News
News
X

Jinping House Arrest: షాకింగ్! గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు- సైన్యం చేతిలోకి దేశం!

Jinping House Arrest: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నేతగా పేరుపొందిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఆ దేశ సైన్యం గృహ నిర్బంధంలో ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి.

FOLLOW US: 
 
Jinping House Arrest: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఎలాంటి శక్తిమంతమైన నేతగా పేరుపొందారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కనుసైగలతో డ్రాగన్‌ దేశాన్ని నడిపించిన కమ్యూనిస్ట్ నేతల్లో ఆయన అగ్రస్థానంలో ఉంటారు. అలాంటి జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచినట్లు సోషల్ మీడియా సహా ప్రధాన మీడియా ఛానళ్లలో వార్తలు రావడం సంచలనంగా మారింది. ఇందులో నిజమెంత?

ఇలా వార్తలు

జిన్‌పింగ్‌ను కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడిగా, చైనా ఆర్మీ చీఫ్‌గా తొలగించారనే వార్తలు వైరల్‌గా మారాయి. ఇప్పుడు దేశం మొత్తాన్ని చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) తన చేతుల్లోకి తీసుకున్నట్లు వార్తల్లో పేర్కొన్నారు. అంతేకాదు చైనా కొత్త అధ్యక్షుడిగా లీ కియామింగ్‌ను ఆర్మీ ఎంపిక చేసిందని వార్తలు రావడంతో వెంటనే ఈ న్యూస్ వైరల్‌ అయింది. 

అధికారిక ప్రకటన!

News Reels

వార్తల సంగతి పక్కనపెడితే కొందరు చైనీయులు కూడా ఇలాంటి పోస్టులే చేశారు. జిన్‌పింగ్‌ను ఆర్మీ.. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిందని, ఆయన స్థానంలో లీ కియామింగ్‌ను కొత్త అధ్యక్షుడిగా నియమించిందని పేర్కొన్నారు.

అయితే చైనా కమ్యూనిస్టు పార్టీ గానీ, ఆ దేశ అధికారిక మీడియా గానీ ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో ఇది నిజమేనా? లేక రూమారా? అనే విషయంపై అయోమయం నెలకొంది.

చైనా ఆర్మీ వాహనాలు సెప్టెంబర్ 22న బీజింగ్ చేరుకున్నాయని, హువాన్‌లై కౌంటీ నుంచి హిబే ప్రావిన్సు ఝాంగ్‍జియాకో సిటీ వరకు 80 కీలోమీటర్ల మేర ర్యాలీగా వెళ్లాయని ఓ చైనా మహిళ వీడియోను షేర్ చేసింది. 

ఇదే కారణమా?

చైనా కమ్యూనిస్టు పార్టీ ఇటీవల అవినీతి వ్యతిరేక కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ఇద్దరు మాజీ మంత్రులకు ఉరి శిక్ష విధించింది. మరో నలుగురు అధికారులకు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది. అయితే ఈ ఆరుగురు జిన్‌పింగ్ రాజకీయ ప్రత్యర్థి వర్గానికి చెందినవారే. దీంతో కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ నేతలు ఆయనపై ఆ‍గ్రహంతో పదవి నుంచి తప్పించారని ప్రచారం జరుగుతోంది.

భాజపా నేత ట్వీట్

ఈ విషయాన్ని భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా ట్వీట్ చేశారు.

" జిన్‌పింగ్‌ను చైనా కమ్యూనిస్టు పార్టీ ఆర్మీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. ఆ తర్వాత హౌస్ అరెస్టు చేశారు. ఈ రూమర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ సారి చెక్‌ చేయండి.                               "
-సుబ్రహ్మణ్య స్వామి, భాజపా నేత 

అయితే జిన్‌పింగ్ ఇటీవల ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సదస్సుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ కూడా పాల్గొన్నారు.

Also Read: Shinzo Abey Last Farewell Meet: షింజో అబె సంస్మరణ సభ.. 1.66 బిలియన్ యెన్ ల ఖర్చు!

Also Read: Fake Job Rackets In Thailand: ఇండియన్ స్టూడెంట్స్‌ ఆ ట్రాప్‌లో చిక్కొద్దు, అదో పెద్ద స్కామ్ - విదేశాంగ శాఖ ప్రకటన

Published at : 25 Sep 2022 10:36 AM (IST) Tags: Xi Jinping under house arrest coup in China Jinping House Arrest

సంబంధిత కథనాలు

Money Laundering : మనీలాండరింగ్‌ అంటే ఏంటి? హవాలా మనీకి మనీలాండరింగ్‌కు తేడా ఏంటి?

Money Laundering : మనీలాండరింగ్‌ అంటే ఏంటి? హవాలా మనీకి మనీలాండరింగ్‌కు తేడా ఏంటి?

Ponnam Prabhakar : ఏపీ, తెలంగాణ మళ్లీ కలవడం కల, రాజకీయ లబ్ధి కోసమే సజ్జల సమైక్యరాగం - పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ, తెలంగాణ మళ్లీ కలవడం కల, రాజకీయ లబ్ధి కోసమే సజ్జల సమైక్యరాగం - పొన్నం ప్రభాకర్

Election Results 2022 Live: గుజరాత్‌ను క్లీన్ స్వీప్ చేసిన BJP- హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ జోష్

Election Results 2022 Live: గుజరాత్‌ను క్లీన్ స్వీప్ చేసిన BJP- హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ జోష్

Gujarat Results 2022: ఆమ్‌ఆద్మీకి భారీ షాక్- 19 వేల ఓట్ల తేడాతో సీఎం అభ్యర్థి ఓటమి

Gujarat Results 2022: ఆమ్‌ఆద్మీకి భారీ షాక్- 19 వేల ఓట్ల తేడాతో సీఎం అభ్యర్థి ఓటమి

Miss India pageant: మిస్ ఇండియా పోటీలకు ఎంపికైన ట్రాన్స్‌జెండర్, గెలిస్తే రికార్డే

Miss India pageant: మిస్ ఇండియా పోటీలకు ఎంపికైన ట్రాన్స్‌జెండర్, గెలిస్తే రికార్డే

టాప్ స్టోరీస్

Why Vijaysaireddy Lost Post : అసభ్య ట్వీట్లే పదవిని దూరం చేశాయా ? విజయసాయిరెడ్డికి " ప్యానల్ వైస్ చైర్మన్" పోస్ట్ ఎలా దూరం అయింది ?

Why Vijaysaireddy Lost Post :  అసభ్య ట్వీట్లే పదవిని దూరం చేశాయా ? విజయసాయిరెడ్డికి

KTR Support : చదువుల సరస్వతికి మంత్రి కేటీఆర్ సాయం, వైద్య విద్యకు ఆర్థిక భరోసా!

KTR Support : చదువుల సరస్వతికి మంత్రి కేటీఆర్ సాయం, వైద్య విద్యకు ఆర్థిక భరోసా!

Sajjala On United State ; ఏపీ, తెలంగాణ కలపాలన్నదే వైఎస్ఆర్సీపీ విధానం - సజ్జల సంచలన ప్రకటన !

Sajjala On United State ;  ఏపీ,  తెలంగాణ కలపాలన్నదే వైఎస్ఆర్సీపీ విధానం - సజ్జల సంచలన ప్రకటన !

RGV on Ashu Reddy: వామ్మో వర్మ - అషురెడ్డిలో ఆ స్ట్రెంత్ చూసే సెలక్ట్ చేశారట, ఆర్జీవీ ఎక్కడా తగ్గట్లేదు!

RGV on Ashu Reddy: వామ్మో వర్మ - అషురెడ్డిలో ఆ స్ట్రెంత్ చూసే సెలక్ట్ చేశారట, ఆర్జీవీ ఎక్కడా తగ్గట్లేదు!