News
News
X

Russia-Ukraine War: పుతిన్ కనుక ఓ మహిళ అయి ఉంటే: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

Russia-Ukraine War: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ మహిళ అయి ఉంటే ఉక్రెయిన్‌పై యుద్ధం చేసి ఉండేవారు కాదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు.

FOLLOW US: 

Russia-Ukraine War:  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ఓ మహిళ అయి ఉంటే, ఆయన ఉక్రెయిన్‌పై యుద్ధం చేసి ఉండేవారు కాదని బోరిస్ జాన్సన్ అన్నారు.

" ప్రపంచంలో బాలికలు, మహిళలు విద్యావంతులు కావాలి. మరింత ఎక్కువ మంది మహిళలు అధికార స్థానాల్లోకి రావాలన్నారు. పుతిన్ ఉక్రెయిన్‌పై దాడి చేయడం దూకుడు స్వభావంగల మగతనపు లక్షణాలకు నిదర్శనం. ఆయన ఓ మహిళ అయి ఉంటే కచ్చితంగా ఉక్రెయిన్‌పై యుద్ధం చేసేవారు కాదు. ఈ యుద్ధం ముగిసిపోవాలని అందరూ కోరుకుంటున్నాం.                                                               "
-  బోరిస్ జాన్సన్, యూకే ప్రధాని

ఉక్రెయిన్‌పై

మరోవైపు రష్యా మాత్రం ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రం చేసింది. ఇటీవల జీ7 దేశాల అధినేతల భేటీ జరుగుతున్న వేళ ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహా పలు నగరాలపై రష్యా విరుచుకుపడింది. పోల్తోవా ప్రాంతంలోని క్రెమెన్‌చుక్‌ నగరంలో ఉన్న షాపింగ్‌ మాల్‌పై సోమవారం క్షిపణులతో దాడి చేసింది. ఆ సమయంలో 1000కు పైగా పౌరులు ఆ ప్రాంతంలో ఉన్నారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.

ఈ దాడిలో 10 మంది పౌరులు మృతి చెందారని, 40 మందికి పైగా గాయాలయ్యాయని, ఇందులో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య ఇంకా భారీగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.

ఇంకెన్నాళ్లు

దాదాపు నాలుగు నెలలుగా జరుగుతున్న ఈ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగేలా ఉందని ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి (నాటో) సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్తెన్‌ బర్గ్‌ అంచనా వేశారు. యుద్ధానికి ముగింపు ఎప్పుడనేది ఎవరికీ తెలియదన్నారు. ఇది కొన్నేళ్లపాటు కొనసాగుతుందనుకుని సిద్ధపడాలన్నారు.

ఇంధన, ఆహార ధరలకు కళ్లెం వేయడానికి వీలుగా ఉక్రెయిన్‌కు సాయం అందించాలని సభ్య దేశాలను కోరారు. 2014లో క్రిమియాను ఆక్రమించుకున్న రీతిలోనే ఉక్రెయిన్‌ విషయంలో రష్యా చేస్తే తాము మరింత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.

Also Read: Maharashtra Political Crisis: 'కాస్త పంపించండి, ఓటేసి వస్తాం'- సుప్రీంలో పిటిషన్ వేసిన ఆ ఇద్దరు

Also Read: Udaipur Murder Case: 'ఉదయ్‌పుర్‌' హంతకులను వెంటాడి పట్టుకున్న పోలీసులు- వీడియో చూశారా?

Published at : 29 Jun 2022 05:35 PM (IST) Tags: Putin Russia-Ukraine war Ukraine war Johnson

సంబంధిత కథనాలు

Revenge Lover : ప్రియుడు మోసగాడని ఫుల్ పేజీ యాడ్ ఇచ్చిన లవర్ - తర్వాతే అసలు ట్విస్టులు

Revenge Lover : ప్రియుడు మోసగాడని ఫుల్ పేజీ యాడ్ ఇచ్చిన లవర్ - తర్వాతే అసలు ట్విస్టులు

Johnson Baby Powder: ఆ బేబీ టాల్కమ్ పౌడర్ ఇకపై కనిపించదు! కీలక నిర్ణయం తీసుకున్న కంపెనీ

Johnson Baby Powder: ఆ బేబీ టాల్కమ్ పౌడర్ ఇకపై కనిపించదు! కీలక నిర్ణయం తీసుకున్న కంపెనీ

Salman Rushdie: ఎవరీ సల్మాన్ రష్దీ? ఆయన రాసిన బుక్‌ ఎందుకు వివాదాస్పదమైంది?

Salman Rushdie: ఎవరీ సల్మాన్ రష్దీ? ఆయన రాసిన బుక్‌ ఎందుకు వివాదాస్పదమైంది?

Salman Rushdie: వెంటిలేటర్‌పై సల్మాన్ రష్దీ, ఓ కన్ను కోల్పోక తప్పదేమో - న్యూయార్క్ టైమ్స్ కథనం

Salman Rushdie: వెంటిలేటర్‌పై సల్మాన్ రష్దీ, ఓ కన్ను కోల్పోక తప్పదేమో - న్యూయార్క్ టైమ్స్ కథనం

Salman Rushdie : ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై హత్యాయత్నం, కత్తితో దాడి చేసిన దుండగుడు

Salman Rushdie : ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై హత్యాయత్నం, కత్తితో దాడి చేసిన దుండగుడు

టాప్ స్టోరీస్

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి అన్ని గంటలు వేచి చూడాలి: టీటీడీ

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి అన్ని గంటలు వేచి చూడాలి: టీటీడీ

Global Healthcare Summit: గ్లోబల్ హెల్త్ స‌మ్మిట్‌‌లో పాల్గొనండి - ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఆహ్వానించిన ఎన్నారై డాక్టర్లు

Global Healthcare Summit: గ్లోబల్ హెల్త్ స‌మ్మిట్‌‌లో పాల్గొనండి - ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఆహ్వానించిన ఎన్నారై డాక్టర్లు

NTR In Oscar Race : హాలీవుడ్ హీరోలతో పోటీ - ఎన్టీఆర్‌కు ఆస్కార్?

NTR In Oscar Race : హాలీవుడ్ హీరోలతో పోటీ - ఎన్టీఆర్‌కు ఆస్కార్?

Sunday Funday: నేడు ‘సండే ఫండే’, సింపుల్‌గా ఇలా పార్కింగ్ చేస్కోండి! ట్రాఫిక్‌‌లో ఇరుక్కోకుండా ఇలా వెళ్లొచ్చు!

Sunday Funday: నేడు ‘సండే ఫండే’, సింపుల్‌గా ఇలా పార్కింగ్ చేస్కోండి! ట్రాఫిక్‌‌లో ఇరుక్కోకుండా ఇలా వెళ్లొచ్చు!