Smartphone Charge With Urine: మీ యూరిన్‌తోనే మీ మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు,విడ్డూరమైన టెక్నాలజీ ఇది
Smartphone Charge With Urine: యూరిన్‌తో విద్యుత్ ఉత్పత్తి చేసి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చని బ్రిటన్ సైంటిస్ట్‌లు చెబుతున్నారు.
![Smartphone Charge With Urine: మీ యూరిన్‌తోనే మీ మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు,విడ్డూరమైన టెక్నాలజీ ఇది You can charge your smartphone with urine, this is the way Smartphone Charge With Urine: మీ యూరిన్‌తోనే మీ మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు,విడ్డూరమైన టెక్నాలజీ ఇది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/18/929b5975579220424fc84bed7f1358d71676716744323517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Smartphone Charge With Urine:
మూత్రంతో విద్యుత్ ఉత్పత్తి..
ఈ హైటెక్ యుగంలో రోజూ ఏదో ఓ ఆవిష్కరణ వెలుగులోకి వస్తూనే ఉంది. కొత్త ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. "ఇది చాలా కష్టం" అనుకున్న ప్రతి పనినీ సింపుల్‌గా చేసేయొచ్చని నిరూపిస్తున్నారు సైంటిస్ట్‌లు. అసాధ్యం అనుకున్న వాటినీ సుసాధ్యం చేసేస్తున్నారు.
కొన్ని సార్లు ఈ ఆవిష్కరణలు మనల్ని ఆలోచింపజేస్తే...మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇప్పుడు అలాంటి ఇన్వెన్షన్ గురించే చెప్పుకోబోతున్నాం. ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వాడని వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌తో "టచ్"లో ఉంటున్నారు. ఫోన్ అన్నాక ఛార్జింగ్ పెట్టుకోక తప్పదు. డిమాండ్ పెరుగుతున్న కొద్ది కంపెనీలు బ్యాటరీల కెపాసిటీని బాగా పెంచేస్తున్నాయి. కాస్ట్ పెట్టినా కూడా జనాలు కొనేస్తున్నారు. అయితే...ఛార్జింగ్ పెట్టాలంటే పవర్ కావాల్సిందే. ఇన్ని కోట్లాది ఫోన్లకు ఛార్జింగ్ పెట్టాలంటే ఎంత విద్యుత్ ఖర్చువుతుందో లెక్కే లేదు. అందుకే...ఈ కరెంట్‌ను ఆదా చేసుకుని, ఇంకో మార్గంలో ఛార్జింగ్ పెట్టే అవకాశమే లేదా అని ఆలోచించిన సైంటిస్ట్‌లకు ఓ వింత ఆలోచన వచ్చింది. అదే ఆవిష్కరణకూ దారి తీసింది. చాలా విడ్డూరంగా, మరింత ఇబ్బందికరంగా అనిపించే ఆ ఆవిష్కరణ ఏంటంటే...మలమూత్రాలతో విద్యుత్ ఉత్పత్తి చేయడం. వీటితో కరెంట్ ప్రొడ్యూస్ చేయడమే కాదు...మొబైల్, ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇదెలా సాధ్యమో వివరంగా చూద్దాం.
ఈ టెక్నాలజీతో...
బ్రిటన్‌లో ఇప్పటికే దీనిపై ఓ పెద్ద రీసెర్చ్ జరుగుతోంది. యూరిన్ నుంచి విద్యుత్ ఉత్పత్తికి ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా వరకూ ఫలితాలు బాగానే వస్తున్నాయట. పూర్తి స్థాయిలో ఇది సక్సెస్ అయితే...మన "వేస్ట్" నుంచే మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకుని ఎంచక్కా వాడేసుకోవచ్చు. మరి ఇదెలా సాధ్యమవుతోంది..? అని ప్రశ్నిస్తే సైంటిస్ట్‌లు ఆసక్తికర సమాధానమిచ్చారు. Microbial Fuel Cell(MFC)ని వినియోగించి మన యూరిన్ నుంచి కరెంట్‌ని ఉత్పత్తి చేయొచ్చని వివరించారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇదో ఎనర్జీ కన్వర్టర్. ఇందుకోసం యూరిన్‌లో బ్యాక్టీరియాను పంపుతారు. బ్రిస్టల్ రోబోటిక్స్ ల్యాబొరేటరీలో ఈ ప్రయోగం జరుగుతోంది. MFC అనేది ఓ బయోఎలక్ట్రో కెమికల్ డివైస్. క్యాటలిటిక్ యాక్టివిటీ ద్వారా బ్యాక్టీరియా నుంచి విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది పూర్తిగా సక్సెస్ అయితే...ఈ డివైసెస్‌ని ఏకంగా బాత్‌రూమ్‌లోనే పెట్టుకోవచ్చట. బాత్‌రూమ్‌లో ఉండే లైట్స్, షవర్స్, రేజర్‌లకు డైరెక్ట్‌గా పవర్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చట. వినడానికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తున్నా...రకరకాల ఆవిష్కరణల్లో ఇదీ ఒకటి. పైగా హ్యూమన్ వేస్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం మొదలైతే...ఇకపై మనకు కరెంట్ కోతల సమస్యలూ తీరిపోతాయి.
జపాన్‌లోనూ మరో ఆవిష్కరణ..
జపాన్ శాస్త్రవేత్తలు ఒక కొత్త పరికరాన్ని తయారు చేశారు. దీనివల్ల బ్రెయిన్ ట్యూమర్ ఎలాంటి లక్షణాలు చూపించకపోయినా కేవలం మూత్ర పరీక్ష ద్వారా ఉందో లేదో తేల్చేయవచ్చు. దీనివల్ల అపార నష్టాన్ని అడ్డుకోవచ్చు. ముందే మందులు వాడడం, చికిత్స మొదలుపెట్టడం వల్ల వ్యక్తి ప్రాణానికి గానీ, జీవితానికి గానీ ఎలాంటి హాని కలగకుండా రక్షించవచ్చు. బ్రెయిన్ ట్యూమర్లో నాలుగు దశలు ఉంటాయి. మొదటి దశలో ఉన్నప్పుడు తలనొప్పి, వాంతులు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదే రెండో దశకి చేరుకుంటే అవే లక్షణాలు తీవ్రంగా మారిపోతాయి. ఇక మూడో దశలో బ్రెయిన్ లో ఉన్నకణితి ఇతర ప్రధాన అవయవాలకు కూడా వ్యాపిస్తుంది. అంటే ఊపిరితిత్తులు వెన్నుపూస వంటి వాటికి సోకుతుంది. ఇక నాలుగో దశలో ట్యూమర్ లోని కణాలు రక్తంలో కలిసిపోయి, శరీరం అంతా వ్యాపిస్తాయి. మొదటి దశ మొదలవ్వకముందే బ్రెయిన్ ట్యూమర్ లక్షణాన్ని కనిపెట్టవచ్చని జపాన్ శాస్త్రవేత్తలు నిరూపించారు.
Also Read: Cheetahs in India: స్పెషల్ ఫ్లైట్‌లో భారత్‌కు మరో 12 చీతాలు, నేరుగా కునో నేషనల్ పార్క్‌కు తరలింపు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)