కెనడా పార్లమెంట్‌లో ట్రూడో పిల్ల చేష్టలు, స్పీకర్‌ని చూస్తూ కన్ను కొట్టిన వీడియో వైరల్
Watch Video: పార్లమెంట్‌లో కెనడా ప్రధాని ట్రూడో స్పీకర్‌ని చూస్తూ కన్నుకొట్టిన వీడియో వైరల్ అవుతోంది.
Watch Video:
స్పీకర్‌ని చూస్తూ కన్ను కొట్టిన ట్రూడో..
భారత్‌పై ఆరోపణలు చేసినప్పటి నుంచి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) పేరు మీడియాలో, సోషల్ మీడియాలో మారు మోగుతోంది. ఇప్పుడు మరోసారి ఆయన పేరు వైరల్ అవుతోంది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో స్పీకర్‌తో వింతగా ప్రవర్తించారు ట్రూడో. ఇంటర్నెట్‌లో ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. స్పీకర్ వైపు చూస్తూ..కన్ను కొట్టారు. ఆ తరవాత నాలుక బయట పెట్టి వెక్కిరించాడు. స్పీకర్ గ్రెగ్ ఫెర్గస్ (Greg Fergus) సభలో ప్రధాని ట్రూడోని పరిచయం చేస్తూ "honourable Prime Minister' అన్నారు. దీనికి వెంటనే ట్రూడో స్పందిస్తూ "Very Honourable" అని కరెక్ట్ చేశారు. అప్పుడే ఆయనకు కన్ను కొట్టారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. అప్పటి నుంచి ట్రూడో తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత కన్నా పిచ్చి పని ఇంకేమీ ఉండదని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు "సభలో ఏంటీ పిల్ల చేష్టలు" అని మండి పడ్డారు. "ఎవరైనా సరే..కెమెరా ముందు అలా వెకిలి వేషాలు వేయడం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. ప్రైవేట్‌గా చేసే పనులను ఇలా అందరి ముందు చేయడం ప్రధాని స్థాయి వ్యక్తికి తగదు" అని ఇంకొందరు ఘాటుగా స్పందిస్తున్నారు. గ్రెగ్ ఫెర్గస్ ఈ మధ్యే స్పీకర్‌గా ఎన్నికయ్యారు. కెనడా పార్లమెంట్ స్పీకర్‌గా ఎంపికైన తొలి నల్లజాతి వ్యక్తి ఆయనే.
Why is Trudeau like this? 🤢 pic.twitter.com/aOeM9x68Qq
— Canada Proud (@WeAreCanProud) October 4, 2023