అన్వేషించండి
Advertisement

(Source: ECI/ABP News/ABP Majha)
CM Chandrababu: శపథం చేసి సాధించారు - అవమానంతో బయటకు వెళ్లి విజయగర్వంతో సభలోకి, ప్రతి టీడీపీ కార్యకర్త తలెత్తుకునే ఫోటోలివే!
AP Assembly Session 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సభలో ప్రమాణస్వీకారం చేశారు.

ఏపీ అసెంబ్లీ ఎమ్మెల్యేగా సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారం
1/9

ఏపీ అసెంబ్లీలోకి అడుగు పెడుతూ సభ్యులకు సీఎం చంద్రబాబు అభివాదం చేశారు. ఈ ఫోటో చూస్తే ఎన్నో అవమానాలను ఎదుర్కొని విజయ గర్వంతో సభలోకి అడుగు పెట్టిన ఓ పోరాట యోధుడు కనిపిస్తున్నారంటూ టీడీపీ నేతలు భావిస్తున్నారు.
2/9

ఆనాడు చంద్రబాబు శపథం చేశారు. కౌరవ సభను గౌరవ సభగా మార్చి అప్పుడే అసెంబ్లీలోకి అడుగు పెడతానని అన్నారు. చెప్పినట్లుగానే చారిత్రాత్మక విజయంతో సభలోకి అడుగుపెట్టారు.
3/9

ఇది కదా గూస్ బంప్స్ తెప్పించే ఫోటో. సభలో తొలిసారి అడుగు పెట్టిన జనసేనాని పవన్ కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరిస్తూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
4/9

సంతోషంలో చంద్రబాబు, పవన్. అవమానాలు ఎదుర్కొని విజయ గర్వంతో సభలోకి అడుగుపెట్టిన చంద్రబాబు, తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన జనసేనాని పవన్ కల్యాణ్. ఇది నిజంగా ఫోటో ఆఫ్ ది డేనే.
5/9

'నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది' అంటూ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు సభలో ఇలా ఫ్లెక్సీలు ప్రదర్శించారు. అసెంబ్లీలో చంద్రబాబు అడుగు పెట్టడంతో చంద్రబాబుకు జయ ధ్వానాలు పలుకుతూ నినాదాలు చేశారు.
6/9

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ముందు సభలో సీఎం చంద్రబాబు.
7/9

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు.
8/9

ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సంతకం చేస్తున్న చంద్రబాబు.
9/9

ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సీఎం చంద్రబాబు అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలకరించారు.
Published at : 21 Jun 2024 10:38 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
హైదరాబాద్
విశాఖపట్నం
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement