Covid Vaccine For Children: పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌లో కీలక ముందడుగు.. ఫైజర్‌కు అమెరికా అనుమతులు
ఫైజర్ కొవిడ్ టీకా పిల్లలకు ఇస్తే దానివల్ల ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని అత్యున్నత స్థాయి కమిటీ నిర్ధారించింది. దుష్ప్రభావాలు, ప్రమాదం కంటే ప్రయోజనాలే అధికమని గత వారం తేల్చింది.
చిన్న పిల్లలకు కరోనా టీకా అందుబాటులోకి వచ్చే ప్రయత్నంలో భాగంగా అమెరికా కీలక అనుమతులు జారీ చేసింది. ప్రముఖ ఫైజర్ కొవిడ్ టీకాను పిల్లలకు ఇచ్చేందుకు అమెరికా అనుమతులు జారీ చేసింది. ఈ టీకాను ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల మధ్య గల పిల్లలకు మాత్రమే ఇవ్వనున్నారు. తాజా అనుమతులతో అమెరికాలో ఉన్న 28 మిలియన్ల మంది పిల్లలు కరోనా వైరస్ నుంచి రక్షణ పొందనున్నారు. ఫైజర్ కొవిడ్ టీకా పిల్లలకు ఇస్తే దానివల్ల ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని అత్యున్నత స్థాయి కమిటీ నిర్ధారించింది. దుష్ప్రభావాలు, ప్రమాదం కంటే ప్రయోజనాలే అధికమని గత వారం తేల్చింది. అనంతరం ఫైజర్ టీకాకు అనుమతి ఇవ్వాలని ఈ అత్యున్నత స్థాయి కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
‘‘ఒక తల్లిగా, ఒక వైద్యురాలిగా.. పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు ఎంత మంది ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు. తల్లిదండ్రులు, సంరక్షకులు, పాఠశాల సిబ్బంది, పిల్లలు ఎంతో మంది పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. చిన్న పిల్లలకు కూడా వ్యాక్సిన్లు వేయడం ద్వారా కొవిడ్ 19 భయానక పరిస్థితుల నుంచి సాధారణ పరిస్థితికి వస్తామని ఆశిస్తున్నాం.’’ అని ఫుడ్, డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ జానెట్ వూడ్ కాక్ ఓ ప్రకటనలో తెలిపారు.
Also Read: ఆరుగంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ మార్పులు తప్పవు
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) క్లినికల్ సిఫార్సులను మరింత చర్చించడానికి మంగళవారం ఒక ప్యానెల్‌ను సమావేశపరిచిన తర్వాత పిల్లలకు టీకా ఇచ్చే వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. ఈ వారం అమెరికా ప్రభుత్వం 50 మిలియన్ల డోసుల వ్యాక్సిన్లను పిల్లల సంరక్షణ కోసం కొనుగోలు చేసిందని ఫైజర్ సహా దాని భాగస్వామి బయోఎన్‌టెక్ ప్రకటించాయి.
Also Read: WHO ON Covaxin: భారత్ టీకాలు భేష్.. కొవాగ్జిన్‌కు త్వరలోనే అనుమతి: డబ్ల్యూహెచ్ఓ
చిన్న పిల్లల కోసం వాడుతున్న ఫైజర్ టీకా క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా దాదాపు 2 వేల మందిని పరీక్షించగా.. దాదాపు 90 శాతం మందిలో మెరుగైన ప్రయోజనాలు కనిపించినట్లుగా వెల్లడైంది. అంతేకాకుండా దాదాపు ఈ టీకా వల్ల ఎలాంటి సీరియస్ ఆరోగ్య సమస్యలు ఎదురు కాలేదని తేలింది.
పిల్లలకు ఈ టీకాను మూడు వారాల వ్యవధిలో రెండు డోసులుగా ఇస్తారు. ఒక్కొక్కటి 10 మైక్రోగ్రాముల మోతాదులో ఇస్తారు. ఇది వయసు పైబడిన వారికి ఇచ్చే మోతాదులో మూడవ వంతు ఉంటుంది.
Also Read: WHO ON Covaxin: భారత్ టీకాలు భేష్.. కొవాగ్జిన్‌కు త్వరలోనే అనుమతి: డబ్ల్యూహెచ్ఓ
Also Read: ఇటలీలో ప్రధానికి ఘన స్వాగతం.. మహాత్ముడికి మోదీ నివాళి