Delhi Excise Duty Scam: లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాకు మరోసారి CBI పిలుపు, విచారణకు సహకరిస్తానంటూ ట్వీట్
Delhi Excise Duty Scam: లిక్కర్ స్కామ్ కేసు విచారణలో భాగంగా సీబీఐ మనీశ్ సిసోడియాకు మరోసారి సమన్లు జారీ చేసింది.
Delhi Excise Duty Scam:
మరోసారి సమన్లు..
ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాకు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా మరోసారి హాజరు కావాలని వెల్లడించింది. ఇదే విషయాన్ని సిసోడియా ధ్రువీకరించారు. ట్విటర్ ద్వారా వివరాలు వెల్లడించారు.
"సీబీఐ నుంచి నాకు మరోసారి పిలుపు వచ్చింది. సీబీఐతో ఈడీలకు పూర్తి అధికారాలు ఇచ్చి నాపైకి వదులుతున్నారు. నా ఇంటిని సోదా చేశారు. బ్యాంక్ లాకర్‌నూ సెర్చ్ చేశారు. కానీ వాళ్లకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఢిల్లీలోని విద్యార్థులకు మంచి చదువు అందాలని ఎన్నో చర్యలు తీసుకున్నాను. అందుకే వాళ్లు నన్ను నియంత్రించాలని చూస్తున్నారు. నేను ఇప్పటి వరకూ విచారణకు సహకరించాను. ఇకపైన కూడా ఇదే విధంగా సహకరిస్తాను"
-మనీశ్ సిసోడియా, ఢిల్లీ డిప్యుటీ సీఎం
सीबीआई ने कल फिर बुलाया है. मेरे ख़िलाफ़ इन्होंने CBI, ED की पूरी ताक़त लगा रखी है, घर पर रेड, बैंक लॉकर तलाशी, कहीं मेरे ख़िलाफ़ कुछ नहीं मिला
— Manish Sisodia (@msisodia) February 18, 2023
मैंने दिल्ली के बच्चों के लिए अच्छी शिक्षा का इंतज़ाम किया है। ये उसे रोकना चाहते हैं।
मैंने जाँच में हमेशा सहयोग किया है और करूँगा.
కీలక వ్యక్తుల పేర్లు..
దిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక వ్యక్తుల పేర్లు ఈడీ ప్రస్తావించింది. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుని నిందితులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది. ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జిషీట్లో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురించి ప్రస్తావించింది. ఎమ్మెల్సీ కవిత అనుచరుడు వి.శ్రీనివాసరావును విచారించినట్లు ఛార్జిషీట్ లో ఈడీ తెలిపింది. కవిత ఆదేశాలతోనే అరుణ్పిళ్లైకి శ్రీనివాసరావు రూ.కోటి ఇచ్చారని ఈడీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పుడు మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బుతోనే ఆమ్ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల ప్రచారానికి ఖర్చు పెట్టిందని ఈడీ వెల్లడించింది. రెండో చార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ...ఈ విషయం స్పష్టం చేసింది. ఈడీ చెప్పిన వివరాల ప్రకారం...ఆప్ సర్వే టీమ్‌లకు దాదాపు రూ.70 లక్షలు చెల్లించింది ఆప్. ఈ పార్టీ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ ప్రచారంలో పాల్గొన్న వాళ్లకు డబ్బులు అందేలా చూశారని తెలిపింది ఈడీ. మరో సంచలనం ఏంటంటే...చార్జ్‌షీట్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా ఉంది. కేజ్రీవాల్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట పేర్లు కూడా ఉన్నాయి. మొత్తం 17 మంది నిందితులపై చార్జిషీట్ దాఖలు చేసింది ఈడీ.
Also Read: Shiv Sena Symbol: సుప్రీం కోర్టు తీర్పునివ్వకముందే నిర్ణయం తీసుకుంటారా? అంత తొందరెందుకు - ఈసీపై థాక్రే సేన ఫైర్