అన్వేషించండి

Wrestlers Protest: అలాంటి వాళ్లను జైల్లో పెట్టాలి, పట్టించుకోకపోవడం సిగ్గుచేటు - రెజ్లర్లకు రామ్‌దేవ్ బాబా మద్ద

Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళనకు యోగా గురు రామ్ దేవ్ బాబా మద్దతు ప్రకటించారు.

Wrestlers Protest: 

జంతర్ మంతర్ వద్ద ఆందోళన..

ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్ల ఆందోళన కొనసాగుతోంది. బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న రెజ్లర్లు..న్యాయం జరిగే వరకూ అక్కడి నుంచి కదలమని స్పష్టం చేశారు. అయితే...కేంద్రం మాత్రం దీనిపై పెద్దగా స్పందించడం లేదు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ "కమిటీ వేస్తాం" అని చెప్పినా ఆ నిర్ణయంతో న్యాయం జరగదు అని బాధితులు తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే వీరి నిరసనలకు పలు సంఘాలు మద్దతునిచ్చాయి. ఇప్పుడు యోగ గురు రామ్ దేవ్ బాబా కూడా వీళ్లకు సపోర్ట్ ఇస్తున్నట్టు ప్రకటించారు. బ్రిజ్ భూషణ్‌పై అంత తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

"రెజ్లింగ్ అసోసియేషన్‌ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఆయనను శిక్షించాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వెంటనే ఆయనని అరెస్ట్ చేయాలి. మన దేశ రెజ్లర్లు ఇలా రోడ్డు మీద కూర్చుని ఇన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నా ఖాతరు చేయకపోవడం సిగ్గుచేటు. ఇలా లైంగికంగా వేధించే వారిని జైల్లో పెట్టాల్సిందే. బ్రిజ్ భూషణ్ రోజుకో మాట మాట్లాడుతున్నారు. అనవసరంగా రెజ్లర్లపై నోరు పారేసుకుంటున్నారు. ఇది కచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిన నేరమే"

-  బాబా రామ్‌దేవ్ 

అటు బ్రిజ్ భూషణ్ మాత్రం తనపై వస్తున్న ఆరోపణల్ని కొట్టి పారేస్తున్నారు. తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేయాలని ఉద్దేశపూర్వకంగా ఈ నిరసనలు చేస్తున్నారని విమర్శించారు. ఈ ఉద్యమం ఢిల్లీ నుంచి పంజాబ్‌, ఆపైన ఖలిస్థాన్, కెనడా వరకూ విస్తరిస్తోందని, ఇదంతా పెద్ద కుట్ర అని మండి పడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కావాలనే నినాదాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తరచూ ట్విటర్‌లో రెజ్లర్లపై విమర్శలు చేస్తున్న ఆయన..ఇటీవల ఓ పోస్ట్ చేశారు. తాను నిర్దోషిని అని నిరూపించుకోడానికి లై డిటెక్ట్ (Polygraph Test) టెస్ట్‌కి సిద్ధంగా ఉన్నానని అన్నారు. రెజ్లర్లు చేసే ఆరోపణలు నిజమా కాదా తేలాలంటే వాళ్లు కూడా ఈ టెస్ట్‌కి అంగీకరించాలని సవాలు విసిరారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రెజ్లర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన అమ్మాయిలంతా నార్కో టెస్ట్‌కి (Narco Test) సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. బ్రిజ్ భూషణ్‌పై మొత్తం ఏడుగురు మహిళా రెజ్లర్లు ఫిర్యాదు చేశారు. అంతే కాదు. ఈ టెస్ట్‌ని లైవ్ టెలికాస్ట్ చేసి ప్రజలందరికీ చూపించాలనీ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఈ ప్రక్రియని మానిటర్ చేయాలని కోరారు. ఇప్పటికే బజ్‌రంగ్ పునియా బ్రిజ్ భూషణ్‌పై మండి పడ్డారు. పోలీసులు తమను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. 

"బ్రిజ్ భూషణ్ నార్కో టెస్ట్‌కి సిద్ధమా అని సవాలు విసిరారు. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కానీ...అదంతా సుప్రీంకోర్టు నేతృత్వంలోనే జరగాలి. దేశమంతా దాన్ని లైవ్‌లో చూడాలి"

- రెజ్లర్లు 

Also Read: Cyber Fraud: వన్ ప్లస్ వన్ ఆఫర్‌ చూసి టెంప్ట్ అయిన మహిళ, లింక్ క్లిక్ చేయగానే రూ.90 వేలు హాంఫట్

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
CJP Protest: రెండు డిమాండ్లకు ప్రభుత్వం సిద్ధం! ధర్మేంద్ర రాజీనామా వీడని చిక్కుముడి! రెండో విడత సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకోండి!
రెండు డిమాండ్లకు ప్రభుత్వం సిద్ధం! ధర్మేంద్ర రాజీనామా వీడని చిక్కుముడి! రెండో విడత సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకోండి!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget