అన్వేషించండి

AP News: ఇద్దరూ సొంత ఫ్యామిలీ! 15 ఏళ్లుగా బద్ద శత్రువులు - ఇప్పుడు తార స్థాయికి

AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్ గా మారింది ఆమదాలవలస. బావ బామ్మర్దులు ఇద్దరూ కూడా నువ్వా అంటే నువ్వు అన్న టైప్ లోకి వచ్చింది.

Tammineni Seetharam Vs Kuna Ravi Kumar: వరసకు బామ్మర్దులు.. రాజకీయాల్లో రాటుదేరినవారు.. ఆ ఇద్దరూ ఇప్పుడు గట్టి ప్రత్యర్థులు. వారే ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. రవికుమార్ కి.. సొంత బావ తమ్మినేని. తోడబుట్టిన వాణిని రవి కుమార్ సీతారాంకిచ్చి వివాహం జరిపించారు. అలాగే సీతారాం సొంత అక్క రవికుమార్ తల్లి. ఒకప్పుడు అందరూ కలిసి మెలిసి ఉండేవారు. ఆముదాలవలస నియోజకవర్గ రాజకీయాలను శాసించేవారు.

టీడీపీలో బాగా గుర్తింపు

తెలుగుదేశం పార్టీలో తమ్మినేని సీతారాం ఒక వెలుగు వెలిగారు. ఎమ్మెల్యేగా 4 సార్లు, మంత్రిగా ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఎక్కడ పొరపొచ్చాలు వచ్చాయో కానీఇద్దరినీ రాజకీయంగా విడదీసింది.. కుటుంబాలుకూడా వేరుపడ్డాయి.. కొంతమంది సీతారాంవైపు.. మరికొందరు రవికుమార్ వైపు చెదిరిపోయారు.. గత పదిహేనేళ్లుగా ఇద్దరూ వేరువేరు పార్టీలలో ఉంటూ ఒకరి మీద ఒకరురాజకీయ కత్తులు దూసుకుంటున్నారు. తమ్మినేని గడిచిన రెండు దశాబ్దాలలో కేవలం ఒకసారిమాత్రమే గెలిస్తే కూన రవికుమార్ రెండు సార్లు గెలిచారు. అయితే అంతకు ముందు ఆముదాలవలసలో నాలుగు సార్లు గెలిచిన చరిత్ర తమ్మినేనికి ఉంది. మంత్రి పదవులూ చేపట్టారు. జిల్లాలో ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందారు. రాజకీయంగా సీనియర్ గా తమ్మినేని ఉంటే, టీడీపీలో రవికుమార్ రాజకీయంగా రాటుదేలారు.

బావను ఓడించి

ఇటీవల ఎన్నికల్లో ఆముదాలవలస నుంచి బావను ఓడించి మంచి మెజారిటీతో ఎమ్మెల్యే పీఠం దక్కించుకున్నారు. అయినప్పటికీ వారి మధ్య అనేక విషయాల్లో అభిప్రాయాలు అలుముకుంటున్నాయి. ఎన్నికల ముందు విభేదించిన రవికుమార్ ఇప్పుడు తాజాగా తమ్మినేని అక్రమాల చిట్టాను బయటకు తీసే పనిలో ఉన్నారు. తమ్మినేని తప్పుడు డిగ్రీపైసమగ్ర దర్యాప్తు కోసంస్పెషల్ టీంనే నియమించాలనిప్రభుత్వాన్ని కోరారు. సీఐడీ చేత విచారణ జరిపించాలని రవికుమార్ ఫిర్యాదు చేశారు. తమ్మినేనివి ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్లు అని అంతే కాకుండా ఆస్తులకూ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించినగొప్పతనం ఆయనదే అని రవికుమార్ అంటున్నారు. 7 ఆస్తుల విషయంలో తమ్మినేనిఫేక్ దాక్యుమెంట్లు సృష్టించారని ఆ లెక్కలు అన్నీతేల్చే పనిలో రవికుమార్ కంకణంకొట్టుకున్నారు.

ప్రభుత్వం దృష్టికి అన్నివిషయాలు తీసుకొస్తున్నారు. తమ్మినేని అక్రమాల చిట్టా అంతా తన వద్ద ఉందని ఆయన మీద పూర్తి విచారణ వేసి నిగ్గుతేల్చేందుకు అంతా సిద్ధం చేశామని రవికుమార్ ప్రకటించారు. తమ్మినేని వర్సెస్ రవికుమార్ గా ఆముదాలవలసలో సాగుతున్న ఈ రాజకీయ క్రీడ ఆసక్తిగా మారింది.రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మాజీ స్పీకర్ తమ్మినేని ఒక వైపు.. దూకుడు రాజకీయాల్లో తనకు సాటి ఎవరూ లేరని పేరు తెచ్చుకున్న బావమరిది రవికుమార్ మరో వైపు ఉన్నారు. ఉన్నట్టుండి ఎన్నికల అనంతరం ఒక్కసారిగా ఆముదాలవలసలో ఈ రాజకీయ విస్పోటనం వెనక కుటుంబ కథా చిత్రం పైకి రావడం పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

గతం నుంచి కూడా బావా బామ్మర్దుల తగాదా ఒకరికొకరు తిట్టుకోవడంతోనే సరిపోయేది గతంలో కూన రవికుమార్ ఎమ్మెల్యేగా, విప్ గా ఉండేవారు. ఆముదాలవలస నియోజకవర్గంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలోనే తమ్మినేని సీతారాం మీద కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారని.. అందుకే అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తమ్మినేని సీతారాం కూడా స్పీకర్ గా పవర్ ఫుల్ గా ఉండడంతో కూన రవికుమార్ పై కూడా ఎన్నో కేసులు పెట్టించారని ఆరోపణలు ఉన్నాయి.
 
అప్పట్లో కోన రవికుమార్ అధికారులని తిట్టడంతో పెద్ద దుమారమే లేపింది. స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం ఉన్నతాధికారులతో మాట్లాడి రవికుమార్ ను ఎలాగైనా సరే అరెస్టు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారని టాక్ ఉంది. అప్పుడు కూన ముందస్తు బెయిల్ తెచ్చుకొని మళ్లీ రాజకీయం యథావిధిగా కొనసాగించారు. ఇప్పుడు మళ్లీ కూన రవికుమార్ - సీతారాం మధ్య మరింత వైరం పెరిగింది.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd Test Highlights: 24 ఏళ్ల తరువాత స్వదేశంలో టీమిండియా వైట్ వాష్ - కివీస్ విజయభేరి
24 ఏళ్ల తరువాత స్వదేశంలో టీమిండియా వైట్ వాష్ - ముంబై టెస్టులో కివీస్ విజయభేరి
Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
RRR Movie : ‘బాహుబలి 2‘ తర్వాత ‘RRR’.. జక్కన్న సినిమాకు అరుదైన గుర్తింపు!
‘బాహుబలి 2‘ తర్వాత ‘RRR’.. జక్కన్న సినిమాకు అరుదైన గుర్తింపు!
Mysore Pak History: మైసూర్ రాజుల వంటశాలలో బీజం పడిన మైసూర్ పాక్ - దీని చరిత్ర తెలుసా!
మైసూర్ రాజుల వంటశాలలో బీజం పడిన మైసూర్ పాక్ - దీని చరిత్ర తెలుసా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs NZ 3rd Test Highlights | భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి టీమిండియా వైట్ వాష్ | ABP Desamఇజ్రాయెల్‌కు కొత్త ప్రత్యర్థి, డ్రోన్లతో వరుసగా దాడులు!‘సుప్రీం జడ్జినే చంపేశారు, చేతకాని పాలకుడు చెత్తపన్ను వేశాడు’వీడియో: చంద్రబాబుకు ముద్దు పెట్టాలని మహిళ ఉత్సాహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd Test Highlights: 24 ఏళ్ల తరువాత స్వదేశంలో టీమిండియా వైట్ వాష్ - కివీస్ విజయభేరి
24 ఏళ్ల తరువాత స్వదేశంలో టీమిండియా వైట్ వాష్ - ముంబై టెస్టులో కివీస్ విజయభేరి
Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంద కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు
RRR Movie : ‘బాహుబలి 2‘ తర్వాత ‘RRR’.. జక్కన్న సినిమాకు అరుదైన గుర్తింపు!
‘బాహుబలి 2‘ తర్వాత ‘RRR’.. జక్కన్న సినిమాకు అరుదైన గుర్తింపు!
Mysore Pak History: మైసూర్ రాజుల వంటశాలలో బీజం పడిన మైసూర్ పాక్ - దీని చరిత్ర తెలుసా!
మైసూర్ రాజుల వంటశాలలో బీజం పడిన మైసూర్ పాక్ - దీని చరిత్ర తెలుసా!
Investment Idea: తక్కువ పెట్టుబడితో అద్దె ఆదాయం పొందే కొత్త పద్ధతి - మూలధనం లాభాలూ వస్తాయి!
తక్కువ పెట్టుబడితో అద్దె ఆదాయం పొందే కొత్త పద్ధతి - మూలధనం లాభాలూ వస్తాయి!
Viswam OTT : నిన్న అమెజాన్, నేడు ఆహా.. రెండు ఓటీటీల్లో ‘విశ్వం‘ స్ట్రీమింగ్
నిన్న అమెజాన్, నేడు ఆహా.. రెండు ఓటీటీల్లో ‘విశ్వం‘ స్ట్రీమింగ్
Kamala Harris: చిన్నప్పుడు ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
ప్రతి దీపావళికి భారత్‌కు వచ్చి బంధువులతో సరదాగా గడిపేవాళ్లం - కమలా హ్యారిస్
Janasena: వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
Embed widget