By: ABP Desam | Updated at : 26 Feb 2022 01:37 PM (IST)
ప్రాణత్యాగం చేసిన ఉక్రెయిన్ సైనికుడు, పక్కనే వంతెన
రష్యాతో పోరాటంలో ప్రాణాలు సైతం లెక్కయమని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించాడు. సైనికులు దీన్ని అక్షరాల నిరూపిస్తున్నారు. దేశంలో కోసం తమ ప్రాణాలు ఇచ్చేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు.
రష్యా బలగాలు ఉక్రెయిన్‌ను చుట్టు ముట్టి దేశంపై దండయాత్ర చేశాయి.
క్రిమియా మీదుగా రష్యా బలగాలు చొరబడేందుకు దూసుకొస్తున్నాయి. ఆ టైంలో అక్కడ ఉన్న సైనికులు రష్యా బలగాలను ఎలాగైనా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఎదురు కాల్పులు జరుపారు అయినా రష్యా బలగాలు వెనక్కి తగ్గడం లేదు.
వంతెనే కీలకం
రష్యా ట్యాంకులు వచ్చేందుకు ఉన్న వంతెన మార్గం ఒకటే ఉందని గ్రహించిన సైనికుడు ఒకడు. తన ప్రాణాలను ఫణంగా పెట్టి రష్యా సైనికుల ప్లాన్ మార్చేశాడు. వాళ్లు వచ్చే వంతనను పేల్చేశాడు.
ధైర్యవంతుడా సైనికుడు
బాంబులు వంతెనపైకి వెళ్లి వంతెనపై అమర్చాడు. అక్కడ నుంచి బయటపడేందుకు మార్గం లేక తనను తాను ఉక్రేనియన్ సైనికుడు తనను తాను పేల్చుకున్నాడని మీడియా సంస్థలు నివేదించాయి. ధైర్యవంతుడైన విటాలి స్కాకున్ వోలోడిమిరోవిచ్‌కు ఉక్రెయిన్ సలాం చేస్తోంది.
ఖెర్సన్ ప్రాంతంలోని హెనిచెస్క్ వంతెన వద్ద రష్యన్ యుద్ధ ట్యాంకులను కన్ఫ్యూజ్ చేసి దారి మళ్లించేందుకు విటాలి ప్రాణ త్యాగం చేశాడు.
వీరుడుకి వందనం
జనరల్ స్టాఫ్ ఫేస్బుక్ పేజీలో పెట్టిన పోస్ట్ ప్రకారం రష్యన్ ట్యాంకులు ఆపడానికి ఆపడానికి ఉన్న వంతెనను పేల్చివేయడమే ఏకైక మార్గంగా బెటాలియన్ నిర్ణయించుకుంది. ఆ పని చేయడానికి స్కాకున్ ముందుకొచ్చాడు. అక్కడకు వెళ్లేసరికి రష్యా బలగాలు సమీపంలోకి వచ్చేశాయి. తప్పించుకునే మార్గం లేకపోవడంతో తనను తాను పేల్చుకుంటున్నట్టు సహచరులకు తెలియజేశాడు. అలా చెప్పిన కాసేపటికే పెద్ద పేలుడు వినిపించినట్టు ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. రష్యా ఆక్రమిత క్రిమియాను ఉక్రెయిన్‌తో కలిపే వంతెన ఇది. స్కాకున్ మరణించినట్టు ఉక్రెయిన్ సాయుధ దళాలు ధృవీకరించాయి. దేశం కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడని తెలిపాయి.
స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వోలోడిమిరోవిచ్
పేలుడు పదార్థాలతో బ్రిడ్జ్ పేల్చడానికి వోలోడిమిరోవిచ్ స్వచ్ఛందంగా ముందుకొచ్చినట్టు సాయుధ దళాధికారి తెలిపాడు. పేలుడు పదార్థాలు అమర్చిన తర్వాత తప్పించుకునే ఛాన్స్ లేదని అందుకే పేల్చుకునేందుకు సిద్ధపడినట్టు ఆయన వెల్లడించారు.
తీవ్ర ప్రతిఘటన
రష్యా చర్యలను ఉక్రేనియన్ సాయుధ బలగాలు గట్టిగా ఎదుర్కొంటున్నాయని వాళ్లు ఊహించినదాని కంటే ఎక్కువ ప్రతిఘటన ఎదురవుతోందని ఓ సీనియర్ ఉక్రేనియన్ అధికారి తెలిపారు.
గురువారం తెల్లవారుజామున జరిగిన దాడిలో పుతిన్ దళాల చేతిలో కనీసం 137 మంది ఉక్రేనియన్లు మరణించినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.
ఉక్రెయిన్‌పై దాడి సమయంలో రష్యా దళాలకు చెందిన 2,800 మంది సైనికులను, 80 ట్యాంకుల పేల్చేసినట్టు డిప్యూటీ డిఫెన్స్ మంత్రి హన్నా మాల్యార్ తెలిపారు.
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా
Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం- త్రుటిలో తప్పిన ప్రమాదం!
Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి మూడు నెలలు- పుతిన్ సాధించిందేంటి?
Telangana CM KCR Bengaluru Tour: నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ- బెంగళూరుకు సీఎం కేసీఆర్, ముచ్చటగా మూడోసారి
Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది
Weather Updates: నేడు ఈ జిల్లాల్లో వర్షం, ఎల్లో అలర్ట్ జారీ! ఏపీలో నేడు 2-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం