అన్వేషించండి

ఏవియేషన్ చరిత్రలోనే అరుదైన రికార్డు, సస్టైనబుల్ ఏవియేషన్‌ ఫ్యుయెల్‌తో దూసుకెళ్లిన తొలి విమానం

Virgin Atlantic Flight: వర్జిన్ అట్లాంటిక్‌ ఫ్లైట్‌ తొలిసారిగా సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యుయెల్‌తో విమానాన్ని నడిపింది.

Virgin Atlantic Flight Fuel:

SAFతో గాల్లోకి తొలి విమానం..

ఏవియేషన్ హిస్టరీలోనే ఓ అరుదైన రికార్డు నమోదైంది. తొలిసారి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్‌ని (ATF) కాకుండా 100% sustainable aviation fuel (SAF) తో ఓ విమానాన్ని నడిపారు. Virgin Atlantic కి చెందిన ఫ్లైట్‌ లండన్ నుంచి న్యూయార్క్ వరకూ ఇది ప్రయాణించింది. గతంలోనూ ఈ ఫ్యుయెల్‌తో ఓ కార్గోని నడిపారు. ఈ సారి ప్రయాణికులతో కూడిన విమానాన్ని ఇదే ఇంధనంతో నడిపారు. వర్జిన్ బోయింగ్ 787 (Virgin Boeing 787) లండన్‌ నుంచి బయల్దేరి న్యూయార్క్‌లోని జాన్‌.ఎఫ్‌.కెనడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది. ATF తో వాతావరణంలోకి కర్బన ఉద్గారాలు భారీ స్థాయిలో విడుదలవుతున్నాయి. ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధనం కోసం ఎన్నో రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి సపోర్ట్ కూడా లభిస్తోంది. ఈ ఫ్లైట్‌లో వర్జిన్ అట్లాంటిక్ ఫౌండర్ రిచర్డ్ బ్రాన్సన్‌తో పాటు మరి కొందరు సిబ్బంది ప్రయాణించారు. సాధారణ ప్రయాణికులు మాత్రం ట్రావెల్ చేయలేదు. కన్వెన్షన్ జెట్ ఫ్యుయెల్‌తో నడిచిన తొలి ప్యాసింజర్ ఫ్లైట్‌గా రికార్డు సృష్టించింది. అంతర్జాతీయంగా  పలు ఎయిర్‌లైన్స్ సంస్థలు దాదాపు 70% కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. 

వాడకం తక్కువే..

అయితే...Sustainable Aviation Fuel ని ప్రొడ్యూస్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతే కాదు. భారీ మొత్తంలో ఈ ఫ్యుయెల్ దొరకడమూ కష్టమే. ప్రస్తుతానికి అంతర్జాతీయంగా చూస్తే...సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యుయెల్ వాడకం కేవలం 0.1% మాత్రమే ఉంది. రెగ్యులర్ జెట్ ఫ్యుయెల్‌ ధరతో పోల్చితే ఇది 3-5 రెట్లు ఎక్కువ. నిజానికి ఏవియేషన్ ఇండస్ట్రీలో కర్బన ఉద్గారాలు తగ్గించడం అనేది సవాలే అంటున్నారు నిపుణులు. ప్రస్తుతానికి విమానాల్లో వాడుతున్న ఇంజిన్‌లు 50% కన్నా ఎక్కువ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యుయెల్‌తో నడిచే విధంగా లేవు. జెట్ ఇంజిన్స్‌లో ఇప్పటికే ఈ ఫ్యుయెల్‌ని వినియోగిస్తున్నారు. వంటనూనెలు, జంతువుల కొవ్వు వ్యర్థాలను సింథటిక్ కిరోసిన్‌తో కలిపి ఈ ఇంధనం తయారు చేస్తారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget