అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
James Webb Space Telescope Image: విశ్వం రహస్యం ఇదే- నాసా జేమ్స్ వెబ్ తీసిన తొలి ఫొటో విడుదల!
James Webb Space Telescope Image: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. నాసా జేమ్స్ వెబ్ తీసిన తొలి ఫొటోను విడుదల చేశారు.
James Webb Space Telescope Image: నాసా జేమ్స్ వెబ్ తీసిన తొలి ఫోటోను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విడుదల చేశారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, నాసా అధికారులతో కలిసి ఈ ఫొటోను బైడెన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అసాధ్యం ఏదీ లేదు
" అమెరికా కు అసాధ్యం అంటూ ఏదీ లేదు. ఆరు నెలల క్రితం ఈ డీప్ స్పేస్ టెలిస్కోప్‌ను లక్ష మైళ్ళ అవతల పెడుతున్నాం అని చెప్పారు. అప్పుడే అర్ధమైంది అమెరికా అద్భుతం చేయనుందని. విశ్వంపై అమెరికా ఎలాంటి పరిశోధనలు చేసినా అది యావత్ ప్రపంచం కోసమే. మిగిలిన దేశాలతో కలిసి అమెరికా అనుకున్నది సాధించింది. అంతరిక్షంలోనే కాదు మన భూమిని కాపాడుకునేందుకు కృషి చేస్తున్నాం. వాతావరణ మార్పు పై అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. సైన్స్ కోసం ఎన్ని వేల కోట్లు అయినా ఖర్చు పెడతాం. స్పేస్‌లో మేము సాధించింది భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగం. కమలా హ్యారిస్ నేతృత్వంలోని నాసా టీమ్‌ను అభినందిస్తున్నా. ఇకపై మన అంతరిక్ష పరిశోధనలు సరికొత్త మార్గంలో ప్రయాణం ప్రారంభిస్తాయి. "
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
ఇంకా సాధిస్తాం
" అమెరికా చరిత్రలో ఈ రోజును మర్చిపోలేం. కొన్ని దశాబ్దాల ముందు వరకూ విశ్వాన్ని మనం చూసిన పరిధి చాలా తక్కువ. హబుల్ టెలీస్కోప్ ఆవిష్కరణతో ప్రపంచాన్ని మనం చూసే విధానం మారింది. ఇప్పుడు జేమ్స్ వెబ్ సరికొత్త స్పేస్ సైన్స్ శకం దిశగా మనల్ని నడిపిస్తుంది. ప్రపంచ దేశాలు సైన్స్ ఆవిష్కరణల విషయంలో సహకరించుకుంటే ఫలితం ఇలా ఉంటుంది. యూరోపియన్, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ లు ఈ ప్రాజెక్ట్ లో ఉన్నాయి. జో బైడెన్ నాయకత్వంలో మరిన్ని అద్భుతాలు చేస్తాం "
-కమలా హ్యారిస్, వైస్ ప్రెసిడెంట్, ఛైర్ పర్సన్, నేషనల్ స్పేస్ కౌన్సిల్
ఈ ఫొటో
" ఈ ఇమేజ్ నాసా జేమ్స్ వెబ్ టెలీస్కోప్ తీసిన ఫస్ట్ ఇమేజ్. SMACS 0723 గెలాక్సీ క్లస్టర్ కు సంబంధించిన ఇమేజ్. ఈ ఫోటో అనంతమైన విశ్వంలో ఓ ఇసుక రేణువు. ఆ ఇసుక రేణువు లోనే ఇన్ని గెలాక్సీలున్నాయి. మనకు తెలిసిన విశ్వం 13.8 బిలియన్ సంవత్సరాలు నాటిది. కానీ జేమ్స్ వెబ్ ద్వారా అంతకు ముందు ఉన్న లైట్ ను కూడా పరిశోధిస్తాం. "
-బిల్ నెల్సన్, నాసా అడ్మిన్
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 13,615 కరోనా కేసులు- 20 మంది మృతి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
పాలిటిక్స్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement