Fake Job Rackets In Thailand: ఇండియన్ స్టూడెంట్స్ ఆ ట్రాప్‌లో చిక్కొద్దు, అదో పెద్ద స్కామ్ - విదేశాంగ శాఖ ప్రకటన
Fake Job Rackets In Thailand: ధాయ్‌లాండ్‌లో ఫ్రాడ్ జాబ్ రాకెట్స్‌తో భారతీయ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచించింది.
Fake Job Rackets In Thailand:
జాబ్ ఫ్రాడ్
థాయ్‌లాండ్‌లో ఫేక్ జాబ్ రాకెట్స్‌పై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేసింది. భారతీయులనే లక్ష్యంగా చేసుకుని కొందరు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపింది. ఇందుకు సంబంధించి అడ్వైజరీ వెలువరించింది. డిజిటల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్‌గా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొన్ని ఐటీ సంస్థలు వల వేస్తుంటాయని, వాటితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గతంలో కాల్ స్కామ్స్, క్రిప్టో కరెన్స్ ఫ్రాడ్స్ చేసిన IT సంస్థలే ఇప్పుడీ జాబ్ ఫ్రాడ్‌కు పాల్పడుతున్నాయని వెల్లడించింది. బ్యాంకాక్, మియన్మార్‌లో ప్రత్యేక నిఘా ఉంచిన తరవాతే ఇది నిర్ధరణ అయిందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. "ఐటీ స్కిల్స్ ఉన్న వారినే టార్గెట్ చేసుకుంటున్నారు. డేటా ఎంట్రీ జాబ్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దుబాయ్,
ఇండియాలోని ఏజెంట్‌లు ఇలా మభ్యపెడుతున్నారు" అని విదేశాంగ శాఖ ప్రతినిధి అరింద్ బాగ్చీ వెల్లడించారు. దీనికి సంబంధించిన అడ్వైజరీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఉద్యోగం పేరు చెప్పి అక్రమంగా బార్డర్ దాటించేస్తున్నారని, అక్కడ దారుణమైన పరిస్థితుల్లో పని చేయించుకుంటున్నారని స్పష్టం చేసింది భారత్. ఏదైనా జాబ్ ఆఫర్‌ను యాక్సెప్ట్ చేసే ముందు ఆ కంపెనీ వివరాలు కచ్చితంగా తెలుసుకోవాలని సూచిస్తోంది.
Advisory regarding fake job rackets targeting IT skilled youthhttps://t.co/Pty9wblp45 pic.twitter.com/bnuhth3NbI
— Arindam Bagchi (@MEAIndia) September 24, 2022
చెక్ చేసుకోవాలి..
"భారతీయ విద్యార్థులు ఇలాంటి ట్రాప్‌లో చిక్కుకోకూడదు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ యాడ్‌లకు స్పందించకూడదు. ఉపాధి కోసం ట్రావెలింగ్ లేదా విసిటింగ్ వీసా తీసుకునే ముందు ఆ ఉద్యోగాలు ఎవరు ఇస్తున్నాన్నది ఓసారి చెక్ చేసుకోవాలి. రిక్రూటింగ్ ఏజెంట్‌లు నిజమా కాదా అన్నదీ నిర్ధరించుకోవాలి" అని సూచిస్తోంది భారత విదేశాంగ శాఖ. అటు కెనడాలోని భారతీయులనూ అప్రమత్తం చేసింది భారత్. కెనడాలో భారతీయులపై వివక్ష, దాడులు పెరుగుతున్న క్రమంలో భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కెనడాలోని ఇండియన్స్ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. యాంటీ ఇండియా ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో పరిస్థితులను సునిశితంగా గమనించాలని సలహా ఇచ్చింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయం వెల్లడించింది. Pro-Khalistan ఉద్యమం కెనడాలో జోరందుకుంటోంది. సిక్కులకు ప్రత్యేక ప్రాంతం కావాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఆ దేశంలో ఈ ఉద్యమానికి సంబంధించిన అలజడి ఎక్కువగా కనిపిస్తోంది. ఎప్పటి నుంచో ఇది నడుస్తూనే ఉన్నా..ఈ మధ్య కాలంలో ఉద్ధృతమైంది. భారత్-కెనడా మధ్య ఎప్పుడు చర్చలు జరిగినా...ఈ సమస్య గురించి ప్రస్తావన వచ్చేది. "భారతీయులపై విద్వేషం పెరుగుతోంది. హింసాత్మక ఘటనలూ పెరుగుతున్నాయి" అని కెనడాలోని భారతీయులు, భారతీయ విద్యార్థులు వెల్లడించారు. "భారతీయులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం" అని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
Also Read: Sita Ramam Deleted Scene: 'సీతారామం' సినిమా డిలీటెడ్ సీన్ చూశారా