అన్వేషించండి

Chandrababu: ప్రాజెక్టుల సందర్శనకు చంద్రబాబు రెడీ- బహిరంగ చర్చకు వైసీపీ నేతలు సవాల్!

Chandrababu To visit Projects in AP: ప్రాజెక్టుల సందర్శనకు వెళుతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందు బహిరంగ చర్చకు రావాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Chandrababu To visit Projects in AP: ప్రాజెక్టుల సందర్శనకు వెళుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందు బహిరంగ చర్చకు రావాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలోనే ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు విడుదల అయ్యాయని, ప్రాజెక్టుల సందర్శనకు ముందు బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబును ఎంపీ నందిగం సురేష్ డిమాండ్ చేశారు.

చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ప్రాజెక్టులకు వెళతారు..
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ప్రాజెక్ట్ ల సందర్శన యాత్రకు వెళ్లనున్నారు. దీనిపై అధికార వైసీపీ నేతలు మాజీ సీఎం చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసురుతున్నారు. చంద్రబాబుకు దమ్ముంటే ప్రాజెక్ట్ లపై బహిరంగంగా చర్చించేందుకు రావాలని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు హయాంలో అసలు ప్రాజెక్ట్  లకు నీరు కూడా ఉండేది కాదని, కరువు రాజ్యం ఏలిన సందర్బాలు మరిచిపోయారా అని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాజెక్టుల కోసం పదివేల కోట్ల రూపాయలు నిధులు విడుదల అయిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ ల సందర్శనకు వెళుతున్న చంద్రబాబు ముందు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

సినిమాల్లో కూడా పవన్ ఫెయిల్...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చేయలేనిది సినిమాల్లో చేసేద్దామని భమపడుతున్నారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. పవన్ పిచ్చి ఆనందం కోసమే బ్రో సినిమా తీశారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో సాధ్యం కావటం లేదని సినిమాల ద్వాార దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బ్రో సినిమా ఎందుకు తీసామని భాద పడపడే పరిస్దితి ఏర్పడిందిన ఆయన అన్నారు. వపన్ కళ్యాణ్ సినిమాల్లో కూడా ఫెయిల్ అవుతున్నారని వ్యాఖ్యానించారు.

పేదలకు ఇళ్లు ఇస్తుంటే ఏడుపెందుకు...
అమరావతి రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తుంటే ప్రతిపక్షాలు నానా రాద్దాంతం చేస్తున్నాయని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేసే మంచి పనులను అడ్డుకునేందుకు అనేక రకాలుగా కుట్రలు చేశారని అయితే, జగన్ సంకల్పం ముందు అవేమి ఆగలేదన్నారు. పేదవాడు, పెత్తందారి వ్యవస్థకు మధ్యలో జగన్ ఉండి అణగారిన వర్గాలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. అమరావతి లో ఎస్సీలు ఉండకూడదని కుట్ర చేశారని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డిపై కూడా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, అంత భయం ఎందుకని ప్రశ్నించారు. సిగ్గులేకుండా అబద్దాలు ఆడుతూ, లేని పోని అసత్య ప్రచారాలు చేసి కాలం గడుపుకోవటం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. 

గత ప్రభుత్వం హయాంలో దళితులని ఎలా మోసం చేశారో అందరూ చూశారని, వచ్చే ఎన్నికల్లో గెలవలేము అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించి, వారికి అక్కడే ఇళ్ళను కూడా నిర్మించి ఇస్తుంటే, ఇంకా లేని పోని ఆరోపణలు చేస్తూ, దిగజారి ప్రకటనలు చేయటం మానుకోవాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రజలే పూర్తిగా బుద్ధి చెబుతారని అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Group 1: తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు బ్రేక్!
Telangana Group 1: తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు బ్రేక్!
YS Jagan:  వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !
వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !
AP Liquor Scam News:  లిక్కర్ స్కాంలో పోలీసులతో గేమ్ ఆడుతున్న నిందితులు - ఎన్ని నోటీసులిచ్చినా ఒక్కరూ రారే - సీఐడీ ఎం చేయబోతోంది ?
లిక్కర్ స్కాంలో పోలీసులతో గేమ్ ఆడుతున్న నిందితులు - ఎన్ని నోటీసులిచ్చినా ఒక్కరూ రారే - సీఐడీ ఎం చేయబోతోంది ?
Waqf Bill:  వక్ఫ్  చట్టంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - స్టేటస్ కో విధింపు
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - స్టేటస్ కో విధింపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mitchell Starc vs Yashasvi Jaiswal in IPL 2025 | స్టార్క్ వర్సెస్ జైశ్వాల్  | ABP DesamAxar Patel Kuldeep Yadav vs RR | IPL 2025 లో ఢిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న అక్షర్, కుల్దీప్DC vs RR Super Over Failure | IPL 2025 లో తొలి సూపర్ ఓవర్..చేతులారా నాశనం చేసుకున్న RRMitchell Starc vs Yashasvi Jaiswal | IPL 2025 లో కొనసాగుతున్న స్టార్క్ వర్సెస్ జైశ్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Group 1: తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు బ్రేక్!
Telangana Group 1: తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు బ్రేక్!
YS Jagan:  వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !
వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్ !
AP Liquor Scam News:  లిక్కర్ స్కాంలో పోలీసులతో గేమ్ ఆడుతున్న నిందితులు - ఎన్ని నోటీసులిచ్చినా ఒక్కరూ రారే - సీఐడీ ఎం చేయబోతోంది ?
లిక్కర్ స్కాంలో పోలీసులతో గేమ్ ఆడుతున్న నిందితులు - ఎన్ని నోటీసులిచ్చినా ఒక్కరూ రారే - సీఐడీ ఎం చేయబోతోంది ?
Waqf Bill:  వక్ఫ్  చట్టంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - స్టేటస్ కో విధింపు
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - స్టేటస్ కో విధింపు
AP DSC 2025: ఏపీలో టెట్‌తో కలిపి డీఎస్సీ ఉంటుందా? ఈసారి అప్లికేషన్‌లో చేస్తున్న మార్పులేంటో తెలుసా?
ఏపీలో టెట్‌తో కలిపి డీఎస్సీ ఉంటుందా? ఈసారి అప్లికేషన్‌లో చేస్తున్న మార్పులేంటో తెలుసా?
Shine Tom Chacko: హోటల్‌లో డ్రగ్స్ కోసం పోలీసుల తనిఖీలు - పారిపోయిన 'దసరా' మూవీ విలన్?
హోటల్‌లో డ్రగ్స్ కోసం పోలీసుల తనిఖీలు - పారిపోయిన 'దసరా' మూవీ విలన్?
Abhinaya Wedding: అభినయకు పెళ్లైంది... బాయ్‌ఫ్రెండ్‌తో ఏడడుగులు వేసిన నటి... లేటుగా ఫోటోలు విడుదల
అభినయకు పెళ్లైంది... బాయ్‌ఫ్రెండ్‌తో ఏడడుగులు వేసిన నటి... లేటుగా ఫోటోలు విడుదల
Pawan Kalyan: పవన్ కల్యాణ్ గోశాల పర్యటన క్యాన్సిల్ - తిరుమల టూర్ కూడా వాయిదా !
పవన్ కల్యాణ్ గోశాల పర్యటన క్యాన్సిల్ - తిరుమల టూర్ కూడా వాయిదా !
Embed widget