Indians in the US: గర్భంతో ఉన్న మహిళలకు అమెరికాలోకి నో ఎంట్రీ - ట్రంప్ మరో విచిత్రమైన నిర్ణయం
Trump: బర్త్ టూరిజం కోసం అమెరికాలో పిల్లల్ని కనాలని టూరిస్ట్ వీసా మీద వెళ్లేవారికి ట్రంప్ బ్రేకులు వేస్తున్నారు. అలాంటి ఉద్దేశంతో వచ్చే వారిక ివీసాలు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు.

US to ban pregnant Indian women: అమెరికాకు వచ్చే భారతీయ మహిళలు గర్భిణులుగా ఉంటే వెనక్కి పంపాలనే ఆలోచన ట్రంప్ ప్రభుత్వం చేస్తోంది. యూఎస్ ఎంబసీ ఇండియా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఓ ప్రకటన చేసింది. యూఎస్ కాన్సులర్ అధికారులు టూరిస్ట్ వీసా (B-1/B-2) దరఖాస్తులను తిరస్కరించే కారణాలను వెల్లడించింది. టూరిస్ట్ వీసా మీద వచ్చే వారు గర్భిణులు అయితే.. ప్రయాణం ప్రధాన ఉద్దేశ్యం యూఎస్‌లో పిల్లలు పుట్టించి, వారికి యూఎస్ పౌరత్వం పొందడమే అని నమ్మితే .. పూర్తిగా తిరస్కరిస్తారు.
అయితే ఇది కొత్తగా అమల్లోకి తెచ్చింది కాదు. ఇది ట్రంప్ మొదటి అధ్యక్ష పదవి కాలంలో (2020లో) అమలైన పాలసీనే . మళ్లీ అమల్లోకి తెస్తున్నారు. అయితే గర్భిణులు అయినంత మాత్రాన వీసా నిరాకరణ ఉండదని.. ప్రధాన ఉద్దేశ్యం బర్త్ టూరిజమ్ అని అనుమానం వస్తేనే తిరస్కరిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. గర్భం ఉన్నంత మాత్రాన బ్లాంకెట్ నిషేధం కాదు. యువ జంటలు, నూతన వివాహితులకూ ఇది వర్తించదని అంటున్నారు.
బర్త్ టూరిజం ఆసియా దేశాల్లో కొంతమంది ధనవంతులు చేస్తున్నారు. యూఎస్‌లో పుట్టిన పిల్లలకు ఆటోమాటిక్‌గా పౌరత్వం లభిస్తుంది . అందుకే అమెరికాలో పిల్లల్ని కనేందుకు కొంత మంది టూరిస్ట్ వీసా మీద అమెరికాకు వెళ్తున్నారు. అక్కడి ఆస్పత్రుల్లో పిల్లలను కని.. అమెరికా పౌరసత్వాన్ని ఎంచుకుంటున్నారు. ఇలా ఇండియా నుంచి టూరిస్ట్ వీసా దరఖాస్తులు భారీగా ఉండటంతో, ఎంబసీ ఇక్కడే హెచ్చరిక జారీ చేసింది. అయితే ఇది ఇండియన్లను మాత్రమే టార్గెట్ చేసినది కాదు. అన్ని దేశాలకూ వర్తిస్తుంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మిగ్రేషన్ పాలసీలు కఠినతరం చేస్తున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక వచ్చింది.
U.S. consular officers will deny tourist visa applications if they believe the primary purpose of travel is to give birth in the United States to obtain U.S. citizenship for the child. This is not permitted. pic.twitter.com/Xyq4lkK6V8
— U.S. Embassy India (@USAndIndia) December 11, 2025
జనవరి 2025లో ట్రంప్ బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌ను ముగించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కు సంతకం చేశారు. అయితే, ఇది కోర్టుల్లో ఛాలెంజ్ అవుతోంది. పలు ఫెడరల్ జడ్జిలు బ్లాక్ చేశారు. బర్త్ టూరిజం కోసం వచ్చే గర్భిణులపై ఇప్పటికే నిబంధనలు ఉన్నాయి. లక్షలాది మంది భారతీయులు యూఎస్‌లో ఉంటున్నారు (H-1B, L-1 వీసాలపై). వారి పిల్లలకు బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ ఇబ్బంది కలిగిస్తుందనే ఆందోళనలు ఉన్నాయి. అయితే, గర్భిణులు వైద్య చికిత్స, ఫ్యామిలీ విజిట్ కోసం వెళ్తే సమస్య లేదు. అందకే వీసా ఇంటర్వ్యూల్లో మరింత కఠిన పరిశీలన ఉంటుంది.
ఈ హెచ్చరిక బర్త్ టూరిజంపై కఠిన చర్యల భాగమే తప్ప, గర్భిణీ మహిళలపై పూర్తి నిషేధం కాదు. అయితే, వీసా దరఖాస్తుదారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.





















