Cheetahs in India: స్పెషల్ ఫ్లైట్‌లో భారత్‌కు మరో 12 చీతాలు, నేరుగా కునో నేషనల్ పార్క్‌కు తరలింపు
Cheetahs in India: సౌతాఫ్రికా నుంచి మరో 12 చీతాలు భారత్‌కు చేరుకున్నాయి.
Cheetahs in India:
సౌతాఫ్రికా నుంచి మరో 12 చీతాలు భారత్‌కు చేరుకున్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానంలో వీటిని తీసుకొచ్చారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చేరుకున్నాయి. వీటిని నేరుగా కునో నేషనల్ పార్క్‌కు చేర్చుతారు. ఈ 12 చీతాల్లో 7 మేల్, కాగా మిగతా 5 ఫిమేల్. ఇప్పటికే నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌కు వచ్చాయి. రెండో విడతలో 12 చీతాలను దిగుమతి చేసుకున్నారు. "సౌతాఫ్రికా నుంచి ప్రత్యేక విమానంలో 12 చీతాలు తీసుకొచ్చాం. గ్వాలియర్ ఎయిర్‌పోర్ట్‌లో 10 గంటలకు చేరుకున్నాయి" అని అధికారులు వెల్లడించారు. కునో నేషనల్ పార్క్‌కు చేరుకున్నాక మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ వాటిని క్వారంటైన్లోకి వదలనున్నారు. చీతాల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఓ స్పెషల్ టీమ్‌ని ఏర్పాటు చేసింది కేంద్రం.
An IAF C-17 aircraft carrying the second batch of 12 Cheetahs landed at Air Force Station Gwalior earlier today, after a 10-hour flight from Johannesburg, South Africa.
— ANI (@ANI) February 18, 2023
These Cheetahs were later airlifted in IAF helicopters and have reached the Kuno National Park.
(Pics: IAF) pic.twitter.com/9ayglmaZ8O
For the first time in history, South Africa will be translocating 12 cheetahs to India as part of an initiative to expand the cheetah meta-population & to reintroduce the mammals in the country.#SACheetahstoIndia pic.twitter.com/HvKpEHUDBa
— Environmentza (@environmentza) February 17, 2023
Cheetah Reintroduction Programmeలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నమీబియా నుంచి ఇప్పటికే 8 చీతాలను తెప్పించింది. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. అక్కడి వాతావరణానికి అవి అలవాటు పడ్డాక ఒక్కొక్క చీతాను బయటకు వదులుతున్నారు. ప్రస్తుతం ఈ 8 చీతాలు ఆరోగ్యంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పుడు మరో 12 చీతాలను సౌతాఫ్రికా నుంచి వచ్చాయి. ఇప్పటికే దక్షిణాఫ్రికా,భారత్ మధ్య ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. సౌతాఫ్రికా, నమీబియా, బోత్స్వానాలో దాదాపు 7 వేల చీతాలున్నట్టు అంచనా. వీటిలో నమీబియాలోనే అత్యధికంగా చీతాలున్నాయి. భారత్‌లో పూర్తిగా ఇవి అంతరించిపోవడం వల్ల అక్కడి నుంచి ఇక్కడికి తెప్పిస్తోంది కేంద్రం. చివరి సారిగా భారత్‌లో 1948లో ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో సల్ అడవుల్లో కనిపించింది. అందుకే వీటి సంఖ్య పెంచాలని నిర్ణయించుకుంది ప్రభుత్వం.
"ఫిబ్రవరి 18న సౌతాఫ్రికా నుంచి 12 చీతాలను దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పటి నుంచి ఏటా 12 చీతాలను ఇక్కడికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పదేళ్ల పాటు ఇదే కొనసాగుతుంది. ఆ దేశంతో కుదిరిన ఒప్పందాన్ని ప్రతి ఐదేళ్లకోసారి రివ్యూ చేసుకుంటాం. అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తాం"
-భూపేందర్ యాదవ్, కేంద్ర పర్యావరణ మంత్రి