Top Headlines Today: 15 ఏళ్లుగా బద్ద శత్రువులు, ఇప్పుడు తారా స్థాయికి - కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక - నేటి టాప్ న్యూస్
Andhra Pradesh News Today | ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే అనంతబాబు వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ఇచ్చింది.
Telangana News Today on 25 August 2024 | ఆ ప్రముఖుల కట్టడాలను కూల్చివేసిన హైడ్రా, ప్రభుత్వానికి కీలక నివేదిక
తెలంగాణ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు, చెరువులు, ఇతర జలాశయాల స్థలాలు కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేయడం తెలిసిందే. గత కొన్ని రోజులుగా హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో శనివారం నాడు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి హైడ్రా సిబ్బంది నేలమట్టం చేయడం వివాదాస్పదమైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తాడిపత్రిలో ఒంటరైన రారాజు కేతిరెడ్డి! కనీసం నియోజకవర్గంలోకి నో ఎంట్రీ!
అధికారం ఉన్నప్పుడు ఆ నియోజకవర్గంలో ఆయన రారాజుగా వెలుగొందారు. తాను చెప్పిందే శాసనంగా నియోజకవర్గంలో చక్రం తిప్పారు. కట్ చేస్తే ఎన్నికల్లో అధికార పార్టీతో పాటు ఆయన కూడా ఓటమి చవి చూశారు. దీంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో రారాజుగా వెలుగొందిన నేత ఒంటరి అయిపోయాడు. నియోజకవర్గంలోకి వెళ్లాలన్నా కూడా అనుమతి దొరకడం లేదు ఇంతకు ఆ నియోజకవర్గంలో ఏది ఆ నేత ఎవరు అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అప్పటికల్లా హైదరాబాద్‌లో ఒలింపిక్స్, ప్రధానిని కోరతాం - రేవంత్ కీలక వ్యాఖ్యలు
2036లో ఇండియాలో ఒలింపిక్స్ను నిర్వహించాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని.. అలాంటి ఒలింపిక్స్ క్రీడలకు హైదరాబాద్ వేదిక చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో హైదరాబాద్ మారథాన్-24లో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. క్రీడా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే హైడ్రా టార్గెట్, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ - హరీశ్ రావు
డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యాతో గజగజలాడుతుండగా, లక్షలాది మంది రైతులు రుణమాఫీ కోసం ధర్నాలు చేస్తుండగా.. ప్రభుత్వం మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ కు ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. హైడ్రా పేరుతో హైడ్రామా నడుపుతోందని.. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని పని చేస్తోందని అన్నారు. ‘‘పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు. ప్రజల పక్షాన నిబద్దతగా పని చేసిన వ్యక్తి పల్లా. కాంగ్రెస్ కండువా కప్పుకోండి.. లేకపోతే ఇబ్బంది పెడతాం అన్నట్లు రేవంత్ తీరు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఇద్దరూ సొంత ఫ్యామిలీ! 15 ఏళ్లుగా బద్ద శత్రువులు - ఇప్పుడు తార స్థాయికి
వరసకు బామ్మర్దులు.. రాజకీయాల్లో రాటుదేరినవారు.. ఆ ఇద్దరూ ఇప్పుడు గట్టి ప్రత్యర్థులు. వారే ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. రవికుమార్ కి.. సొంత బావ తమ్మినేని. తోడబుట్టిన వాణిని రవి కుమార్ సీతారాంకిచ్చి వివాహం జరిపించారు. అలాగే సీతారాం సొంత అక్క రవికుమార్ తల్లి. ఒకప్పుడు అందరూ కలిసి మెలిసి ఉండేవారు. ఆముదాలవలస నియోజకవర్గ రాజకీయాలను శాసించేవారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి