Xi Jinping: రికార్డు సృష్టించిన జిన్‌పింగ్, ముచ్చటగా మూడోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు
Xi Jinping: చైనాకు మూడోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్ ఎన్నికయ్యారు.
Xi Jinping:
రాజ్యాంగ సవరణలు..
చైనాకు మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు జిన్‌పింగ్. మరో ఐదేళ్ల పాటు ఆయనకే అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ చైనా పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయన ఎన్నికకు ఆమోద ముద్ర వేసింది. ఈ ఎన్నికతో చైనాకు ఇకపై జీవిత కాల అధ్యక్షుడిగా కొనసాగనున్నారు జిన్‌పింగ్. గతేడాది అక్టోబర్‌లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాలు జరిగాయి. అప్పుడే పార్టీ రాజ్యాంగంలో సవరణలు కూడా చేశారు. ఇదంతా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను మూడోసారీ అదే పదవిలో కొనసాగేలా చేసేందుకే. నిజానికి...ఆ వారం రోజుల కాంగ్రెస్ ఉద్దేశం కూడా అదే. జిన్‌పింగ్‌కు మరి కొన్ని అధికారాలు కట్టబెట్టి ఆయననే మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగించేలా తీర్మానం చేస్తారని ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే సెంట్రల్ కమిటీలోని 370 మంది సీనియర్ లీడర్స్ కొన్ని కీలక తీర్మానాలు ప్రవేశపెట్టడంతో పాటు పార్టీ రాజ్యాంగంలోనూ సవరణలు చేశారు. జిన్‌పింగ్‌కి సర్వాధికారాలు కట్టబెట్టే సవరణలు ఇవి. కమ్యూనిస్ట్ పార్టీకి గవర్నింగ్ బాడీగా ఉండే సెంట్రల్ కమిటీ...దేశవ్యాప్తంగా ఎలాంటి విధానాలు అమలు చేయాలో స్పష్టంగా వివరిస్తుంది. అంతే కాదు. వచ్చే ఐదేళ్లలో ఎలాంటి మార్పులు చేయాలన్నదీ సూచిస్తుంది.
Xi Jinping elected Chinese President for 3rd term
— ANI Digital (@ani_digital) March 10, 2023
Read @ANI Story | https://t.co/DBLivQAHPi#XiJinping #ChinesePresident #NPC #China pic.twitter.com/lUprvb977p
జెడాంగ్ తరవాత...
ఈ క్రమంలోనే జిన్‌పింగ్‌ను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ అధికారికంగా ప్రకటన చేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఎలాంటి శక్తిమంతమైన నేతగా పేరుపొందారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కనుసైగలతో డ్రాగన్ దేశాన్ని నడిపించిన కమ్యూనిస్ట్ నేతల్లో ఆయన అగ్రస్థానంలో ఉంటారు. ఇప్పుడు మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి..పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నేతగా జిన్‌పింగ్ అరుదైన ఘనత సాధించనున్నారు. దేశాధ్యక్షునికి రెండు పర్యాయాల పదవీకాలం పరిమితి వర్తించదని 2018లో చేసిన రాజ్యాంగ సవరణతో జిన్‌పింగ్ జీవితకాలం చైనా అధ్యక్షునిగా కొనసాగేందుకు మార్గం సుగమం అయింది.
ఎకానమీ డల్..
ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ స్తబ్దుగానే ఉంది. ఎకానమీ చాలా మెల్లగా ముందుకెళ్తోంది. లక్షలాది మంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. కొవిడ్ పుట్టినిల్లైన చైనాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మూడేళ్లలో 4.1 కోట్ల మంది రిటైర్ అయ్యారు. ఇందుకు ప్రధాన కారణం కరోనా. మరో కారణమూ ఉంది. వయసైపోయిన వాళ్లు ఎక్కువ మంది ఉండడం. Bloomberg ప్రకారం.. 2022లో చైనాలో 73 కోట్ల మందిని రిక్రూట్ చేసుకున్నారు. 2019లో ఈ సంఖ్య 77 కోట్లకు పైగానే ఉంది. ఈ లెక్కలు చూస్తుంటేనే అర్థమవుతోంది. ఏటా రిక్రూట్‌మెంట్ తగ్గుతోందని. కోట్లాది మంది రిటైర్ అవుతున్నారు. వాళ్లను రీప్లేస్ చేయడం కష్టమవుతోంది. రిటైర్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలూ ఇందుకు కారణమన్న వాదన వినిపిస్తోంది. రిటైర్‌మెంట్ ఏజ్‌ను పెంచితే కానీ ఈ సమస్యకు పరిష్కారం దొరకదని చెబుతున్నారు కొందరు నిపుణులు. కరోనా సంక్షోభం తరవాత ఎకానమీ డల్ అవ్వడం, యువతకు పెద్దగా ఉద్యోగాలు దొరక్కపోవడం వల్ల ఉన్న వాళ్లు రిటైర్ అవుతున్నారే తప్ప కొత్త వాళ్లు పనుల్లో చేరడం లేదు. పని చేసే వాళ్ల సంఖ్య తగ్గడం వల్ల మొత్తంగా ప్రొడక్టివిటీ తగ్గిపోతోంది. ఆర్థిక వ్యవస్థనూ దెబ్బ తీస్తోంది.
Also Read: Germany Church Shooting: చర్చ్‌లో కాల్పులు, ఏడుగురు మృతి - పలువురికి తీవ్ర గాయాలు