్రభుత్వం. త్వరలో అధికారంలోకి వచ్చి వడ్డీతో సహా జగన్ కు తిరిగిస్తామన్నారు.

20/24
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ

21/24
జగన్ గెలవగానే. మంచి ప్రభుత్వం తో పాలన చేయండి.. మేము సహకరిస్తామని నేను అభినందనలు చెప్పానని.. కక్ష సాధింపు రాజకీయాలతోనే జగన్ అందరినీ బూతులు తిట్టించాడని విమర్శించారు.

22/24
పాదయాత్ర ద్వారా చాలా మంది సాధకబాధకాలు తెలుసుకు అవకాశం ఉంటుందని..  నాకు అటువంటి అవకాశం లేకపోవడం కొంత బాధగా కూడా ఉందన్నారు.  ఎపీ స్పూర్తి నేడు భారతదేశానికే చేలా కీలకమని..   భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయంటే పొట్టి శ్రీరాములు బలిదానం కారణమన్నారు.  ఆయన స్పూర్తి వల్లే ఎపీ అవతరించింది అన్నారు పవన్ కళ్యాణ్

23/24
సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇలా పరిస్థితి ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి.  మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ప్రజలు బతకలేరన్నారు.   పెట్టుబడులు రావు.. పరిశ్రమలు ఉండవు. ఎవరూ ఏపీలోకి రారు. ఇప్పటం సభలోనే వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని ప్రకటించానని గుర్తు చేశారు.

24/24
టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.  జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు మేం ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదు. యువగళంపై సైకో జగన్మోహన్ రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించాడో రాష్ట్రమంతా చూసిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Janasena : 23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
Telangana Secretariat News: తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
Pawan Chandrababu:  చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
Telangana Caste census: తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Sri Ramakrishna Teertham Mukkoti | ముక్కోటి తీర్థానికి వెళ్లి రావటం ఓ అనుభూతి | ABP DesmBr Shafi Interview on Radha Manohar Das | నాది ఇండియన్ DNA..మనందరి బ్రీడ్ ఒకటే | ABP DesamAP Deputy CM Pawan kalyan in Kerala | కొచ్చి సమీపంలో అగస్త్యమహర్షి గుడిలో పవన్ కళ్యాణ్ | ABP DesamMegastar Chiranjeevi Comments Controversy | చిరంజీవి నోరు జారుతున్నారా..అదుపు కోల్పోతున్నారా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena : 23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
Telangana Secretariat News: తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
తెలంగాణ సచివాలయంలో నిర్మాణ లోపాలు! పెచ్చులు ఊడిపడటంతో అధికారులు అప్రమత్తం
Pawan Chandrababu:  చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
చంద్రబాబు ఫోన్లకూ పవన్ స్పందించడం లేదా ? - అసలేం జరిగిందో తెలుసా
Telangana Caste census: తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
తెలంగాణలో మరోసారి కులగణన - గత సర్వేలో నమోదు చేయించుకోని వారికే !
Ind Vs Eng Odi Series Clean Sweap:  సిరీస్ క్లీన్ స్వీప్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. 142 రన్స్ తో ఇంగ్లాండ్ ఘోర పరాజయం
సిరీస్ క్లీన్ స్వీప్.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. 142 రన్స్ తో ఇంగ్లాండ్ ఘోర పరాజయం
Telangana News:తెలంగాణలో శివరాత్రి రోజున ఉపవాసం ఉండే భక్తులకు ఫలహారం పంపిణీ- మంత్రి కీలక ఆదేశాలు
తెలంగాణలో శివరాత్రి రోజున ఉపవాసం ఉండే భక్తులకు ఫలహారం పంపిణీ- మంత్రి కీలక ఆదేశాలు
APPSC Group -II: గ్రూప్- 2 అభ్యర్థులకు అలర్ట్‌.. మెయిన్స్ హాల్‌టికెట్స్‌ వచ్చేస్తున్నాయి

Pawan Kalyan Temple Tour: అగస్త్య మహర్షితో మొదలు పెట్టి పరుశురామ సందర్శనతో ముగిసిన పవన్ కల్యాణ్ మొదటి రోజు యాత్ర
అగస్త్య మహర్షితో మొదలు పెట్టి పరుశురామ సందర్శనతో ముగిసిన పవన్ కల్యాణ్ మొదటి రోజు యాత్ర
Embed widget