అన్వేషించండి

US-Iran War: డెడ్‌లైన్‌కు ముందే ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు! దద్దరిల్లిన ఖర్గ్ ద్వీపం!

US-Iran War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగియక ముందే అమెరికా దాడులు మొదలు పెట్టింది. ఇరాన్‌లోని వ్యూహాత్మక ఖర్గ్‌ ద్వీపంపై యూఎస్‌ క్షిపణులు విరుచుకుపడ్డాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన ఖర్గ్ ద్వీపంపై అమెరికా దాడులు.
  • గడువు ముగియక ముందే 50కిపైగా లక్ష్యాలను అమెరికా ధ్వంసం చేసింది.
  • ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌లోని అనేక మౌలిక సదుపాయాలపై దాడులు చేసింది.
  • ఇరాన్‌లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచన.

US-Iran War: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇరాన్‌కు విధించిన గడువు ముగియడానికి ముందే ఇరాన్‌ చమురు ఎగుతులకు గుండెకాయ వంటి ఖర్గ్ ద్వీపంపై అమెరికా సైన్యం భారీ దాడులకు దిగింది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఈ దాడులలో ఖర్గ్‌ ద్వీపంలోని 50కిపైగా లక్ష్యాను అమెరికా ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ ప్రభుత్వానికి కఠినమైన గడువును విధించారు. వాషింగ్టన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని, అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని తిరిగి తెరవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ గడువు ముగియడానికి కేవలం కొన్ని గంటల సమయం ఉండగానే అమెరికా తన వైమానిక ఫోర్స్‌ను ఉపయోగించింది. ఈ ఆదేశాలను పాటించని పక్షంలో ఇరాన్‌లోని ప్రతి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, వంతెనలను లక్ష్యంగా చేసుకొన భారీ బాంబు దాడులు చేస్తామని ట్రంప్ గతంలోనే హెచ్చరించారు. 

ఖర్గ్‌ ద్వీపం ప్రాముఖ్యత

ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో ఖర్గ్ ద్వీపం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఇరాన్ దేశం చేసే మొత్తం చమురు ఎగుమతుల్లో సుమారు 90 శాతం ఈ ద్వీపం నుంచే జరుగుతాయి. ఇరాన్ ప్రధాన భూభాగంలోని తీర ప్రాంతాలు పెద్ద చమురు ట్యాంకర్ల రాకపోకలకు అనువైన లోతును కలిగి ఉండవు. అందుకే ఖర్గ్‌ ద్వీపం ఆ దేశానికి ఇంధన వాణిజ్యంలో అనివార్యమైన కేంద్రంగా మారింది. కువైట్, సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాలకు ఎదురుగా ఉన్న ఈ ద్వీపం, భౌగోళికంగా కూడా యుద్ధ సమయంలో సులభంగా లక్ష్యం చేసుకోగలిగే స్థితి ఉంది. 

దాడుల తీవ్రత 

అమెరికా సైన్యం ఖర్గ్‌ ద్వీపంలోని సైనిక లక్ష్యాలపై దాడులు నిర్వహించినట్టు సీనియర్ అమెరికా అధికారి ఒకరు ధృవీకరించారు. వాల్‌స్ట్రీట్ జర్న్‌ కథనం ప్రకారం 50కిపైగా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయి. అయితే అెమరికా వైస్ ప్రెసిడెంట్‌ జేడీ వాన్స్‌ ఈ దాడులపై స్పందిస్తూ ఇది అమెరికా వ్యూహంలో మార్పు ఏం కాదని, కేవలం సైనిక లక్ష్యాలను  మాత్రమే దెబ్బ తీశామని స్పష్టం ేశారు. ఈ దాడుల వల్ల చమురు మౌలిక సదుపాయాలకు ఎలాంటి నష్టం కలగలేదని రాయిటర్స్ సంస్థ పేర్కొంది. 

ఇదే సమయంలో ఇజ్రాయెల్ సైన్యం కూడా రంగంలోకి దిగింది. ఇరాన్ అంతటా ఉన్న డజన్లు కొద్దీ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని తాము భారీ స్థాయిలో దాడుల పూర్తిగా చేసినట్టు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇరాన్ ఉగ్రవాద పాలనకు వ్యతిరేకంగా ఈ చర్యలు చేపట్టినట్టు ఇజ్రాయెల్ రక్షణ దళం పేర్కొన్నప్పటికీ, ఆ లక్ష్యాల వివరాలు పూర్తిగా వెల్లడించలేదు. 

గతంలోనే ట్రంప్ హెచ్చరిక 

డొనాల్డ్ ట్రంప్ గత కొంత కాలంగా ఖర్గ్‌ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం లేదా ధ్వంసం చేయడం గురించి సోషల్ మీడియాలో పదే పదే హెచ్చరించారు. మార్చి 30న ఆయన ఒక పోస్ట్‌లో పేర్కొంటూ, ఇరాన్ దారికి రాకపోతే వారి విద్యుత్ కేంద్రాలు, చమురు బావులతో పాటు ఖర్గ్‌ ద్వీపాన్ని పూర్తిగా నాశనం చేస్తామని హెచ్చరించారు. 

ప్రస్తుతం హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై పటిష్టమైన సైనిక ఒత్తిడిని పెంచుతుండటంతో రాబోయే గంటలు ప్రపంచ శాంతికి అత్యంత కీలకంగా మారాయి. 

భారత్‌ కూడా ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరులు రాబోయే 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ , సైనిక ప్రాంతాలకు దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సలహా ఇచ్చింది. 

Frequently Asked Questions

ఖర్గ్ ద్వీపంపై అమెరికా ఎందుకు దాడి చేసింది?

ఇరాన్ చమురు ఎగుమతులకు గుండెకాయ వంటి ఖర్గ్ ద్వీపంపై అమెరికా సైన్యం భారీ దాడులకు దిగింది. ట్రంప్ విధించిన గడువులోగా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని డిమాండ్ చేశారు.

ఖర్గ్ ద్వీపం ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఎందుకు ముఖ్యం?

ఇరాన్ దేశం చేసే మొత్తం చమురు ఎగుమతుల్లో సుమారు 90 శాతం ఈ ద్వీపం నుంచే జరుగుతాయి. ఇరాన్ ప్రధాన భూభాగంలోని తీర ప్రాంతాలు పెద్ద చమురు ట్యాంకర్ల రాకపోకలకు అనువైన లోతును కలిగి ఉండవు.

దాడుల తీవ్రత ఎంత ఉంది?

వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ప్రకారం 50కిపైగా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగాయి. అమెరికా వైస్ ప్రెసిడెంట్‌ మాత్రం కేవలం సైనిక లక్ష్యాలను మాత్రమే దెబ్బ తీశామని, చమురు మౌలిక సదుపాయాలకు నష్టం కలగలేదని స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్ కూడా దాడుల్లో పాల్గొందా?

అవును, ఇజ్రాయెల్ సైన్యం కూడా రంగంలోకి దిగింది. ఇరాన్ అంతటా ఉన్న డజన్లు కొద్దీ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని తాము భారీ స్థాయిలో దాడులు పూర్తిగా చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget