అన్వేషించండి

AI Summit: ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన - ప్రపంచం ముందు పరువు తీశారని బీజేపీ ఆగ్రహం

Youth Congress : భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ లో కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన రచ్చ వివాదానికి దారి తీసింది. ప్రపంచం ముందు పరువు తీశారన్న విమర్శలు వస్తున్నాయి.

Youth Congress members shirtless protest at AI Summit : ఇండియా సాంకేతిక నైపుణ్యాన్ని,  ఆవిష్కరణలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అంతర్జాతీయ ఏఐ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. ప్రపంచ దేశాల ప్రతినిధులు, టెక్ దిగ్గజాలు హాజరైన ఈ వేదికపై భారత్ ఒక గ్లోబల్ పవర్‌హౌస్‌గా ఎదుగుతున్న తరుణంలో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిర్వహించిన నిరసన ప్రదర్శనలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. దేశాభివృద్ధిని ప్రతిబింబించే ఇటువంటి కార్యక్రమాల్లో హుందాతనం ప్రదర్శించాల్సింది పోయి, రచ్చ చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

యూత్ కాంగ్రెస్ నేతలు  సమ్మిట్ వేదిక వద్దకు చేరుకుని ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పేసి, అర్ధనగ్నంగా నినాదాలు చేస్తూ అక్కడ తీవ్ర గందరగోళం సృష్టించారు. ఈ ఆందోళన తీవ్ర విమర్శల లాపలవుతోంది. 

గ్లోబల్ లీడర్లు హాజరైన సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం భారత్‌ను అంతర్జాతీయ స్థాయిలో తలవంచుకునేలా చేయడమేనని ఐటీ నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, దేశ గౌరవం ముడిపడి ఉన్న వేదికలను ఇందుకు వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.            

 
ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు   చూస్తున్న తరుణంలో, ఈ విధమైన విధ్వంసకర రాజకీయాలు కేవలం దేశం విఫలమవ్వాలని కోరుకునే శక్తులకే మేలు చేస్తాయని బీజేపీ ఆరోపిస్తోంది. సాంకేతిక రంగంలో భారత్ అగ్రగామిగా ఎదగాలని కోట్లాది మంది ప్రజలు ఆకాంక్షిస్తుంటే, కేవలం రాజకీయ లబ్ధి కోసం దేశ ప్రతిష్టను దెబ్బతీయడం ఏమాత్రం సమర్థనీయం కాదని విమర్శకులు పేర్కొంటున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ, దేశ గౌరవాన్ని పణంగా పెట్టడం సరికాదని వారు హెచ్చరిస్తున్నారు.   

 
ఈ ఘటనను జాతీయ అవమానం గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దేశం మనందరిది.. రాజకీయం కంటే దేశ ప్రతిష్ట ముఖ్యం అంటూ  బీజేపీ మద్దతుదారులు కాంగ్రెస్ తీరును ఎండగడుతున్నారు. భారత్ సాధిస్తున్న విజయాలను చూసి గర్వపడాల్సింది పోయి, ప్రపంచ వేదికలపై ఇలాంటి వికృత చేష్టలతో అపహాస్యం చేయడం దురదృష్టకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

 
 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
AFG vs IND T20 Series: ఇండియాలో ఆఫ్ఘనిస్తాన్ హోస్ట్ చేసే టి20 సిరీస్.. ఢిల్లీ వేదికగా పోరు!
ఇండియాలో ఆఫ్ఘనిస్తాన్ హోస్ట్ చేసే టి20 సిరీస్.. ఢిల్లీ వేదికగా పోరు!
ABP Desam Top 10, 12 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 12 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget