Pakistan Tea : అప్పులెక్కువయ్యాయి టీ తాగడం తగ్గించుకోండి ప్లీజ్ - ప్రజలను కోరిన పాకిస్థాన్ ! ఎగతాళి చేస్తున్న నెటిజన్లు
పాకిస్థాన్ ప్రజలు టీ తాగే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలంటున్నారు అక్కడి పాలకులు. ఎందుకంటే అప్పులు ఎక్కువయ్యాయట. అసలు అప్పులకు..టీకి లింకేంటి ?
Pakistan Tea : శ్రీలంక తరహాలో పాకిస్తాన్ కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఆ దేశానికి అన్నీ అప్పులే కానీ ఆదాయం లేకుండా పోయింది. పైగా ఆ దేశంలో ఆహార పదార్థాలు ఎక్కువగా దిగుమతలు మీద ఆధారపడుతూ ఉంటారు. చివరికి అక్కడి ప్రజలు తాగే టీ కూడా దిగుమతి చేసుకోవాలి. సహజంగానే పాకిస్తాన్ ప్రజలు టీ ఎక్కువగా తాగుతూ ఉంటారు. అందుకే దిగుమతులు కూడా ఎక్కువే. అందుకే ఆ దేశ మంత్రి ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. ప్రజలు టీ తాగే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలన్నారు.
Pakistan minister Ahsan Iqbal asks nation to cut down "tea" consumption to save forex reserves. pic.twitter.com/1ZwmBhEKag
— Asad Kharal (@AsadKharal) June 14, 2022
అతి తక్కువ టీ తాగాలని మంత్రి అహసాన్ ఇక్బాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. టీ కోసం దిగుమతి చేసుకుంటున్నామని అలా దిగుమతి చేసుకోవడానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బు లేదని అప్పు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే టీ తాగే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలన్నారు.
ఆయన ప్రకటనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. ముఖ్యంగా భారతీయ నెటిజన్లు గతంలో అభినందన్ విషయంలో పాకిస్తాన్ చేసిన ట్రోలింగ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో అభినందన్ పాకిస్థాన్ టీ చాలా బాగుందని చెప్పారని పాకిస్థానీ నెటిజన్లు ట్రోల్ చేశారు. ఇప్పుడు దాన్నే గుర్తు చేసి మంత్రి ప్రకటనను ట్వీట్ చేస్తున్నారు.
Pakistan’s Federal Minister Ahsan Iqbal is seen appealing to Pakistanis to consume less tea because even the tea they drink is imported after taking loans.
— Major Gaurav Arya (Retd) (@majorgauravarya) June 14, 2022
When Pakistanis trolled Indians in Abhinandan’s case saying Tea Is Fantastic, they were not wrong.
It really is ☕️ pic.twitter.com/xXlvpumr5L
ప్రపంచంలో తేయాకును మరే దేశంకన్నా అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం పాకిస్తాన్. గత ఏడాది సుమారు 5,000 కోట్ల రూపాయలు కన్నా ఎక్కువ విలువైన టీని పాక్ దిగుమతి చేసుకుంది. పాకిస్తాన్ విదేశీ మారక ద్రవ్యం నిల్వలలు ఫిబ్రవరిలో 1,600 కోట్ల డాలర్లుగా ఉంటే.. జూన్ మొదటి వారానికి 1,000 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఈ మొత్తం.. ఆ దేశం చేసుకునే దిగుమతులన్నటికీ రెండు నెలల చెల్లింపులకు మాత్రమే సరిపోతంది.